Drop Down Menus

ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ఏడు ప్రయోజనాలు | Amazing 7 Benefits of Chanting Hanuman chalisa | Hanuman chalisa

హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది.

అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము.

హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది.

వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం. హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా "జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర " వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు.

మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే 'మూడవ దోహా' ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది. చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి.

14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి. 

మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు.

11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది. 

16వ మరియు 17 ఛౌపయిస్ చదటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో వద్ద ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవొచ్చు.

20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

anu

24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

హనుమాన్_చాలీసా

దోహా:

శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి

వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార

బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర

జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా

అంజనిపుత్ర పవనసుత నామా | 2

మహావీర విక్రమ బజరంగీ

కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా

కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై

కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన

తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర

రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా

రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా

వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే

రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే

శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ

కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం

అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా

నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే

కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా

రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా

లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ

లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

anu

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ

జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే

హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా

తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై

తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై

మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా

జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై

మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా

తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై

సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా

హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే

అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా

అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా

సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై

జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ

జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ

హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా -

జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ

కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ

ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా

హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా

కీజై నాథ హృదయ మహ డేరా | 40

దోహా:

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్

రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
శనేశ్వరుడు శనివారాల నోము
శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
శివదేవుని సోమవారపు నోము కథ

హనుమాన్ చాలీసా, Hanuman Chalisa, Hanuman Chalisa benefits Telugu, శ్రీ ఆంజనేయ శ్లోకాలు, shri hanuman, lord hanuman, chalisa, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.