Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

karthika Chalimilla Nomu Vidhanam Telugu | స్త్రీలకు సంపద, సంతానం, సౌభాగ్యాన్ని ప్రసాదించే నోము 'కార్తీక చలిమిళ్ల నోము'

కార్తీక చలిమిళ్ల నోము

స్త్రీలు సంపద ... సంతానం ... సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా 'కార్తీక చలిమిళ్ల నోము' చెప్పబడుతోంది. కార్తీకమాసమంతా ఉదయాన్నే స్నానం చేసి, ఈ నోముకు ఆధారమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున 'అయిదు మానికల బియ్యం చలిమిడి'ని అయిదుగురు ముత్తయిదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 'పది మానికల బియ్యం చలిమిడి'ని ఉసిరి చెట్టుకింద పదిమంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి.

ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి 'గౌరీ పూజ'చేయాలి. ఆ తరువాత 'పదిహేను మానికల బియ్యం చలిమిడి'ని పదిహేను మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకున్న తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం.

ప్రాచీన భక్తి సాహిత్యంలో వ్రత కథలకు ఎంతో విలువ, ప్రాధాన్యత ఉంది. సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించిన వ్రతాలు, నోముల గురించికూడా వీటిలో ప్రస్తావించడమైంది. కుటుంబ శ్రేయస్సు, సంతాన అభివృద్ధి పరమ లక్ష్యాలుగా ఆచరించడమే వ్రతాల ఉద్దేశం. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే మహాత్మ్యం గురించి తెలియజెప్పడమే ఈ శీర్షిక సంకల్పం.

నోమినమ్మకు నామినంత అని పెద్దలు చెబుతారు. ఏ పని చేయడానికైనా శ్రద్ధతో కూడిన భక్తి ఉంటే మంచి ఫలితాలను సాధించ వచ్చును. ఈ సూక్ష్మాన్ని బోధించడానికే పెద్దలు ఎంతో శ్రద్ధతో వివిధ వ్రతాలను, నోములను మనకందించారు.

'జన్మాంతర కృతం పాపం వ్యాధిరూపేణ జాయతే

తిచ్చాంతి రౌషధైర్డానై జపహోమర్చ వాదిభి 

పూర్వ జన్మలో చేసిన పాపం వ్యాధిరూపం లో మనను వెంటాడుతుందని జ్యోతిషంలోనూ, వైద్యశాస్త్రంలోనూ చెప్పడమైంది. ఇక్కడ వ్యాధి రూపంలో అనేది కేవలం శరీరాన్ని బాధించేది. మాత్రమే కాదు. మానసిక రూపంలో సంభవించేవని కూడా అర్ధం. శారీరకంగా, న్నాయి. మానసికంగా ఎలాంటి చీకుచింతలు లేకుండా ఉన్నవాడే సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలుగుతాడు. స్త్రీ అయినా, పురుషుడయినా పైకి గుండుపక్కలా దిట్టంగా ఉన్నప్పటికీ లోలోన మానసిక వెతలు పీడిస్తుంటే వారు ఆరోగ్యంగా మనగలగడం అసాధ్యం. దానికి శాంతి ప్రక్రియలో భాగంగా ఔషధం, దానం, జపం, హోమం, మంత్రం అనేవి శాస్త్రంలో సూచించడమైంది. ఏదైనా కష్టం వచ్చినా, అధిక ధ కలిగినా వాటిని నలుగురితో పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది.

సంతోషాన్ని పంచుకోవాలేగానీ, దుఃఖాన్ని పంచుకోవడం సబబేనా? ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మునుపటిలా దుఃఖాన్ని పంచుకుని ఓదార్చడానికి సైతం ఎవరికీ లేదు. ఒకప్పుడు కుటుంబమంతా కలిసిమెలిసి ఉ ౦డేది. ఉమ్మడి కుటుంబాల్లో కష్టసుఖాలను అందరూ సమంగా పంచుకునేవారు. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే! 'మేమిద్దరం, మాకిద్దరు' అన్నట్టుగా మన కుటుంబ వ్యవస్థ మారిపోయింది. అదీగాక, నేటి ఆర్థిక కాలానుగుణమైన మార్పులకు సహకరించడం లేదు. దాంతో నలుగురిలోనూ కలవాలన్నా, బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెంచుకోవాలన్నా నోములు, వ్రతాలనేవి సామాజిక స్నేహసంబంధాలకు ఉపకరిస్తున్నాయి.

