Pracheena Ayurveda Arogya Rahasyalu | Health Tips in Telugu


ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు..
 కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.


 రహస్య సూక్తులు -
> రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.

>  ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.

>  మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.

> నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను

> వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను

> పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .

> భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.

> గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.> శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.

> ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .

> రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .

> అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.

> కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .

> అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.

> ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.

> విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.

> పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.

> మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .> ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .

> రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .

> అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .

> వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .

> నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

> పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .

> ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .

> దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .

> ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .

> ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .

> చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం

> మినుములు అతిగా వాడరాదు.

> వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.

> చవిటి ఉప్పు మంచిది కాదు.

> గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.

> పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.

> దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.

> మలమూత్ర వేగములను ఆపరాదు .

> ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.

> హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .

> స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .

>విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.

> గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .

> ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .

> నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును

> నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .

> తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .

> కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.

> ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును.


> ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .

> మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .

> అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
> నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .

> పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .

> స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.

> ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .

> బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .

> నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.

> మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .

> పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .

> సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .

> రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.

> మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .

> స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .

> బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .

> నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .

> భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.

> మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .

> అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .

> ముక్కుతో శబ్దం చేయకూడదు .

> పళ్ళు కొరకకూడదు .


 పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి.
Related Postings:

> TTD Telugu Sapthagiri Magazine June Month 2017 Free Download

> Virat Parvam Harikadha By Sri Chachidananda Sastry  Garu

> Telugu Devotional Books Free Download

> 17 Special Lord Shiva Temple In India

> History of Ujjain Mahakaleswar Jyothirlinga Temple In Telugu

> Cheruvugattu Sri Jadala Ramalingeswaraswamy Temple In Telugu

> Toli Tirupati Sri Srugaravallabhaswamy Temple Information


Ayurvedam, Tealth Tips in Ayurvedam, Ayurvedam in Health Tips, Health Tips, Medical, Ayurvedam in Telugu, Pracheena Ayurvedam, Arogya  Rahasyalu, Hindu temples guide.
Share on Google Plus

About chanti achanti

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples