Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ఏప్రిల్ 25న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.***ఉచిత దర్శనం టిక్కెట్ల జారీ TTD వారు, ప్రతి రోజు తిరుపతిలో 30,000 ఉచిత దర్శన టిక్కెట్లను (రోజుకు) దిగువ ప్రదేశాలలో జారీ చేయనుంది • భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి బస్టాండ్ దగ్గర) * శ్రీనివాసం కాంప్లెక్స్ (బస్టాండ్ దగ్గర)** గోవిందరాజ స్వామి చౌల్ట్రీ (రైల్వే స్టేషన్ వెనక)@.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

ఇవ్వడానికి నీ దగ్గర ఏముందో తెలుసుకో | Hindu Temple Guide

ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది తెలుసుకో:
ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది తెలుసుకో మేము బీదవాళ్ళము ఇవ్వడానికి ఏమీ లేదు అని మీరు అనుకుంటే అది మీ పొరబాటు..దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన చిరు నవ్వు , పదునైన మాట అనే ఆయుదం మీ దగ్గర ఉంది. ఒక మనిషిని నవ్వుతూ పలకరించడం, బాధలో ఓదార్చడం , కష్టంలో వెంట నిలవడం , భయపడ కుండా నేను ఉన్నాను అని తోడు చెప్పడం ఇవన్నీ మీరు ఇవ్వగలిగినవే. అలాగే కొందరి చాడీలు చెప్పే గుణం వల్ల కాలక్షేపం కోసం చేసే నిందలు వల్ల కొందరి జీవితమే నాశనం అవుతుంది కుటుంబాలు కూలిపోతుంది,అది మహా పాపం . మంచి మాటలు మాట్లాడాలి మీ మాటతో ఆత్మ హత్య చేసుకోవాలి అనుకునే వారి మనసు మార్చగలరు, కుటుంబన్ని కలప గలరు. ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వగలరు. అనారోగ్యంతో ఉన్న వారికి సేవచేయగలరు. సహాయం అంటే ధనమే అనుకుంటే డబ్బు ఉన్న వారికి మనిషి తోడు అవసరం ఉండదుకాని డబ్బు లేకున్నా మనిషి బతుకుతున్నారు కానీ ఇంకో మనిషి తోడు లేకుండా కాటికి కూడా చెరలేడు. ఎన్ని రోజులు బతుకుతాము తెలియదు ఉన్న రోజుల్లో కలిగిన దాంట్లో సంతోషం ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న తప్పులు క్షమిస్తే వ్యక్తులు మధ్య బంధం బల పడుతుంది. నిజం చెప్తే చిన్న మాటతో పోతుంది అపద్దo చెప్తే నమ్మకం పోతుంది. నీవల్ల ఒకరికి కోపం వస్తే క్షమించండి అంటే సరిపోతుంది సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. నీ పైన నమ్మకం పోతే ఆ బంధం తెగిపోతుంది. పగ ప్రతికారం తో రగిలిపోవడం అంటే నీకు నువ్వు విషాన్ని నింపుకోవడం అంటే అనారోగ్యం తెచ్చుకుంటారు అందుకే ద్వాషాన్ని వదిలేయాలి.

దానం ధర్మం:
అవంతీపురం అనేరాజ్యాన్ని విజయుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజు భార్య మందార- వారికి సంతానం లేదు; అందుకని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ రాజు మాత్రం తన రాజ్యంలోని ప్రజలను చాలా పీడించి, హింసించి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాదు- కరువుకాటకాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను పట్టించు-కునేవాడు కాదు. పైపెచ్చు వారిపైన ఇంకా ఎక్కువ పన్నులు వేసి, పన్నులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేసేవాడు. తన ఖజానాలోని డబ్బులను ఎంత మాత్రం ఖర్చు చేసేవాడు కాదు. ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడుకాదు.

