Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

కరోనా కర్కటి రాక్షసి కథ | బ్రహ్మ చెప్పిన మంత్రం | Vasista Rama Samvadam Or Yoga Vasistam


వేలాది సంవత్సరాల క్రితం హిమాలయాలకు ఉత్తరాన మానవాళిపై విరుచుకుపడిన 'కర్కటి' అనే మహమ్మారే ఇప్పుడు 'కరోనా' పేరుతో మానవాళిని కబలిస్తోందని అంటున్నారు. కరోనా యుగాల క్రితమే వచ్చింది . కర్కటి అని ఓ మహారాక్షసి. దానిది అంతులేని ఆకలి. దానికి వరమిచ్చిన బ్రహ్మ దాన్ని అంతం చేయడానికి చెప్పిన మంత్రం..

కరోనా వచ్చిన నేపథ్యంలో అనేకానేక కథలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ప్రధానమైనవి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి వ్యాధి, యోగా వాసిష్ఠంలో కర్కటి కథ. ప్రస్తుతం యోగా వాసిష్ఠంలో కర్కటి కథ తెలుసుకుందాం…
యోగా వాసిష్ఠంలో కర్కటి అని ఓ మహారాక్షసి. దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు.

ఇలా కాదు; భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకేసారి మింగ గలిగితే ఎంత బాగుండు. అనేది దాని బాధ. అలా అయితే కానీ నాకు కడుపు నిండదు. అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది.ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది.
Also Read : నీటి ఆవిరితో కరోనా మాయం.
హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు. “ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయంలోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోంచేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు.

నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువు ద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయ ప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అని బ్రహ్మ దేవుడు చెప్పాడు.. అవి .. తినకూడని వాటిని తినేవారిని,చెయ్యకూడని పనులు చేసేవారిని, చెడు ప్రదేశాల్లో ఉండేవారిని, శాస్త్ర వ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను సుబ్బరంగా హింసించి ఆరగించవచ్చు.
Also Read : కరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
అయితే ఈ మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ కొన్ని వరాన్ని మానవులకు ఇచ్చాడు.. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికా వ్యాధి కోరల నుంచి తప్పించుకోగలరని తెలిపారు.వేల సంవత్సరాల కిందటి యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో,పక్క వాటాలోనో కాపురం పెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం అహర్నిశలు కష్టపడుతూ పరిశోధనలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కనీసం ఏడాది పట్టవచ్చు. అయితే అప్పటి వరకు మనకు కేవలం నియంత్రణ, ఎవరికి వారే ప్రభుత్వం చెప్తున్న నియమాలను, లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి. ఎవరికి వారే బాగుండటమే కాకుండా ఇంట్లో కూర్చుని లోక శ్రేయస్సుకు పాటుపడే అద్భుత అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటే లోకానికి మంచిది.
అయితే యోగా వాసిష్ఠంలో బ్రహ్మగారు విషూచిక మంత్రం తెలుసుకుందాం..

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా..!
Also Read : కరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
( ఈ మంత్రాన్ని ప్రతీ రోజు ఉభయ సంధ్యలలోను 11 పర్యాయాలు తక్కువ కాకుండా మీరు చేయగలిగినన్ని సార్లు పఠిస్తే తప్పక విషూచిక నుంచి బయటపడుతారు అని యోగావాసిష్టంలో ఉంది.)

ఈ కథలు ఆయా పుస్తకాలలో ఉన్నవి. కేవలం సనాతన ధర్మంలో చెప్పుకునే పురాణాలు, పెద్దల, పండితులు ఆయా సందర్భాలలో చెప్పినవి మాత్రమే. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం విషయం తెలుసుకోవడానికి మాత్రమే. ఎవరిని బాధపెట్టాలనో, వీటినే నమ్మాలనో చెప్పట్లేదు. కేవలం సమాచారం మాత్రమే.
Famous Posts;

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

coronavirus - wikipedia, corona virus symptoms, what is corona-virus, coronavirus news, corona virus update, corona mantram, covid19, 

Comments

  1. యోగవాసిష్ఠము, అఖండ రామాయణము అని వినుతికెక్కిన గ్రంథరాజమే 'వసిష్ఠ రామ సంవాద' రూపమున నాలుగు సంపుటములుగా ఆవిష్కరింపబడినది. అవతార పురుషుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రునికి కలిగిన నిరాశా నిస్పృహలతో కూడిన వైరాగ్యము తొలగించి కార్యోన్ముఖుడిని కావించడానికి వసిష్ఠులవారు చేసిన ఫలవంతమైన ప్రయత్నమిది. ఇందులో బ్రహ్మజ్ఞానం, కర్మజ్ఞాన మార్గాలను రెండింటిని ఆచరిస్తేనే మోక్షము లభిస్తుందని తెలుపబడుతుంది. ఎంతో సున్నితము, జటిలము అయిన భావ పరంపర చక్కని సరళమైన తెలుగులో అనువదించబడింది. అందరికీ జ్ఞానమార్గాన్ని చూపే అమూల్యమైన గ్రంథమిది. https://devullu.com/books/sri-vasishta-rama-samvadam-set-of-four-volumes/

    ReplyDelete

Post a Comment

Popular Posts