Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

స్త్రీలు సాస్టాంగనమస్కారం ఎందుకు చేయకూడదు?Why women are not doing sashtanga namaskaram?

స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు...?
హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో
ఒకటి సాష్టాంగ నమస్కారం
రెండవది పంచాంగ నమస్కారం
భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.
కానీ స్త్రీలు సాష్టాంగ్ నమస్కారం చేయకూడదు.
అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి?

సాష్టాంగ నమస్కారం : స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం.

ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి చేయునది ఇలా పురుషులు చేయవచ్చు .
కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి దర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.

ఇంకా చెయ్యాలనుకుంటే నడుం వంచి ప్రార్థించివచ్చు. ఇలా శరీర భౌతిక నిర్మాణాన్ని బట్టి ఈ సూచన చేయబడింది.

అది పాటించడం వల్ల స్త్రీల ఆరోగ్యానికి మేలు జరగుతుంది. స్త్రీలు నమస్కరించుకోవాలనుకొన్నప్పుడు‘పంచాగ నమస్కారాన్ని 'అంటే కాళ్ళు, చేతులు, నుదురు మాత్రమే తాకేలా నమస్కరించుకోవడం మంచిది.

అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కారించడమో, ధ్యానించడమో లేక మోకాళ్ళపై ఉండి మోకరిల్లడమో(పంచాంగనమస్కారం) చేస్తే చాలు అని చెప్పారు....

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది. అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు తెలుసుకుందాం..
ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. -
> > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ముచ్యతే <<
“అష్టాంగాలు” :- అంటే “ఉరసా” అంటే తొడలు, “శిరసా” అంటే తల, “దృష్ట్యా” అనగా కళ్ళు, “మనసా” అనగా హృదయం, “వచసా” అనగా నోరు, “పద్భ్యాం” అనగా పాదములు, “కరాభ్యాం” అనగా చేతులు, “కర్ణాభ్యాం” అంటే చెవులు. ఇలా “8 అంగములతో నమస్కారం” చేయాలి.

''మానవుడు" సహజంగా ఈ “8 అంగాలతో” తప్పులు చేస్తుంటారు. అందుకే “దేవాలయంలో” బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ “దేవునికి” నమస్కరించి “ఆయా అంగములు” నెలకు తగిలించాలి.
ఇలా చేయడం వల్ల “మనం” చేసినటువంటి “పాపాలు” తొలగి “పుణ్యం” లభిస్తుంది.

ముఖ్యంగా :- “దేవాలయంలో” సాష్టాంగ నమస్కారం “దేవుడికి, ధ్వజస్తంభానికి” మధ్యలో కాకుండా “ధ్వజస్తంభం” వెనుక చేయాలి.
1) ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో
మాట పలుకుతూ నమస్కరించాలి.

6) పద్భ్యాం నమస్కారం - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) కర్ణాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులుతూ ఉండాలి.
సాష్టాంగ నమస్కారం:
మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.
Famous Temples:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


స్త్రీలు, సాష్టాంగ నమస్కారం, స్త్రీలు సాష్టాంగ నమస్కారం, sashtanga namaskaram?, sashtanga namaskaram in temple, sashtanga namaskar benefits, women sashtanga namaskaram, sashtanga namaskaram images

Comments

Popular Posts