Drop Down Menus

ఏకాదశి ఉపవాసము ఉన్నచో కలిగే ప్రయోజనాలు - Ekadashi Fasting Benefits Telugu

ఏకాదశి ఉపవాసము ఉన్నచో ప్రయోజనము

(తత్వసాగరము)

1. ఎటువంటి రోగాలను  అయినా నయం అవుతాయి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి దేవదేవుడే ఏకాదశీ వ్రతాన్నీ పరమౌషధంగా అందజేశాడు.

(తత్వసాగరము)

2. ఏకాదశీ వ్రత పాలనము ద్వారా సంసార సర్ప విషకాటు నుండి మనిషి బయట పడతాడు. ఆ విధముగా అతడు సమస్త పాపాల నుండి విడుదలను పొందుతాడు.

(నారదపురాణము)

3. నూరు జన్మలుగా ప్రోగుపడిన పాపమనే కాష్టము ఏకాదశి వ్రతపాలనమనే అగ్నిచే క్షణములో భస్మిపటలమైపోతుంది.

(పద్మపురాణము)

4. శుక్లపక్షములో, కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశులు రెండింటినీ శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారు. ఏకాదశి రోజు ఎందుకు భోజనం చేయరాదు.

(నారద పురాణము)

5.బ్రహ్మహత్యా పాతకముతో పాటు సకల పాపాలు ఏకాదశి రోజు ధాన్యమును ఆశ్రయించి ఉంటాయి కనుక ఎవరైతే ఆ రోజు అన్నమును తింటారో వారు పాపమునే తిన్నట్లు అవుతుంది.

(స్కంధపురాణము)

6. ఏకాదశి రోజు అన్నమును తినేవాడు మాతృహత్య, పితృహత్య, భ్రాతృహత్య, గురుహత్య పాపాన్ని పొందుతారు. అటువంటి వాడు ఏనాడూ భగవద్ధామాన్ని పొందలేడు.

(బ్రహ్మవైవర్తపురాణము)

7. ఏకాదశీ రోజు ధాన్యాన్ని తినేవాడు కేవలము పాపమును తిన్నవాడవుతాడు. ఎందుకంటే ఆ రోజు సమస్త పాపాలు ధాన్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. కనుక భ్రాంతికి లోనై ఎవడైతే ఏకాదశి రోజు అన్నము తింటాడో అసంఖ్యాకమైన పాపాలను పొందుతాడు.

(విష్ణుధర్మోత్తర పురాణము)

8. ఏకదశి రోజు అన్నమును తినే బ్రాహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసి గోమాంస భక్షణ చేసినవాడే అవుతాడు.

(పద్మపురాణము)

9. దేవీ! ఏకాదశి రోజు యజ్ఞ ప్రసాదము తినడమే నిషేధించబడినపుడు ఇక సాధారణ ధాన్యము గురించి వేరుగా చెప్పేదేముంది?

(విష్ణు ధర్మోత్తరపురాణము)

10. పాపము చేస్తే మనిషి తానొక్కడే నరకానికి పోతాడు. కాని అతడు ఏకాదశి రోజు అన్నము తింటే పితరులతో పాటుగా నరకానికి వెళతాడు.

(పద్మపరాణము, ఉత్తరఖండము)

11. తల్లి లేదా తండ్రి శ్రద్ద దినము ఏకాదశి రోజు వస్తే దానిని మర్నాడు చేయాలి. ఏకాదశి రోజు పెట్టి పిండాలను పితృదేవతలు, దేవతలు స్వీకరించరు.

(పద్మపురాణము, ఉత్తరఖండము)

12. ఏకాదశి రోజు ఎవరైతే భోజనం చేయండని ఇతరులకు చెబుతాడో, భోజనం చేయిస్తాడో అతడు కూడా గోహత్య, స్త్రీహత్య, బ్రాహ్మణ హత్య పాతకాన్ని పొందుతాడు.

Famous Posts:

Tags: ఏకాదశి, ఏకాదశి ఉపవాసం, Ekadashi, Ekadashi Fasting, Ekadashi Vrat rules, Ekadasi Fasting Rules, Ekadasi Fasting Benefits Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.