Drop Down Menus

జ్వరాది వ్యాధులను తగ్గించే కధ..The story of reducing fever diseases

జ్వరాది వ్యాధులను తగ్గించే కధ..

మహాభారతం శాంతి పర్వంలో ఇది కనిపిస్తుంది. పాండవాగ్రజుడు ధర్మరాజుకు కురువృద్ధుడు భీష్మాచార్యుడు ఈ కథనంతా చెప్పాడు.ఈ జ్వర వృత్తాంతాన్ని ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు చదువుకుంటే జ్వర బాధ తగ్గుతుందన్నది కొందరి నమ్మకం.

ఈనాటికీ సంప్రదాయ కుటుంబాల్లో ఎవరికైనా జ్వరమొస్తే దేవుణ్ణి ప్రార్థించడం, అందులోనూ మృత్యుంజయుడని పేరున్న పరమేశ్వరుడిని స్తుతించటం కనిపిస్తుంది. దీనికి కారణమేమిటి? అసలీ జ్వరానికి, శివుడికి సంబంధం ఏమిటి? జ్వరం అనేది మనుషులకొస్తే ఎలా ఉంటుందో తెలుసు, మరి జంతువులకు, పక్షులకు ఈ జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది?

దక్షయజ్ఞ విధ్వంసానికి శివుడు తన ప్రమధ గణాలను పంపాడు. ఆ గణాల ధాటికి దేవతలంతా చెల్లా చెదరయ్యారు. దక్షుడు నిర్వహిస్తున్న ఆ యజ్ఞం కూడా స్వయంగా ఒక మృగరూపాన్ని ధరించి ఆకాశానికి లేచి పారిపోసాగింది. ఆ విషయాన్ని స్వయంగా చూసిన శివుడు తన ధనస్సుకు బాణాన్ని సంధించి ఆ మృగం వెంటపడ్డాడు. ఆ సమయంలో బాగా కోపోద్రిక్తంగా ఉన్న ఆయన నుదుటి నుంచి ఒక స్వేద బిందువు పుట్టి భూమ్మీద రాలింది. వెంటనే దాన్నుండి భయంకరాకారుడైన ఒక మహా పురుషుడు ఉద్భవించాడు. ఎర్రటికళ్ళతో పచ్చని మీసాలతో పైకి నిక్కపొడుచుకొని ఉన్న కేశాలతో భయంకరంగా కనిపించాడు ఆ పురుషుడు. నల్లని శరీరఛాయ, దేహమంతటా సూదులలాంటి రోమాలు, ఎర్రటి వస్త్రాలను ధరించి ఉన్నాడు. ఆ పురుషుడి పేరే జ్వరుడు.

మృగ రూపంలో ఉన్న అతడు యజ్ఞాన్ని పట్టి ధ్వంసం చేశాడు. దాంతో ఆగక అక్కడ మిగిలిన దేవతలందరి మీదా పడి పీడించసాగాడు. దాంతో వారంతా బ్రహ్మదేవుడి దగ్గర కొచ్చి తమకు జ్వరం నుంచి ఎలాగైనా విముక్తి కలిగించాలని వేడుకొన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు దగ్గర కొచ్చి ఆయనను అనేక విధాలా స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తర్వాత దేవతలు, రుషులు జ్వరం వల్ల పడుతున్న బాధను వివరించి ఆ ఘోర జ్వరాన్ని వేరు వేరు భాగాలుగా విభజించి లోకాలకు శాంతిని కలిగించమన్నాడు. అలా చేస్తే యజ్ఞంలో శివుడికి భాగమిచ్చేలా చేస్తానని విన్నవించుకున్నాడు. శివుడు లోక క్షేమం కోసం బ్రహ్మ మాటలను ఆలకించి శాంతించాడు. ఆ తర్వాత భీకరాకారంతో ఉన్న జ్వరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. దాంతో దేవతలకు రుషులకు జ్వరభారం తగ్గింది.

నాటి నుంచి ఆ జ్వరం నాగులకు శిరోవేదనగానూ, పర్వతాలకు శిలాజితుగానూ, జలాలకు పాచిగానూ, సర్పాలకు కుబుసాలుగానూ, ఎద్దులు లాంటి జంతువులకు డెక్కల చీలికలు గానూ, భూమికి చవిటిమన్నుగానూ, పశువులకు దృష్టి మాంద్యం గానూ, గుర్రాలకు గొంతు రోగంగానూ, నెమళ్ళకు పింఛ నాశనంగానూ, గోవులకు నేత్ర రోగంగానూ సంక్రమించింది. గొర్రెల్లో పిత్తకోశ వికారంగానూ, చిలుకల్లో ఎక్కిళ్ళుగానూ, పులులకు శ్రమరూపంలోనూ సంక్రమించింది. జ్వరం మానవులకైతే జ్వరరూపం లోనే ఉంటుంది. శివుడు ఇలా జ్వరాన్ని అనేకానేక విభాగాలుగా చేసి కర్మానుసారం ఎవరికి ఎప్పుడు కలగాలో అలా నిర్ణయించాడు.

ఇలా జ్వరమనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టి సకల ప్రాణులకు ఏయే రూపాల్లో సంక్రమిస్తుందనే విషయాన్ని భీష్ముడు ధర్మనందనుడికి వివరించి చెప్పాడు. అలా కాకపోయినా హేతుబద్ధంగా ఆలోచించినా ఈ కథాంశంలో వైద్య భూవిజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాలున్నాయని పురాణ విశ్లేషకులు వివరిస్తున్నారు. మనిషికి జ్వరం వస్తే ఒళ్ళునొప్పులు, ఒంట్లో వేడి పెరగటం లాంటివి అందరికీ తెలిసిందే. ఇతర జంతుజాలాల్లో జ్వరం ఎలా ఉంటుందో సూచనప్రాయంగా తెలియజేస్తున్నట్లు ఈ కథా సందర్భంలోని సారం కనిపిస్తుంది. ఇలా ముందుగా కొంత సూచన మాత్రంగా నేర్చుకుని ఆ తర్వాత ఆసక్తి ఉన్నవారు మరింత లోతుకు వెళ్లి అధ్యయనం చేసేందుకు ప్రాతిపదికగా ఇలాంటి కథా సందర్భాలు ఉండటం విశేషం.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

The story of reducing fever diseases, fever, health issues mantras telugu, devotional stotrys, maha bharatam

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON