Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

ఈ సృష్టిలో మనిషి మనిషికీ తేడా ఎందుకు ? హెచ్చు తగ్గులు ఎందుకు ? Why is man different from man in this creation?


ఈ సృష్టిలో మనిషి మనిషికీ తేడా ఎందుకు ?

హెచ్చు తగ్గులు ఎందుకు ?

Also Readసోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్

చాలా మందికి వచ్చే సందేహం అసలు ఆ భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించినట్టు, ఇలా ఎందుకు రకరకాలైన కష్టాలు పెడుతూ మనల్ని ఎందుకు బాధిస్తున్నట్టు ? సృష్టించాడు సరే, పోనీ మానవులందరినీ అన్నీ విషయాలలో అన్నీ సమంగా ఇచ్చి సృష్టించకుండా మానవుల్లో ఈ హెచ్చుతగ్గులు ఎందుకు చేసినట్టు ? మనుషులందరినీ ఇలా రకరకాలుగా సృష్టి చేసి వాళ్ళని ఇలా అనేక రకాలుగా కష్టాలకి గురిచేయడం ఎందుకు ? అసలు సృష్టించకుండానే ఉండచ్చు కదా ? భగవంతుడికి ఈ వినోదం ఎందుకు అని సందేహం వస్తుంది. ఇది ఆధ్యాత్మిక చింతన గల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన విషయం.

మనల్ని పుట్టించింది ఆ భగవంతుడే అన్నది నిజం.  అయితే మానవులని గానీ మరే ఇతర జీవులని పుట్టించడంలో గానీ అనేక రకాలైన తేడాలున్నాయి అన్నది కూడా నిజం.  అయితే ప్రతి మనిషికి మనిషికి ఉన్న అన్నీ రకాలైన వ్యత్యాసాలకూ భగవంతుడికి ఏమీ సంబంధం లేదు, ఉండదు. అది ఎలా ఆంటే..  

దాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో చూద్దాం : 

మీరు స్వయంగా మీ చేతులతోనే, అన్నీ ఒకే రకంగా ఉన్న ఒక దోసెడు విత్తనాలని తీసుకుని, ఒకే రకమైన మట్టిలో జల్లి, గాలీ, వెలుతురు, లేదా ఎండ సమంగా తగిలేలా, అన్నిటికీ ఒకే రకంగా నీరు పెట్టారు అనుకుందాం.  కానీ అవన్నీ ఒకే సారి మొలకలు రావు. అన్నీ ఒకేలా మొలవ్వు.  కొన్ని అసలు మొలకే ఎత్తవు.  కొన్ని మొలక లోనే చనిపోతాయి. కొన్ని చిన్నగా మొలకెత్తుతాయి.  మరి కొన్ని కొంచం పెద్దగా లేస్తాయి.  రోజులు గడిచినా ఆ మొలకెత్తిన వాటిల్లో కొన్ని చిన్న మొక్కలుగానే ఉంటే కొన్ని చాలా పెద్ద మొక్కలు అవుతుంటాయి.  కొన్నిటికి చీడ లాంటివి పట్టి అందవిహీనంగా అయితే, కొన్నిటికి ఏ చీడ లేకుండా పచ్చగా కళకళ లాడుతూ ఉంటాయి, కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి గురై నాశనమైతే కొన్ని తట్టుకుని నిలబడతాయి, కొన్ని పూలు పళ్ళు ఇస్తే, కొన్ని అవేమీ ఇవ్వని ఫలపుష్పరహితమవుతాయి.  అలా ఎన్నో రకాలుగా అవి కూడా సుఖ దుఃఖాలకి హెచ్చుతగ్గులకి లోనవుతున్నాయి.  అలా ఎందుకు అవి అయ్యాయి అంటే మీరు ఏం సమాధానం చెప్తారు ?  ఆలోచించండి అలా కావడానికి కారణం ఎక్కడ ఉంది ?  మీ చేత్తో మీరు స్వయంగా విత్తనాలు చల్లే ముందు అన్నీ ఒకేలా ఉన్నాయి, మీరు వాటిని చల్లిన మట్టి కూడా ఒకటే, నీళ్ళు కూడా అన్నిటికీ సమంగానే పెట్టారు, వాటికి అందాల్సిన గాలీ వెల్తురు కూడా అన్నీ సమంగానే అందించారు, అయినా అలా ఒక్కోటి ఒక్కో విధంగా ఎందుకు అయినట్టు ? మీరు చల్లిన విత్తనాలలో కొన్నిటి మీద మీరు ఎందుకు పక్షపాతం చూపించారు ? వాటిల్లో కొన్నిటిని ఎందుకు మొలకెత్తకుండా చేశారు ? కొన్నిటిని ఎందుకు పొట్టిగానే ఉండేలా చేశారు ? కొన్నిటినే కాయలు, పూలు పూసేలా ఎందుకు వాటిల్లో అలా ఎక్కువ తక్కువలు చేశారు ? అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు ?  ఏమో నాకేం తెలుసు నేను మాత్రం ఒకే రకమైన విత్తనాలని ఒకే రకమైన మట్టిలో జల్లాను అన్నిటికీ సమంగానే నీళ్ళు పెట్టాను కానీ అవి ఎందుకని అలా అయ్యాయో నాకు తెలియదు అని వెంటనే చెప్తారు.  ఇంకా ఆ గింజల్లో ఎంతుందో అందులోంచి అంతే వస్తుంది గానీ లేనిది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు అవునా ? కాబట్టి మొదట్లో పైన మనకి వచ్చిన సందేహాలకి దేవుడిని అడిగినా ఇదే సమాధానం చెప్తాడు అని అర్ధం చేసుకోవాలి !

