Drop Down Menus

ఇలా చేస్తే రోజుకు రూ.1200 సంపాదన ఫుడ్ బిజినెస్ | How to Start Egg Roll Business?


సాయంత్రం వేళ ఖాళీగా ఉన్నారా.. ఇలా చేస్తే రోజుకు రూ.1200 సంపాదన..
 సీజన్‌తో సంబంధం లేకుండా ఆదాయం సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పాలి. ఈ రంగంలో లాభం రెండు నుంచి మూడింతల లాభం వస్తుందంటే మీకు నమ్మకం కలగక పోవచ్చు.

 ఫుడ్ బిజినెస్ రంగానికి ఎప్పుడూ తిరుగులేదనే చెప్పాలి. సీజన్‌తో సంబంధం లేకుండా ఆదాయం సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ అనే చెప్పాలి. ఈ రంగంలో లాభం రెండు నుంచి మూడింతల లాభం వస్తుందంటే మీకు నమ్మకం కలగక పోవచ్చు. కానీ ఇది నిజం ఈ సారి మనం ఒక కొత్త తరహా ఫాస్ట్ ఫుడ్ అలాగే హెల్తీ ఫుడ్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ మోడల్ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, కాస్త కొత్తగా ట్రై చేస్తే మాత్రం లాభాల పంట సాధ్యం అవుతుంది.

ఈ ఫాస్ట్ ఫుడ్‌ను ముఖ్యంగా యువతతో పాటు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ లైక్ చేస్తారనే చెప్పవచ్చు. అలాంటిదే ఓ బిజినెస్ గరించి తెలుసుకుందాం. వెజ్, నాన్ వెజ్, ఎగ్ రోల్స్ ప్రస్తుతం మనకు సినిమా థియేటర్లు, పార్కులు, బస్టాండ్లు, ఎగ్జిబిషన్లలో ఈ స్టాల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూడుల్స్, మంచురియా, ఫ్రైడ్ రైస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ తో పాటు వెజ్, నాన్ వెజ్, ఎగ్ రోల్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సింది. మంచి రద్దీ ఉన్న ప్రాంతంలో ఓ షాపు కావాలి. లేదా ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లో చిన్న స్టాల్ పెట్టుకునే స్థలం సరిపోతుంది.

షాపు, లేదా స్టాల్ ఏర్పాటు చేసేందుకు అద్దె నెల వారీగానూ లేదంటే, సంవత్సరం ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దె అనేది మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. సుమారు నెలకు రూ.5000 అనుకుందాం. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ స్టాల్ కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి. దీని స్టీల్ కౌంటర్ సైజును బట్టి దీని ధర 10 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉంటుంది. స్టీల్ కౌంటర్ లో గ్యాస్ స్టౌ ఏర్పాటు చేసుకునేందుకు బర్నర్స్, సిలిండర్, ముడి సరుకులు పెట్టుకునేందుకు స్థలం ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే స్టాల్ ముందు టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేసుకుంటే దాని ఖర్చు రూ.3 వేల దాకా ఖర్చు అయ్యాయి. ఇలా మీ వ్యాపారం సైజును బట్టి పెట్టుబడి అదనంగా పెట్టుకుంటూ వెళ్లాలి.

ఇక ఎగ్ రోల్స్ తయారీకి చపాతీలు తయారుచేసుకోవాలి. ఉదాహరణకు 1 కేజీ గోధుమ పిండి ఖరీదు రూ.40 ఉంటే, అందులో పాలు, ఉప్పు, నూనె ఖర్చు రూ.10 అవుతాయి. ఒక కేజీ పిండితో మొత్తం 25 చపాతీలు తయారు చేసుకోవచ్చు. అయితే వెజ్, నాన్ వెజ్, ఎగ్ రోల్స్ తయారీకి ఈ చపాతీలను పెనంపై నూనె లేకుండా కాల్చుకొని పెట్టుకోవాలి. ఎగ్, నాన్ వెజ్ రోల్స్ తయారీకి ముందుగా కాల్చిన రోటీని నూనె, లేదా వెన్నతో కాల్చి దానిపై కోడి గుడ్డు సొన వేసి ఒక వైపు కాల్చుకోవాలి. ఆ తర్వాత దానిపై స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, క్యాబేజీ, క్యాప్సికం, కేరెట్ ముక్కలు వేసి అందులో టోమోటో సాస్, వెనిగర్, లాంటివి వేసుకోవాలి. నాన్ వెజ్ రోల్ అయితే అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల చికెన్ కర్రీ వేసి, రోల్ చేసి ఓ పలుచటి కాగితంలో చుట్టి రోల్ తయారు చేసి అమ్ముకోవచ్చు.

ఎగ్ రోల్స్‌తో లాభం పొందండిలా...
25 చపాతీలకు ఖర్చు రూ. 50
25 కోడి గుడ్లకు = 100
ఆయిల్, గ్యాస్, కూరలు, వంటసామాన్ల ఖర్చు రూ.50
మొత్తం 25 ఎగ్ రోల్స్ కు పెట్టుబడి రూ. 200 ఖర్చు అవుతుంది.అయితే ఒక ఎగ్ రోల్ తయారీకి రూ. 8 ఖర్చు అవుతుంది.
స్టాల్ వద్ద ఎగ్ రోల్ ధర రూ.20 నుంచి రూ.30 దాకా పెట్టి అమ్మవచ్చు. (ధర ఏరియాను బట్టి మారుతుంది)
అంటే ఒక ఎగ్ రోల్ మీద మీకు రూ. 12 లాభం వస్తుంది.
కాగా రోజుకు 100 ఎగ్ రోల్స్ అమ్మినా సుమారు 1200 లాభం పొందవచ్చు.
నాన్ వెజ్ రోల్స్ ధర రూ. 50 నుంచి రూ.100 దాకా పెట్టి అమ్మవచ్చు. అప్పుడు మీరు పొందే లాభం మార్జిన్ మరింత పెరుగుతుంది.

బిజినెస్ టిప్...
కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు కళ్లముందే రోల్ తయారు చేసి అమ్మితే కస్టమర్లు ఇష్టపడతారు. వెజ్ రోల్స్ లో అయితే ఆలుగడ్డ కూర, లేదా క్యాబేజీ కూర వేసి రోల్ చేసి ఇవ్వాలి. కస్టమర్ టేస్టును బట్టి చికెన్, మటన్, ఎగ్, పనీర్, మష్రూమ్, వెజ్, రోల్స్ వివిధ ధరల్లో అందుబాటులో ఉంచుకోవాలి. చీజ్, బటర్, కూడా కలిపితే రోల్ ధర పెరుగుతుంది. అలాగే మీ లాభం కూడా పెరిగే చాన్స్ ఉంది.
Famous Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి

దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 ల‌క్ష‌లు ఇస్తారు..

egg roll business in india, how to start egg roll business, egg roll business plan, how to start a roll business in india, how to open a roll shop, egg roll price in india, egg roll machine price in india, how much income a chicken roll shop, kathi roll franchise cost
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.