Drop Down Menus

కాశీ క్షేత్రంలోని శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం గురించి మీకు తెలుసా ? Kedareshwar Temple, Varanasi - Hindu Temples

కాశీ క్షేత్రంలోని  శ్రీ కేదారేశ్వర మహాత్మ్యం..

ఒకసారి పార్వతి దేవి పరమశివుడిని కాశీ క్షేత్రంలో కేదార ఖండ విశేషాలను తెలియ జేయమని కోరింది. అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పారు.

పూర్వం ఉజ్జయిని పట్టణం లో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్ర సంతానం లేదు. మహా కాలుడిని  భక్తితో సేవిస్తున్నాడు. కొంత కాలానికి ఈశ్వరానుగ్రహం వల్ల పుత్రోదయం జరిగింది. ఆ బాలుడికి వసిష్టుడు అని పేరు పెట్టాడు. ఎనిమిదో ఏట ఉపనయనం చేశాడు. రోజూ దశ సహస్ర గాయత్రి జపం చేసేవాడు వసిష్టుడు. అకస్మాత్తుగా తల్లి మరణించింది. మరో ఏడాదికి తండ్రిని కోల్పోయాడు. వికల మనస్కుడైన ఆ బాలుడు మంచి గురువును అన్వేషించి పరమార్ధ జ్ఞానం పొందాలని భావించాడు.

కాశీ క్షేత్రానికి చేరాడు. అక్కడ గంగా స్నానం, విశ్వనాధాది దేవతా సందర్శనం చేశాడు. హిరణ్యగర్భుడు అనే గురువు అనుగ్రహం పొందాడు. పంచాక్షరి దీక్ష పొందాడు. అచంచల భక్తితో విశ్వనాధుని కొలుస్తున్నాడు. శివుడే గురువు, గురువే శివుడు అనే భావం కలిగింది. ఒక రోజు గురువు తనకు కేదార క్షేత్రం దర్శించి, కేదారేశ్వరుడిని కనులారా చూచి ధన్యం కావాలని ఉందని చెప్పాడు. అలాంటి క్షేత్రం తానూ చూడాలని శిష్యుడన్నాడు. ఇద్దరు కేదారం బయల్దేరి వెళ్లారు.

‘’కేదారే ఉదకం పీత్వా – పునర్జన్మ న విద్య తే‘’

అనే కేదారఖండ గ్రంధ ప్రమాణంగా తీసుకొని.. 

‘’రేత కుండం‘’ లోని అద్భుత మహిమాన్విత జలాన్ని స్వీకరిస్తే పునర్జన్మ ఉండదని గ్రోలారు. కేదారేశ్వర దర్శనం చేసి జన్మ చరితార్ధం చేసుకొన్నారు. కేదారేశుని చూస్తుండి పోయిన గురువు కన్నుల లో నుంచి జ్యోతి బయటకు వచ్చి ఆకాశమార్గం లోకి వెళ్లటం, దివ్య విమానం లో దేవతలు వచ్చి ఆయన్ను తీసుకు వెళ్లటం అందరు గమనించారు. శిష్యుడు వశిష్టుడు గురువు గారి అంత్య క్రియలను భక్తితో విధి విధంగా  చేశాడు. కాశీ చేరి గురువు గారి ఆదర్శాలను అమలు చేయటానికి పీఠాన్ని అధిరోహించాడు.

నిత్య గంగా స్నానం, విశ్వనాధ దర్శనం, పరమశివ ధ్యానం తో కాలం గడిపాడు. అనుక్షణం దైవనామ జప తపాల తో జీవితాన్ని అర్ధ వంతంగా కొనసాగిస్తున్నాడు. శివుడు పరమ ప్రీతి చెంది దర్శనమిచ్చాడు. వరం కోరుకో మన్నాడు. అప్పుడు వసిష్టుడు ‘’దేవా !ఎక్కడో హిమాలయాలలో నువ్వు ఉంటావు. నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోలేని వారెందరో ఉన్నారు. కనుక కేదార, విశ్వనాధ జ్యోతిర్లింగాలు రెండు కలిసి కాశీలోనూ ఉండేట్లు నీవు కరుణిస్తే నీ భక్తులు ధన్యులవుతారు‘’ అని కోరాడు. ‘’నీ కోసం ఏదీ కోరుకోకుండా అందరికోసం కోరావు చాలా సంతోషం. నీ ముక్తి నీ స్వాధీనం‘’ అన్నాడు. హిమాలయంలోని సర్వ తీర్ధాల గౌరీ కుండం, హంస తీర్ధం మొదలైన వాటి శక్తులన్ని వశిష్ట నివాసం దగ్గరున్న ‘’హర పాప హ్రద తీర్ధం" లో నిక్షిప్తం అవుతాయి. అరవై నాలుగు కళల్లో ఒక్క కళ ను మాత్రమే కేదార క్షేత్రం లో నిలిపి మిగిలిన సర్వ కళలను కేదార్ ఘాట్ ఒడ్డున ఉన్న కేదారేశ్వరునిలో లీనమగునట్లు చేసాడు.

