Drop Down Menus

కాశి వెళ్లే ప్రతిఒక్కరు తెల్సుకోవాల్సినవి | కాశిలో - చేయవలసినవి - చూడవలసినవి..! Things to do in Varanasi if you are a First Timer - Best Places to Visit in Varanasi

కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..

కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని

కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..

గంగా దర్శనం..గంగా స్నానం.

కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం 

(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)

కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది.

అన్నపూర్ణ దర్శనం 

భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం

వారాహి మాత గుడి

ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.

లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది.

ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.

(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)

గంగా హారతి - 

దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)

కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం

చింతామణి గణపతి దర్శనం 

అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ 

లోలార్కఈశ్వరుని దర్శనం

దుర్గా మందిరము 

గవ్వలమ్మ గుడి 

తులసీ మానస మందిరము

సంకట మోచన హనుమాన్ మందిరం.

తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.

తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -

ఇది కొంత దూరంగా ఉంటుంది.

ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -

అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.

ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.

గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.

లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -

ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -

మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.

రిక్షా అయితే మంచిది.

ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి.

కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -

ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.

స్వయంభూ లింగం.

కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..

స్థలాలు..

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్

కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్

త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్

కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

కాశేశ్వరుడు - త్రిలోచన్

శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో

అవిముక్తక..

ఆనందకానన..

మహాస్మశాన..

సురధాన..

బ్రహ్మవర్ధ..

సుదర్శన..

రమ్య..

కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.

ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు

ముల్లోకాలు నాకు నివాసమే.

అందులో కాశీ క్షేత్రం నా మందిరం గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.

ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,

మథుర,

గయ,

కాశి, 

అవంతిక, 

కంచి, 

ద్వారక 

నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి, కాంచి, మాయ, ఆయోధ్య, ఆవంతిక, మథుర మరియు ద్వారవతి" లు సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.

కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Best Places to Visit in Varanasi, things to do in varanasi at night, places to visit in varanasi in 3 days, places to visit in varanasi for couples, places to eat in varanasi, kashi famous for, places to visit in varanasi with girlfriend, temples to visit in varanasi, shopping in varanasi, kashi temple, vishwanath temple

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.