భగవంతుడు స్వయంగా ప్రత్యక్షంగా మన ధూపదీప నైవేద్యాలను ఆస్వాదించలేడు. అందుకే సాటివారిలోనే భగవంతుని దర్శించి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే అవి ఆ పరంధాముడికి చేరతాయని ప్రతీతి.

కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరిగే ఈ ప్రకృతిలో మానవులకు-ప్రకృతికి నడుమ సహజీవనం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికే నోములు, వ్రతాలు, నియమాలు ఏర్పరిచారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకూ సూర్యుడు తులరాశిలోనూ, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ వృశ్చిక రాశిలోనూ సంచరిస్తాడు. ఈ సమయాన్ని చాంద్రమానంలో చూస్తే... కృత్తికా నక్షత్రం ఆధారంగా ఏర్పడే కార్తీక మాసం. పైన చెప్పిన తేదీలలో సూర్యుడు తన శక్తిని కోల్పోతాడు.. పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. శరదృతువు ఈ మాసంలోనే ప్రవేశిస్తుంది.

ఇక, జ్యోతిషపరంగా విశ్లేషిస్తే, రాశి చక్రంలో చంద్రునికి స్వక్షేత్రం కర్కాటకమైతే, ఉచ్ఛ స్థానం వృషభరాశి. ఈ రెండు రాశులకు నడుమనుండే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రాలున్నాయి. వీటిని శివ పార్వతులకు ఉద్దేశిస్తారు. లయతత్వంలో వీరే. స్త్రీ పురుషులు. శివుడు తలపైన ధరించిన చంద్రుడు ఆ మిథున రాశికి ముందున్న వృషభ రాశిలో ఉచ్ఛస్థానంలో ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో హరిహరులను పూజించడం. ఆచారం. ఉపవాసాలు, నక్తం, ఏకభుక్తం, కార్తీక స్నానాలు, దానాలు, హోమాలు, యాగాలు అన్నీ ఆచరించడానికి పుణ్యకాలం. అటువంటి పుణ్యకాలంలో స్త్రీలు ప్రత్యేకంగా ఆచరించదగ్గ నోము 'కార్తీక చలిమిళ్ల నోము'.

కార్తీక చలిమిళ్ల నోము కథ:

ప్రాచీన సాహిత్యానుసారంగా, స్నేహితు రాళ్లయిన యువరాణి, మంత్రి కుమార్తె కార్తీక చలిమిళ్ల నోము పడతారు. మంత్రి కుమార్తె తొలి ఏడాది నీలాటి రేవులో వాయనమీయగా, పరమేశ్వరుడామెకు నిత్య సంపదలు ప్రసాదిం చాడు. మరుసటి ఏడాది కొమ్మకింద వాయనం ఇవ్వగా, సింహకిశోరాల్లాంటి బిడ్డలను. అనుగ్రహించాడు. మూడో ఏడాది గుడిలో | వాయనమివ్వగా గౌరీదేవి కరుణించి శాశ్వత అయిదోతనాన్ని వరమిచ్చింది. ఆ విధంగా ఆమె దబ్బపండ్లవంటి పిల్లలతోనూ, ధనధాన్యాల తోను, తరగని అయిదోతనంతోనూ దర్జాగా బతుకుతుండేది.

ఆమె స్నేహితురాలైన యువరాణికి నిత్యం ఏదో ఒక ఆపద, చింతలతోకూడిన బతుకే ప్రాప్తించింది. అనుకూలత లేని దాంపత్యం.. అనారోగ్యమున్న శరీరంతో బాధపడుతుండేది. దీనిపై పార్వతీ దేవి పరమేశ్వరునితో 'స్వామీ, మంత్రి కుమార్తెతోపాటే రాజకుమారికూడా ఈ నోమును పట్టింది కదా? అయినా మంత్రి సుఖసౌఖ్యాలతో జీవిస్తుంటే, రాజకుమారి దుఃఖ దౌర్భాగ్యాలకు గురవుతోంది.

