Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

విజయవాడ కనకదుర్గ అమ్మవారు ప్రత్యక్షంగా చూపిన మహిమలు | SRI DURGA MALLESWARA SWAMY VARLA DEVASTHANAM VIJAYAWADA

విజయవాడ కనకదుర్గ అమ్మవారు యొక్క కొద్దిపాటి మహిమలు ఈ కథనంలో తెలుసుకుందాం..

అమ్మవారు ప్రత్యక్షంగా చూపిన మహిమలు.

1. శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో పనిచేయటానికి వచ్చిన పేదకార్మీకుడొకడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ పొరపాటున కాలుజారి పైనుండి హఠాత్తుగా క్రిందపడ్డాడు . ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో భైట పడతాడని ఊహించలేదు . కానీ అమ్మ మహత్యం వాల్ల అతనికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు , సరి కదా అలాగే చక్కగా లేచి తేరుకొని తిరిగి తన పనికి  తాను  ఉపక్రమించాడు . ఈ దృశ్యం అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది . ఇటువంటి మహత్తు లెన్నింటినో అమ్మ ప్రత్యక్షంగా చూపించింది.

2. అమ్మవారి ఆలయంలో వంటశాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుకోడానికి  వెళుతున్నాడు . అంతలో వేగంగా వస్తున్న ఒక ఇసుక లోడు ట్రాక్టర్ ఆయన్ని డీకోన్నది . ఆ దగ్గరలో ఉన్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు . కానీ పెద్దగా గాయలేమి తగల్లేదు . కొద్దిపాటి వైద్యంతో పనిలోనికి వెళ్ళిపోయాడు . ఇది అమ్మ మహిమ కాక మరేమిటి.

3. కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా ప్రక్కన కాపురముండే సాహెబ్గారికి ఈ విజయదుర్గమ్మ ఒకనాటి రాత్రి కలలో కనిపించి నాలుగు చేతులతో ఇరు చేతుల్లో శంఖ చక్రాలు మరొకచేతిలో శూలాన్ని పట్టుకొని నాల్గోవ చేతిలో పసుపు, కుంకుమ, గాజులు, బంగారు నాణేలతో ఆ సాహెబ్ నిదిరిస్తున్న సమీపంలోని బీరువా దగ్గర నిలబడి ఇదిగోరా ! తీసుకో అని అన్నది . ఆ సాహెబ్ భయంతో ఎవరు నీవు? అని ప్రశ్నించగా నేనురా ! విజయదుర్గను , అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది . అతను వెంటనే మేలుకొన్నాడు , తెల్లారిన తరువాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు , కుంకుమ , గాజులు అమ్మవారికి సమర్పించి పూజలు చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని వివరించినట్లు ఆలయ సిబ్బంది , అర్చకులు చెబుతున్నారు.

4. ఒక ప్రభుత్వోద్యోగి కడప నుంచి కర్నూలుకు ఉద్యోగరీత్య బదలీయై కుటుంబసమేతంగా వెళుతూ దారిలో ఉన్న ఈ విజయదుర్గమ్మను దర్శించుకొని పూజించి వెళ్లేముందు హడావుడిలో ఒకచేతి సంచిని ఆలయ సింహద్వారం దగ్గర మరచి వెళ్ళాడు . ఆ సంచి సరిగ్గా ఆలయ సిబ్బంది కంట పడింది . వారు దాన్ని తెరచి చూడగా అందులో డబ్బు , నగలు ఉన్నాయి . దాన్ని భద్రంగా దాచి పెట్టారు . తిరిగి గుర్తు తెచ్చుకొని ఆ వ్యక్తి వచ్చి అడిగిన్నపుడు ఆ సంచిని అందజేశారు .

వేరెవ్వరికైన దొరికి ఉంటే ఇదినాచేతికి అందేదికాదు . ఇదంతా ఇక్కడున్న ఆలయ సిబ్బంది నిజాయితి , ఈ అమ్మవారి మహత్తుకూ నిదర్శనమని సంతోషపడి ఆ భక్తుడు వెళ్ళిపోయాడు.

5. కడపలో నివాసిస్తున్న శ్రీ సి . ర . ఐ సుబ్బారెడ్డి గారు తన భక్తికి నిదర్శనంగా తన కారులో శ్రీ చక్రాన్ని అమర్చుచుకొని నిత్యం పూజిస్తుంటారు . వీరు కుటుంబ సమేతంగా కారులో బయలు దేరి నందవరం శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై వస్తున్నపుడు హఠాత్తుగా గోర ప్రమాదం జరిగింది . కారంతా నుజ్జునుజ్జై పోయింది . కానీ ఏ ఒక్కరికి ప్రాణహాని జరుగలేదు . కారులో అమర్చిన శ్రీ చక్రంకూడా ఎలా అమర్చారో అలాగే ఉంది. సుబ్బారెడ్డి కుమారునికి , మేనల్లునికి  తీవ్రగాయాలైనవి . గాయపడిన వారిని హైదరాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు . గాయబడిన ఈ ఇద్దరబ్బాయిలు మరణించినట్లు టి . వి . లో న్యూస్ కూడా వెలువడింది . కానీ అమ్మవారి లీలలు ఎంత చిత్రమైనవో కదా ! ఆ మరుక్షణమే ఇద్దరబ్బాయిలకు సులభంగా చికిత్స జరగడం గాయబడిన కన్ను , కాలు సైతం నయం కావడం చక్కగా ప్రాణాలతో బయటపడడం . నమ్ముకున్నవారికి సొమ్ముగా నిలుస్తున్నది ఈ విజయదుర్గమ్మ అనటానికి ఇంత కంటే నిదర్శన మేముంది . ఆ దృశ్యాన్ని తలచుకుంటే మేమిప్పటికి నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనవుతున్నాం అంటూ సుబ్బారెడ్డి గారు ఎంతో ఆసక్తిగా వివరించారు.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

విజయవాడ కనకదుర్గమ్మ, విజయవాడ, కనకదుర్గ, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Kanaka Durga Temple, vijayawada kanaka durgamma story, vijayawada kanaka durgamma temple timings

Comments