Also Readకాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?

పై దాన్ని బట్టి మానవులంతా పలురకాలైన హెచ్చుతగ్గుల్లో ఉండటానికి కారణం ఎక్కడ ఉన్నట్టు అంటే దానికి సమాధానం ఇలా ఉంటుంది.  ఈ సమస్తమైన మానవులంతా ఆ గింజల్లాంటి వాళ్ళు.  ఎవరి కర్మలని వాళ్ళు మంచి చెడు ఏదైనా వాళ్ళతోనే పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు.  భగవంతుడి ఎవరికీ ఏదీ కొత్తగా పట్టుకొచ్చి ఇవ్వడూ, ఉన్నదాన్ని తీసెయ్యడు.  బ్యాంక్ లో మన ఖాతాలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా మనకే అట్టిపెట్టి నట్టు భగవంతుడు ఎవరి ఖాతాలో ఉన్న పాపపుణ్యాలని వాళ్ళకే జాగ్రత్తగా అప్పజెపుతాడు. 

దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవలసిన సృష్టి రహస్యం ఒకటి ఉంది.  ఎలా అంటే విత్తనాలలో జీవశక్తి ఉన్నా అవి పడాల్సిన చోటు, ఉండాల్సిన వాతావరణం, తగలాల్సిన తేమ తగిలితేనే అవి మొలకెత్తుతాయి.  అలా కాకుండా ఏ సంచి లోనో,  ఏ డబ్బా లోనో పెట్టి మూత పెడితే అవి మొలకెత్తవు.  ఎందుకంటే పైన చెప్పిన మూడు పరిస్థితులు లేకుండా ఆ విత్తనానికి  మొలకెత్తడం చేతకాదు. అది మొలకెత్తటానికి ఎవరో ఒకరు దానికి అది మొలకెత్త టానికి తగిన పరిస్థితులని కలిగించాలి. అప్పుడు మాత్రమే అది దానిలో ఉన్న దాని జీవశక్తిని బట్టి మొలకెత్తి అది ఏంటో ఎలా పెరుగుతుందో, ఏమేమి ఫలపుష్పాలు ఇస్తుందో మనకి ఇచ్చి చూపించగలదు.  

అదే విధంగా మానవులతో సహా సమస్త జీవరాసులు ఏ మహా ప్రళయంలోనో యుగాంతంలోనో పూర్తిగా నశించి కొంత కాలం పాటు ఏవిధమైన శరీరాలు లేకుండా పడి ఉన్నప్పుడు, ఆ మహా ప్రళయం సంభవించిన సమయానికి ఆయా మానవుల వెనక ఏ విధమైన కర్మలు, సంస్కారాలైతే ఉన్నాయో అవన్నీ తరిగించుకొని ఉద్దరించబడటానికి మళ్ళీ ఏదైనా తగిన శరీరం ఉంటే తప్ప వాళ్ళ వెనకన ఉన్నకర్మలని తరిగించుకోలేరు.  అందుకని ఎవరి చేసుకున్న కర్మ ప్రకారం ఎవరికి తగ్గట్టు వారికి ఒక్కొక్క శరీరాన్ని ఆ భగవంతుడు తయారుచేసి ఇస్తాడు. అలా శరీరాన్ని నీకు ఇస్తూ, దాంతో పాటు మానవుల నడవడికి సంబంధించిన కొన్ని నియమాలని కూడా ఆయా దేహాలకి వర్తింపజేస్తూ వాటి ప్రకారం నడుచుకోమని చెప్పి పంపుతాడు.  తాను చెప్పినట్టు నడుచుకుంటే మానవుల పాపాల పుట్టని అంతా తాను పరిహారం చేస్తాను అని కూడా చెప్పి పంపుతాడు.  ప్రతి మానవుడికి  తాను చేసిన కర్మకి తగ్గట్టుగా అతనికి కావలసిన శరీరాన్ని మానవుడు తెచ్చుకోలేడు కాబట్టి దాన్ని భగవంతుడు సృష్టించి ఇస్తాడు తప్ప అలా చేయడంలో ఆయనకి ఏవిధమైన పక్షపాతము ఉండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇదంతా భగవంతుడి ఆధీనంలో ఉన్న “ప్రకృతి” లో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ లాగా ఎవరు ఏ శరీరంతో, ఎక్కడ, ఎలా పుట్టాలో, ఏ విధమైన జీవితం గడపాలో, దానివలన మావవులలో ఎలాంటి పరివర్తన రావాలో అన్నది నిర్విరామంగా జరిగిపోతూనే ఉంటుంది.   అందువలన ఒకళ్లని అన్నీ విధాలా బాగా సృష్టించి, కొందరిని అన్నీ విధాలా హీనంగా, లేదా తక్కువగా సృష్టించడం అనేది ఉండదు.  ఎవరి కర్మకు తగ్గట్టుగా వారి వారి శరీరాలు ఆయా కర్మలని అనుభవించే విధంగా ఈ ప్రకృతి లోంచి తయారు అవుతాయి.  భగవంతుడు “నన్ను పరిపూర్ణంగా ఆశ్రయించు నీ యోగ క్షేమాలు నేను చూస్తాను” అన్నాడు అంటే.. తాను చెప్పినట్టుగా మానవుడు ప్రవర్తించగలిగితేనే చూస్తాను అన్నాడు తప్ప మానవుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తే తను చూస్తాను అని అనలేదు. 

Also Readవాస్తురిత్య మనీ ప్లాంట్‌ను ఏ దిశలో పెంచాలి ?

కాబట్టి మానవుల్లో హెచ్చుతగ్గులు తేడాలు అన్నీఎవరికి వారు తెచ్చిపెట్టుకున్నవే తప్ప వాటితో భగవంతుడికి ఏ మాత్రం సంబంధం లేదు.  అయితే మానవులు గతంలో చేసిన తప్పులని తిరిగి చేయకుండా ఉండేలా చేసే ప్రయత్నంలో భగవంతుడి సహాయం అందరిమీద ఒక్కలానే ఉంటుంది.  ఎక్కడా తేడా ఉండదు. అందులో కులము, మతమూ, జాతీ, ఏవిధమైన లింగ బేధామూ లేకుండా “ఈ ప్రాపంచిక విషయాల మీద విరక్తి భావంతో” తనని “అన్యధా శరణం నాస్తి” అని వచ్చిన వాళ్ళని తప్పక రక్షించి తీరుతాను అని భగవంతుడు సమస్త మానవాళికి ఇచ్చిన మాట !

Famous Posts:

devudu kathalu in telugu, telugu mythology stories in telugu, mythological stories in telugu pdf, god stories in telugu pdf, spiritual stories in telugu, hindu god stories in telugu pdf, real god stories in telugu, moral stories in telugu, ఆధ్యాత్మికం

Comments

Popular Posts