రాజు రాణి ఇద్దరూ సంతానం కోసం తిరగని చోటు లేదు; చూడని గుడి లేదు. చివరికి, అట్లా తిరుగుతూ,తిరుగుతూ వాళ్ళు ఒక ముని ని కలుసుకున్నారు.
అప్పుడు ఆ ముని తన దివ్య దృష్టితో చూసి, రాజుతో "చూడండి, మీరు చేసిన పాప ఫలం ఇది. ఇప్పటికైనా గుర్తించండి- ప్రజలంటే ఎవరో కాదు- రాజుకు ప్రజలంతా బిడ్డలే. అలాంటి ప్రజలను పీడించటం వల్ల మీకంటూ వేరే సంతానం కలగలేదు. కాబట్టి, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు మీ పిసినారి తనాన్ని విడిచిపెట్టాలి. ఘనంగా దాన ధర్మాలు చేయాలి. పేదలను హింసించకూడదు . అప్పుడు, మీ పుణ్యం కొద్దీ మీకు సంతానం కలుగుతుంది" అని చెప్పాడు.
ఆ మాటలు రాజు-రాణి ఇద్దరిలోనూ అలజడి రేపాయి. వాళ్ళు మునికి ధన్యవాదాలు చెప్పి తమ రాజ్యానికి వెళ్ళారు. అటుపైన రాజుగారు పూర్తిగా మారిపోయినట్లు, గుడులు, సత్రాలు కట్టించాడు; దానధర్మాలు చేశాడు; బలవంతపు పన్నుల వసూళ్లు మానుకున్నాడు; 'ఆ రాజు-ఈ రాజు ఒకరేనా' అన్నట్లు ప్రవర్తించాడు.

అనతి కాలంలోనే ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. రాజు, రాణి, రాజ్య ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. ఆ పాప పుట్టిన తరువాత కొన్నేళ్ళపాటు రాజ్యం చాలా సుభిక్షంగా ఉండింది. సకాలానికి వర్షాలు వచ్చాయి; పంటలు బాగా పండాయి; ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు- రాజ్యంలో మళ్ళీ‌ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఏడాది.

ప్రజల మేలు కోసం ఖజానాలోంచి డబ్బులు బయటికి తీయాలనేసరికి రాజుకు మళ్ళీ లోభం పుట్టింది. 'ప్రజావసరాలు తీరాలంటే ప్రజలు పన్ను కట్టకపోతే ఎలా?'అన్నాడు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి- రాజుగారు ప్రజలను హింసించడం మళ్ళీ నిత్య కృత్యమైంది. ఈలోగా రాజు కూతురు కూడా పెరిగి పెద్దదైంది.

ఒక రోజు పాపకు జబ్బు చేసింది. రాజు వైద్యులకు చూపించాడు, కాని జబ్బుమాత్రం తగ్గలేదు. రాజ్యంలోని వైద్యులందరిని పిలిపించి పాప జబ్బును నయం చేయమన్నాడు రాజు. కానీ ఏవైద్యుడూ పాపకొచ్చిన జబ్బును నయం చేయలేకపోయాడు.

రాజుకు చాలా భయం వేసింది. ఒక్కగానొక్క పాప దూరం ఐపోతుందేమోనని బాధపడ్డాడు, చివరికి ఆ సమయంలో రాజుకు ముని గుర్తుకొచ్చాడు. "రాజుకు ప్రజలంతా బిడ్డలే" అని ముని చెప్పటం గుర్తుకొచ్చింది. 'తను ఆ సంగతిని ఎంత త్వరగా మర్చిపోయాడు?!' అని విచారం వేసింది. పశ్చాతాపంతో రాజు మునిని స్మరించి, తనను క్షమించమని వేడుకొన్నాడు. ఆక్షణంలోనే ఆయన తన మనసును ప్రజా సంక్షేమం వైపుకు మరల్చాడు. ప్రజలనుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని తిరిగి వాళ్ళకోసమే ఖర్చు చేసేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు. పంటకాలువలను, చెరువులను, నీటి పారుదల వ్యవస్థలను, జల సేకరణ వ్యవస్థలను బలోపేతం చేసేసరికి, రాజ్యం మళ్లీ ఒక గాటన పడింది.

ఆలోగా యువరాణి ఆరోగ్యమూ బాగుపడింది. తను మంచిపనులు చేయటం వల్లనే తన కూతురు బ్రతికిందన్న విశ్వాసంవల్లనేమో, రాజు అటుపైన ఎన్నడూ ప్రజల్ని కష్టపెట్టలేదు. కాలక్రమేణా ఆయనలోని క్రూరత్వం అంతా పోయి, సహజమైన దయాగుణం వేళ్ళూనుకున్నది. 'విజయ మహారాజు మంచివాడు' అన్న ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది.

Famous Books:

దానగుణం, dhanam dharmam, dharmam quotes in tamil, dhanam in tamil, dhana dharmam telugu, devotional story Telugu, 

Comments

Popular Posts