భక్తుని కోరిక తీరి కాశీలో కేదార క్షేత్రం వెలిసింది. కేదార్ ఘాట్ స్నానం, కేదారేశ్వర దర్శనం, స్పర్శనం పరమ పుణ్యప్రదం. ఇక్కడ పితృ కర్మ చేస్తే 101తరాల వారు తరిస్తారు. చైత్ర బహుళ చతుర్ధి నాడు ఉపవాసం ఉండి మూడు పూటలా మూడు పుక్కిళ్లు కేదార్ జలాన్ని సేవించిన వారు శివైక్యం చెందుతారు. కేదారేశ్వరునికి ఉత్తరంలో చిత్రాంగదేశ్వరుడు, దక్షిణంలో నీలకంఠుడు, వాయువ్యంలో అంబరీకేశ్వరుడు, అక్కడే ఇంద్రద్యుమ్నేశ్వరుడు, దీనికి దక్షిణంలో కాలన్జేశ్వరుడు, చిత్రాంగదేశ్వరుడు ఉత్తరాన క్షేమేశ్వరుడు, కేదారేశ్వరుని పరివారంగా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తారు. 

 ‘’కేదారేశ్వర లింగస్య – శ్రుత్వోత్పత్తిం చ యో నరః –శివలోక మావా ప్నోతి – విశ్వాపో జాయతే క్షణాత్ ‘’

ఈ కధ విన్నా చదివినా ముక్తి పొందటం ఖాయం.. 

కాశీ పట్టణానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర వున్నది. వాటన్నింటికీ ఆధారాలు దొరకటం కూడా కష్టమే. బెనారస్ హిందూ యూనివర్సిటీ గ్రంధాలయంలో లభ్యమయ్యే కొన్ని గ్రంధాల  ప్రకారం చూస్తే దీని చరిత్ర 6 వేల నుంచి 7 వేల సంవత్సరాల క్రితంది. ఇంకొక ప్రబలమైన సాక్ష్యం లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వున్నదిట. అది ఒక నాణెం.  అందులో శివుడు శూలాన్ని పట్టుకుని సిధ్ధాసనంలో కూర్చుని వుండగా వెనక మహిషం వున్నట్లు వున్నది. ఈ నాణెం 12,400 సంవత్సరాలనాటిదని విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలు లెక్క కట్టారుట.

కాశీ గురించిన అనేక విశేషాలు వేదవ్యాస మహర్షి విరచిత పురాణాలలో వివరంగా ఇవ్వబడ్డాయి.  వీటిలో స్కంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం ముఖ్యమైనవి.

కాశీ సృష్ట్యాదినుంచి.. కాదు కాదు… సృష్టికన్నా ముందునుంచీ వున్నది.  శివ పురాణం ప్రకారం సృష్టికి పూర్వము ఈ జగమంతా నీటితో నిండిపోయివుంది.  బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి తగిన జ్ఞానం, శక్తి సంపాదించుకోవటానికి కావలసిన  తపస్సు చేయటానికి కూర్చోవటానికి ఒక ప్రదేశం కావాల్సి వచ్చింది.  అప్పుడు మహా శివుడు తన త్రిశూలం మీద కొంత భూ భాగాన్ని సృష్టించాడు.