కారణమేమిటి?' అని నిలదీసింది. ఆ బియ్యపు చలిమిడి చేసి అయిదుగురు ముత్తయి పరమేశ్వరుడు చిరుమందహాసంతో 'గౌరీ, దువలకు నీలాటి రేవులో వాయనమివ్వాలి. రాజకుమార్తె నోచే నోములలో భక్తిశ్రద్ధలకు తావు లేదు. నోచిన తర్వాతకూడా ఆమెకు విశ్వాసం కలగలేదు. అది ఒకవిధంగా వ్రతాన్ని ఉల్లంఘన చేసినట్లే. అందుకే ఆమెకీ కష్టాలు, సిరిచెట్టు రోగాలు' అన్నాడు.

శివుడు చెప్పినది బోధపడడంతో, పార్వతీదేవి రాకుమారి కలలో కనిపించి చేయాలి. విషయమంతా చెప్పి కార్యనిర్దేశం చేసింది. పరమేశ్వరి స్వప్న సాక్షాత్కారంతో రాకుమారిలో అహంకారం తొలగిపోయింది. కార్తీక చలిమిళ్ల నోమును మరలా భక్తి శ్రద్దలతో ఆచరించి, భగవంతుని పట్ల విశ్వాసం కనబరిచింది. తత్ఫలితంగా అనతికాలంలోనే ఆమెకు కష్టాలు తొలగిపోయి కలిమి బలిమి ప్రాప్తించాయి.

నోమును ఆచరించే విధానం:

కార్తీక మాసం నెలపొడుగునా పై కథను ప్పుకుని అక్షతలు వేసుకోవాలి. కార్తీక మాసం మొదటి సంవత్సరం అయిదు మానికలు బియ్యపు చలిమిడి చేసి అయిదుగురు ముత్తయిదువులకు నీలాటి రేవులో వాయనమివ్వాలి.

రెండో ఏడాది నెలంతా కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. పౌర్ణమినాడు పదిమానికల బియ్యపు చలిమిడిని చేసి ఉసిరి చెట్టు కొమ్మ కింద పదిమంది ముత్తయిదువలకు వాయనమివ్వాలి.

మూడో ఏడాది ఈ నోమును ఉద్యాపనం నా కథను చెప్పుకుని అక్షతలు మొదటి రెండేళ్లలో చేసినట్టే నెల చేసుకోవాలి. ఆఖరి రోజున ఆలయానికి వెళ్లి గౌరీ పూజ చెయ్యాలి. 15 మానికల బియ్యపు చలిమిడిని 15 మంది ముత్తయిదువలకు వాయనం ఇవ్వాలి.

చలిమిడి చేసే విధానం.

బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి మూడుమార్లుగా కడిగి నీడన ఆరబోయాలి. కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి. దానిలో పచ్చి కొబ్బరి పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం, యాలుకలు, బెల్లం కలిపి ముద్దగా చేసుకోవాలి. ఆవుపాలు, నెయ్యి శరీరంలో వేడిని పెంచుతాయి. బెల్లంపల్ల జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. చలికాలం జీర్ణశక్తి మందగిస్తుంది కావున, చలిమిడితో అనారోగ్యం దరిచేరదు.

పైన చెప్పిన విధంగా అంత ఎక్కువగా కాకపోయినా శక్తికొద్దీ పదార్థాన్ని తయారు చేసి నోము చేసుకుంటే సత్ఫలితాలు దక్కుతాయి. రాబోయేది కార్తీక మాసం కాబట్టి, ఈ నోమును నోచుకుని గౌరీ పరమేశ్వరుల ఆశీర్వాదాన్ని పొందగలరు.

Famous Posts:

కార్తీక మాసంలో ఏ రోజు ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా?

కార్తీక మాసంలో ఇవి తీసుకోకూడదు.

కార్తీక మాసం 2022 తేదీలు, కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత.

కార్తీక మాసంలో ఈ నాలుగు తప్పకుండా పాటించాలి?

కార్తీక సోమవార వ్రత మహత్యం వెయ్యి అశ్వమేథయాగాల ఫలం.

Tags : కార్తీక చలిమిళ్ల నోము, Karthika Masam, Karthika Chalimilla Nomu, Karthika Puranam, Karthikam, Karthika Masam Telugu, Karthika Masam Nomu

Comments

Popular Posts