అమ్మాయి పుష్పావతి:
అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి:
తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను. కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు. ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాంబూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరి ముద్ద పెట్టాలి.
Also Read : పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే
పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను. అమ్మాయి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి. అమ్మాయికి ఓణీ వేయవలెను. 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మంగళ హారతి పాటలు పాడవలెను. రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూతురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు.
Also Read : పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...
మొదట 3రోజులు పులగము అన్నము (బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూతురునకు, ఆ అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయకూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డించాలి, పాలరసము చేయాలి. వరస స్నానము 4సార్లు, మాములుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను.
Famous Posts:
> పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?
> మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి
> అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి..
> నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?
> భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.
> ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.
పుష్పవతి ఎలా అవుతారు, రజస్వల అయినప్పుడు, rajaswala in telugu, Pushpavathi aina Ammayi, rajaswala meaning in telugu, rajaswala on wednesday, pushpavathi niyamalu in telugu
Comments
Post a Comment