Drop Down Menus

ఆదివారం ఈ పనులు కానీ చేస్తే అష్ట దరిద్రం - Do not do these things on Sunday - Sanatana dharma | Hinduism

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మనవాళ్ళందరూ చాలా కాలం నుంచి సూర్యోపాసకులు. సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి భారతీయ సంస్కృతి.

అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వచ్చాయి.

Also Read : ఈ సృష్టిలో మనిషి మనిషికీ తేడా ఎందుకు ? హెచ్చు తగ్గులు ఎందుకు ?

మిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే

సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా ||

స్త్రీలౌల్య మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే

న వ్యాధి శోక దారిద్య్రం, సూర్యలోకం స గచ్ఛతి||

మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీలతో సాంగత్యం ఆదివారం నాడు చేయకూడదు. అలాగే తలను నూనె పెట్టుకోవడం లాటి పనులు కూడా ఆదివారం రోజున చేయకూడదు. ఇలా చేసినవారు జన్మజన్మలకు దరిద్రులు అవుతారు అని నొక్కి చెప్పారు. దారిద్య్రం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు అనారోగ్యం కూడా అందులో భాగమే.

అలాటి పవిత్రమైన రోజున తాగుబోతులకి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మనవాళ్ళందరూ చాలా కాలం నుంచి సూర్యోపాసకులు. సూర్యుణ్ణి ఆరాధించే సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వచ్చాయి.

ప్రాతఃకాలంలో నిద్రలేని  సూర్య నమస్కారాలు చేయడం, సూర్యునికి తర్పణాలు ఇవ్వడం, సంధ్యావందనాది పనులు చేయడం మొదలైనవి అన్నీ కూడా సూర్యుడిని ఆరాధించడంలో భాగాలే. ఇలాటి వారం (భారతీయులకు) మనకు చాలా పవిత్రమైన వారం. అలాటి రోజును వీకెండ్‌ అనే పేరుతో అపవిత్రమైన పనులు చేయడం అలవాటు చేసుకున్నారు.

Also Readగోమాత మహిమ గురించి శివుడు, పార్వతిదేవికి చేప్పిన కథనం..

మన సంసృతిని గురించి తక్కువచేసి ఈ రోజున సెలవు రోజుగా ప్రకించి తమకు తోచిన పనులు చేయడం, ఉదయాన్నే నిద్ర లేవకపోవడం, సూర్య నమస్కారాలు లాటి పనులు చేయకపోవడం, బాగా తిని, తాగడం, పొద్దు పోయేవరకు ఇంటి పట్టున ఉండకపోవడం లాటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. దీని వలన మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ నాశనం చేస్తున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు సామెత. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఏ పనులు అయినా చేసుకో గలుగుతారు. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. సూర్యుడు. అందుకే ఆరోగ్యం భాస్కరాద్ధిచ్ఛేత్‌ అనే నానుడి మనకు వచ్చింది. అంటే ఆరోగ్య కారకుడు సూర్యుడు అని అర్థం. ఎలాటి అనారోగ్యాలైనా సరే సూర్య కిరణాలు పడడంతోటి నశించి పోతాయి అని. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లలకు కూడా సూర్య రశ్మి తగాలలని వారిని ఉదయం సూర్యుడి కిరణాలకు పడుకోబెడుతున్నారు.

అంటే దీనిని బట్టి  మనకు అర్థం అవుతుంది. సూర్యుడు మాత్రమే ఆరోగ్య కారకుడు. అలాటి సూర్యుడి సంబంధించిన వారాన్ని మనం నిర్లక్ష్యం చేసి మన ఆరోగ్యాలను మనమే చేతులారా పాడుచేసుకుంటునాము.కావున ఇక నుంచి ఆదివారం రోజున సెలవు దినం కదా అని బద్ధకించి పడుకోకుండా ఆదివారం ఉదయమే అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు ముగించుకుని సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయడం వలన ఆరోగ్యం సమకూరుతుంది...

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే..

Also Readభార్య భర్తల మధ్య క్లోజ్ నెస్ పెరగాలంటే... ఈ చిట్కా పాటించండి

ఆరోగ్యం ఎవరికి కావాలో వారు ఈ పనులు చేయాలి. అంటే అందరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు కనుక ప్రతీ ఒక్కరూ ఈ పనులు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే....

Famous Posts:

ఆదివారం, Sunday, what not to eat on Sunday, devotional stories in Telugu, dharma sandesalu Telugu, chicken, sanathana dharmam

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.