Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

కృష్ణాష్టమి విశిష్టత , పూజా విధానం - Krishnashtami Pooja Vidhanam Telugu

కృష్ణాష్టమి విశిష్టత , పూజా విధానం ఇదే..కృష్ణాష్టమి సంబరాల పరమార్ధం ఇదే

శ్రావణ మాసంలో అన్నీ విశేషాలే. అత్యంత భక్తి భావంతో, ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణమాసాన్ని జరుపు కుంటారు ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు , వరలక్ష్మీ వ్రతంతో పాటు మరో విశేషం కూడా ఉంది. ఈ మాసంలోనే శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు. తన లీలలతో భక్తి , జ్ఞానం, యోగం, మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు.

కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా .. పిల్లలు కృష్ణయ్యలు , గోపికలుగా

ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి, యశోదలుగా భావించుకుంటూ,తమ బిడ్డలను శ్రీకృష్ణుడి ప్రతి రూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు , కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు ఎవరైతే కృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు.

Also Readకృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? ఈసారి కృష్ణాష్టమి ఎప్పుడొచ్చింది 18న లేదా 19న...తేదీ & ముహూర్తము.

కృష్ణాష్టమి పూజా విధానమిదే

కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానమాచరించి , గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి, చక్కగా పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలుకృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తికొలది వాళ్ళు ప్రసాదాలను తయారుచేసుకొని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలి పాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.వెన్నదొంగకు వెన్నంటే ఇష్టం .. కృష్ణుడి పాదాలు వేసేది అందుకేశాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు 102 రకాల పిండివంటలు చేయాలని ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి అని చెబుతారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న , పాలు , పెరుగు , బెల్లం , శనగ పప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడు పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్టు పాద ముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం , చిన్నారుల్లోనూ యువత లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.

ఉట్టి కొట్టే సంబరం

యువతలో ఉత్సాహంఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు . ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు పాలు చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరుగా కానీ , సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్ళు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే , గోపికమ్మలే కృష్ణాష్టమి రోజున ఏ ఇంట్లో చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది. ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు, కృష్ణుడి వేషధారణలో కనిపిస్తారు. చక్కగా పంచె కట్టుకుని నిలువు నామాలు పెట్టుకొని తలపై నెమలి పింఛంతో, చేతిలో వేణువును పట్టుకుని వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ఆడ పిల్లలైతే కృష్ణుని ఆరాధించే గోపికల్లాగా,కృష్ణుడికి ప్రియమైన రాధికలాగా చక్కని వేషధారణతో కనువిందు చేస్తారు.

కృష్ణుడి ఆలయాల్లో , ఇస్కాన్ ఆలయాల్లో ఘనంగా వేడుకలు

కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్య కు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి.

గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం , గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారం

శ్రీకృష్ణ అవతారం ఇచ్చిన అద్భుత సందేశం ధర్మాన్ని రక్షించడానికి మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం.బాల కృష్ణుడు గా అల్లరి పనులు చేసిన , వెన్నదొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది. గోవర్ధన గిరిధారిగా, కాళీయ మర్దనుడిగా, గోపికా లోలుడిగా, అసుర సంహారిగా , గీత ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది. మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Famous Posts:

కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? ఈసారి కృష్ణాష్టమి ఎప్పుడొచ్చింది 18న లేదా 19న

కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు జపించడం వలన కలిగే లాభాలు.

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామవళిః..

కృష్ణుడికి ఇవంటే ఎందుకంత ఇష్టం.

శ్రీకృష్ణాష్టమి రోజున ఏం చేయాలి?

కృష్ణాష్టమి, krishnashtami, krishnashtami panduga, krishnashtami telugu, krishnashtami date, krishna pooja, sri krishna ashtotram

Comments

Popular Posts