బ్రహ్మదేవుడు ఆ భూ భాగం మీద కూర్చుని తపస్సు చేసిన తర్వాత సంకల్ప మాత్రంచేత తన శరీరంలోని వివిధ భాగాలనుంచి మహర్షులను, దేవతలను, ఆనేక లోకాలను, భూమితోసహా సమస్త గ్రహాలను, జీవజాలాన్ని ఇంకా అనేకం సృష్టించాడు.  దేవతలు, మహర్షులు అందరూ ప్రార్ధించగా పరమ శివుడు త్రిశూలం మీదనుంచి తను సృష్టించిన భూభాగాన్ని కూడా బ్రహ్మ  సృష్టించిన భూమి మీదకి దించాడు.  అదే కాశీ క్షేత్రం. ఈ క్షేత్రం వైశాల్యం 10 కి.మీ.లు. ఈ కాశీ క్షేత్రం మహాదేవుడు సృష్టించినది కనుక బ్రహ్మకుగానీ, ఆయనచే సృష్టింపబడిన ఏ ప్రాణికిగానీ శివుడు సృష్టించిన ఈ కాశీ క్షేత్రంమీద ఎటువంటి అధికారంలేదు.  

ఈ కాశీ క్షేత్రం పరమ శివునికి చాలా ప్రీతి పాత్రమయింది.   ఆయన ఎల్లవేళలా ఈ క్షేత్రాన్ని విడువకుండా వుంటాడు. అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని, అవిముక్తేశ్వరం అనీ అంటారు.   బ్రహ్మచే సృష్టింపబడిన దేవతలందరూ మహా శివుని సేవించుటకు కాశీక్షేత్రంలో నివసిస్తుంటారు.

ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి సృష్టి సమస్తం నాశనమవుతుందికానీ  ఈ కాశీ క్షేత్రానికి ఎలాంటి ఇబ్బందీ వుండదు. కారణం ఇది బ్రహ్మదేవుని సృష్టి కాదు. దీని సృష్టికర్త సాక్షాత్తూ పరమ శివుడు.  సకలదేవతా నిలయమైన కాశీ ఎంత పుణ్య క్షేత్రమో, దాని మహత్యం ఎంత గొప్పదో మనం కూడా తెలుసుకుందాము.    

కాశీలో అనేక దేవతలు, ఋషులు, ఇంకెందరో మహనీయులు తాము పూజ, తపస్సు చేసుకోవటంకోసం శివ లింగాలను ప్రతిష్టించారు.  అలాంటి లింగాలు కాశీ క్షేత్రంలో ఎన్నున్నాయో తనకి కూడా తెలియదని పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఒక సందర్భంలో చెప్పాడుట.  ఇంతటి పుణ్యక్షేత్రం ఇంకొకటి వుంటుందా!?  ఇప్పటికీ అక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేసుకుంటూ వుంటారు.  అందుకే ప్రతి హిందువూ తమ జన్మలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు.  కొందరైతే తమ అంతిమ శ్వాస అక్కడే విడవాలనికూడా తపన పడతారు.  ఎందుకో తెలుసా  పురాణోక్తి ప్రకారం  “కాశ్యాంతు మరణాత్ ముక్తి” కాశీలో మరణించిన వారికి అంతిమ సమయంలో సాక్షాత్తూ పరమేశ్వరుడే చెవిలో ఉపదేశం చేస్తాడుట. దీనితో వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందిట. ఈ నమ్మకం మనవారిలో ప్రగాఢంగా వుండటంతో, అవకాశం వున్నవారు తమ జీవిత చరమాంకంలో కాశీలో గడుపుతుంటారు. ఎంత గొప్పదో కదా ఈ కాశీ.

కాశీ యాత్ర మూడు విధాలు అని చెప్తారు అవి:

1) త్రిరాయతన యాత్ర:

అవిముక్తేశ్వర, స్వర్లీనేశ్వర, మధ్యమేశ్వర లింగాలను మూడింటిని దర్శించి పూజించటమే ఈ యాత్ర.

2) చతురాయతన యాత్ర:

శైలేశ్వర, సంగమేశ్వర, స్వర్లీనేశ్వర, మధ్యమేశ్వర లింగాలను నాలుగింటిని దర్శించటమే ఈ యాత్ర.

ఈ రెండు యాత్రాల్ని లింగ పురాణం చెప్పింది. 

3) పంచాయతన యాత్ర:

 కృత్తివాశేశ్వర, మధ్యమేశ్వర, ఓంకారేశ్వర, కపర్దీశ్వర, విశ్వేశ్వర లింగ దర్శనమే పంచాయతన యాత్ర...

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

kedareshwar temple, kedareshwar temple harishchandragad, gauri kedareshwar mandir varanasi, kedareshwar temple maharashtra, kedareshwar jyotirlinga, kedar ghat, kedareshwar mahadev bardoli, varanasi, kashi temple

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.