Drop Down Menus

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన | Business Ideas

మహిళలు తమ ఇంటివద్దే ఉంటూ కూడా మంచి సంపాదన సంపాదించవచ్చు. ఇఫ్పుడు అలాంటిదే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో నగరాల్లో బ్యాచిలర్స్, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగులు తమ వంట తామే చేసుకొని టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేసుకునే టైం లేక, హోటల్స్, మెస్సులను ఆశ్రయిస్తున్నారు.

ప్రతీ ఒక్కరు బిజినెస్ రంగంలో రాణించాలని అనుకుంటారు. అయితే బిజినెస్ అనగానే పెద్ద పెద్ద బిజినెస్‌లే గుర్తుకు వస్తాయి. అయితే చిన్న చిన్న బిజినెస్ లు చేసే వారు సైతం నెలకు లక్షలు గడిస్తున్నారు. అయితే మహిళలు తమ ఇంటివద్దే ఉంటూ కూడా మంచి సంపాదన సంపాదించవచ్చు. ఇఫ్పుడు అలాంటిదే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో నగరాల్లో బ్యాచిలర్స్, అలాగే స్టూడెంట్స్, ఉద్యోగులు తమ వంట తామే చేసుకొని టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేసుకునే టైం లేక, హోటల్స్, మెస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇంటి వాతావరణంలోని భోజనం ప్రతిరోజు వీరికి అందుబాటులోకి తెస్తే అది ఒక చక్కటి వ్యాపారంగా మారుతుంది. ముంబైలో డబ్బా వాలా అనే బిజినెస్ లో ఇంటివద్ద వారి కుటుంబ సభ్యులు తయారుచేసిన భోజనం డబ్బాలను ఆఫీసులకు అందిస్తారు. అయితే మనం డిస్కస్ చేస్తున్న ఈ బిజినెస్ ప్లాన్ లో ఇంటివద్దే టిఫిన్ బాక్సులను ప్రిపేర్ చేసి వారి ఆఫీసులు, కాలేజీలు, హాస్టల్స్ కు సరఫరా చేస్తే మంచి ఆదాయం లభిస్తుంది.

పని చేస్తున్న చోటు వద్దకే టిఫిన్ బాక్స్ అందజేస్తే, కస్టమర్లకు సంతృప్తి లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే బ్యాచిలర్లు, సొంత గ్రామాలకు దూరంగా చదువుకునే స్టూడెంట్స్ కు ఈ సర్వీస్ ఉపయోగ పడుతుంది. ఈ బిజినెస్ ఏర్పాటు చేసుకునేందుకు మనకు ముుందగా ఒక మంచి విశాలమైన గది ఏర్పాటు చేసుకోవాలి. అందులో గాలి వెలుతురు ఉండాలి. అలాగే వంట సామాగ్రి కొనుగోలు చేసుకోవాలి. కమర్షియల్ స్కేల్ కాబట్టి, పెద్ద సైజు వంట పాత్రలు కొనుగోలు చేసుకోవాలి. ఖాళీ టిఫిన్ బాక్సులు కొనుగోలు చేసుకోవాలి. అలాగే బిజినెస్ ప్లాన్ పెద్ద ఎత్తున చేపడితే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కోసం FSSAI license, GST Registration, Municipal health trade licenses, fire license సహా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. FSSAI license ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

బిజినెస్ టిప్...
- నాన్ వెజ్ మీల్స్ ధర రూ.80 నుంచి రూ. 100 దాకా వసూలు చేయవచ్చు.
- అలాగే మీల్స్ తో పాటు ఆమ్లెట్ కూడా జత చేస్తే మీల్స్ కు అదనంగా రూ.10 నుంచి రూ.20 దాకా చార్జ్ చేయవచ్చు.
- అలాగే ఆర్డర్లు 5-10 కిలోమీటర్ల లోపే తీసుకుంటే మరింత మేలు.
- నెల నెల మెస్ కార్డుల తరహాలో కస్టమర్ల నుంచి పేమెంట్స్ తీసుకుంటే మరింత మేలు.
- ఆఫీసులు, కాలేజీలు, వాణిజ్య సముదాయాల వద్ద నుంచి ఆర్డర్లు తీసుకుంటే దూరభారం తగ్గుతుంది. ఎక్కువ చోట్ల తిరిగే పని ఉండదు.
- క్వాలిటీ బియ్యం, కూరలతో పాటు హోమ్లీ టేస్ట్ ఎల్లకాలం మెయిన్ టెయిన్ చేయాలి.
- మెను వారానికి 6 రోజుల్లో ఆరు వెరైటీల కూరలు, మారుస్తూ ఉంటే మేలు.
- లంచ్ బాక్సులను మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోగా కస్టమర్లకు అందేలా ప్లాన్ చేసుకోవాలి.
Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Business, business ideas, online business, small business, food business, hotel business, restaurant business,
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON