Drop Down Menus

50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి | How to Start French Fries Making Business

రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండిలా..
ఫుడ్ బిజినెస్ లో లాభం దాదాపు 50 శాతం దాకా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో కాంపిటీషన్ ఎక్కువనే చెప్పాలి. రోడ్డు పక్కన ఇడ్లీ బండి మొదలు ఫైవ్ స్టార్ హోటల్ వరకూ ఎవరికి వారే పోటీ అనే చెప్పాలి. అయినప్పటికీ నిత్యం ఆదాయం ఇచ్చే బిజినెస్ లలో ఫుడ్ బిజినెస్ మొదటి స్థానంలోనే ఉంది. ఎందుకంటే తినే తిండికి సీజన్ అనేది ఉండదు. మనిషికి ప్రతీ పూట తినేందుకు తినుబండారాలు కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ ఐడియాల్లో భాగంగా ఓ కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం.

ఆలు చిప్స్ కన్నా ప్రస్తుతం బాగా డిమాండ్ లో ఉన్న మరో బిజినెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే చెప్పాలి. ఈ బిజినెస్ అటు మాల్స్, సినిమా థియేటర్స్, థీమ్ పార్క్స్ లో బాగా వర్కౌట్ అవుతోంది. అంతేకాదు బేకరీలకు అనుబంధంగా కూడా ఈ బిజినెస్ చేస్తే అదనపు ఆదాయం వస్తుంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ కోసం మనకు కావాల్సింది. ఫ్రై చేసేందుకు మెషిన్ అవసరం ఉంటుంది. దీని కోసం కమర్షియల్ ఎలక్ట్రిక్ డీప్ ఫ్రయర్ మెషిన్ అవసరం అవుతుంది.

దీని కోసం మార్కెట్లో Commercial Electric Deep Fryer Machine కొనుగోలు చేయాలి. అలాగే దీని కెపాసిటీ 6 లీటర్లు ఉంటుంది. దీని ఖర్చు రూ.3 వేలు దాకా ఉంటుంది. అలాగే FROTH & FLAVOR Commercial Double Tank deep Fryer 8+8 LTR మెషిన్ అయితే దాదాపు రూ. 6 వేలు అవుతుంది. అలాగే Stainless Steel Potato Chipser French Fries Chips Maker Machine Snacks Finger, ఆలుగడ్డలను ఫ్రెంచ్ ఫ్రైస్ గా కట్ ఛేసే మెషిన్ 800 నుంచి 1000 రూ.ల మధ్య మార్కెట్లో దొరుకుతుంది. ఒక స్టెయిన్ లెస్ టీ స్టాల్ కొనుగోలు చేయాలి. దీని ఖర్చు సుమారు రూ. 15 వేల నుంచి ప్రారంభమై రూ. 50 వేల దాకా ఉంటుంది. ఇలా స్టాల్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం ఖర్చు రూ. 50 వేల దాకా అవుతుంది.

ఇక ముడిసరుకు కింద ఆలు గడ్డలు కొనుగోలు చేసుకోవాలి. మార్కెట్లో ఆలుగడ్డలు పెద్ద సైజువి ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఫ్రైస్ పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. అయితే ఆలుగడ్డలు పెద్దగా ఉంటేనే ఫలితం ఉంటుంది. ఇక ఆయిల్ కూడా రోజుకు 6 లీటర్ల దాకా ఖర్చు అవుతుంది. మంచి బ్రాండెడ్ ఆయిల్ వాడాలి. ఏ రోజుకు ఆరోజు నూనెను ఫ్రెష్ గా మార్చేయాలి.

ప్రస్తుతం మార్కెట్లో వంటనూనెల ధరలు తక్కువగానే ఉన్నాయి. పామాయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ ఎంపిక చేసుకోవచ్చు. క్వాలిటీ మెయిన్ టైన్ చేస్తేనే కస్టమర్లు మరలా మరలా వస్తుంటారు. ఇలా స్టాల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్థానిక మున్సిపాలిటీ లైసెన్స్ తో పాటు, FSSAI రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫ్రెంచ్ ఫ్రైస్ సర్వ్ చేయడానికి కార్డు బోర్డుతో తయారుచేసిన చక్కటి ప్యాకింగ్ కవర్లు కావాలి.

లాభం పొందండిలా... రైతుల వద్ద నుంచి డైరక్టుగా ఆలుగడ్డలు(పెద్ద సైజువి) తీసుకుంటే మీకు మరింత తక్కువ రేటుకే లభిస్తుంది. అలాగే నూనెలు కూడా హోల్ సేల్ గా టిన్నుల లెక్కన కొనుగోలు చేసుకోవాలి. మార్కెట్లో 100 నుంచి 150 గ్రాములు ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ. 50 నుంచి రూ. 80 దాకా చార్జ్ చేస్తున్నారు. అయితే వీటి తయారీకి మనకు అయ్యే ఖర్చు మాత్రం రూ. 20 లు మాత్రమే. అంటే 4 రెట్ల లాభం పొందే అవకాశం ఉంది.

ఉదాహరణకు
1 కప్ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర...రూ.60
అయ్యే ఖర్చు....రూ. 20
అంటే లాభం....రూ. 40
రోజుకు 60 కప్పులు అమ్మితే మనకు దక్కేది రూ. 2400
అంటే 30రోజుల పాటు ఈ వ్యాపారం చేస్తే మనకు
30 X 2400 = రూ.72000 ఆదాయం
నెలకు సుమారు రూ. 72000 ఆదాయం లభిస్తుంది.

Related Posts:
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

french fries, french fries recipe indian, french fries recipe at home, french fries origin, how to make french fries crispy, french fries ingredients, business ideas.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.