Drop Down Menus

Don't forget to know before leaving to Arunachalam

Tiruvannamalai / Arunachalam Girivalam Part 2

అరుణాచలం లో గిరిప్రదిక్షణ ఒక ఏడూ సార్లు చేసే భాగ్యం కలిగింది. ఆ అనుభవంతో ఈ పోస్ట్ రాస్తున్నాను, అరుణాచలం లో గిరిప్రదిక్షణ సుమారు 14 కిలోమీటర్ల దూరం,మొదటిసారి అరుణాచలం వెళ్లేవారికి ఈ పోస్ట్ ఉపయోగపడగలదు, అరుణాచలం గిరిప్రదిక్షణ రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను, మొదటి భాగం కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి. 
Arunachalam Giripradikshina Part 2 in Telugu

అరుణాచలం లో గిరిప్రదిక్షణ ఏ సమయం లోనేనైన, ఏ రోజైన చేయవచ్చు ఒక్కోరోజు చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది అని చాగంటి గారి అరుణాచల ప్రవచనం లో విన్నాను, పౌర్ణమి రోజున వేల సంఖ్యలో భక్తులు  గిరిప్రదిక్షణ చేస్తారు, మీరు పౌర్ణమి నాడు చేయదలిస్తే ముందుగానే రూమ్స్ బుక్ చేస్కొండి. ఈ క్రింది లింక్ ద్వార మీరు ఆ వివరములు చూడవచ్చును. 
Accommodation in Arunachalam
అరుణాచలం బెంగళూరు , హైదరాబాద్ , తిరుపతి నుంచి ఎలా చేరుకోవాలో ఈ క్రింది లింక్ లో చూడవచ్చును. 

 గిరిప్రదిక్షణ మాట్లాడకుండా చెయ్యాలి , శివనామ స్మరణ మరువకుండా చెయ్యండి. నడవలేని వారు ఆటో లలో కొండచూట్టు ప్రదిక్షణ / అక్కడున్నా దేవాలయాలను దర్శిస్తున్నారు. 


సరే గిరిప్రదిక్షణ చేద్దాం రండి. ఇప్పడివరకూ మనకి దేవాలయాలన్నీ రోడ్డు ప్రక్కనే కనిపించాయి , ఆదిఅన్నామలై మాత్రం కొంచెం రోడ్డు లోపలికి వెళ్ళాలి , పైన బోర్డ్ చూసారా .. అది తమిళం లో కనిపిస్తున్నా ఆదిఅన్నమలై ఆలయానికి దారి .. 
 మీరు అల నడుచుకుంటూ వస్తే ఆలయం కనిపిస్తుంది , ఇంకా కాస్త ముందుకి వెళ్తే ఆది అన్నామలై  గోపురం కనిపిస్తుంది. 


Adi Annamalai Temple , Arunachalam
Amman Temple , Adi Annamalai
అరుణాచలం ఆది అన్నామలై ఆలయం లోపలి ఫోటో లు ఇవి .. దర్శించండి. 


ఆలయం నుంచి బయటకు వచ్చిన తరువాత ఎడమవైపుకి తిరిగి నడుచుకుంటూ వస్తే ఈ రోడ్డు పైకి వస్తారు.. 




మీరు నమః శివాయ అనుకుంటూ ప్రదిక్షణ చేస్తూ ముందుకి కదులుతుంటే మనకి వాయు లింగం కనిపిస్తుంది. 
Vayu Lingam , Arunachalam


Vayu Lingam Temple 

Chandra Lingam , Arunachalam

Kubera Lingam , Arunachalam
కుబేర లింగం వరకు వచ్చేసాం మనం.. రండి లోపలి దర్శనం చేస్కొండి .. 


PANCHA MUKHA DARSAN

మనం ఇప్పడివరకూ ఆది అన్నామలై ఒక్క చోటే మనం లోపలికి వెళ్ళాం ... ఇప్పుడు మరోసారి .. రోడ్డు మలుపు తిరిగుతుంది ఎప్పడిలాగానే మనం కుడివైపుకి తిరగాలి .. కాస్త దూరం నడిచిన తరువాత మనకి ఎదురుగా హోటల్స్ కనిపిస్తాయి ..  రోడ్డు రెండు గా విడిపోతుంది . మనం అప్పుడు ఏమవైపు ఉన్న రోడ్డు లోకి వెళ్ళాలి .. తెలియక పొతే అక్కడివాళ్ళను అడగండి ..   

Eesanya Lingam
ఈశాన్య లింగం దర్శించండి .. 
 EASANYA LINGAM , Arunachalam

ఈ శాన్య లింగం దర్శనం అయినతరువాత మీరు అదే రోడ్డు లో వస్తే మనకి ఈ విష్ణు ఆలయం  కనిపిస్తుంది. 
Vishnu Temple at Arunachalam 

ఈ ఆలయం వెనకాలే .. అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది . 
Aruanchaleeswara Temple / Main Temple Arunachalam


రెండు కళ్ళు చాలడం లేదు కదా .. ఆలయం చూడ్డానికి ఎంత సమయం పడుతుంది అంటే ఏమి చెప్తాం చెప్పండి .. ఒక్కరోజు సరిపోతుందా చెప్పండి , దర్శనం అయితే మామోలు రోజుల్లో 30 నిమిషాల లోపే అవుతుంది అని చెప్పగలను. 
AGNILINGAM , Arunachalam
అగ్ని లింగం చేరుకోవడానికి మనం 1 1/2 కిలోమీటరు నడవాలి. అరుణాచలేశ్వర దర్శనం అయినతరువాత కుడివైపుకి నడిచి ఆలయం వెనక్కి వస్తే మెయిన్ రోడ్డు వస్తుంది .. అలానే నడుచుకుంటూ వస్తే అగ్నిలింగం చేరుకుంటాం .
Dakshinamurthy Temple
తిరిగి రోడ్డు మీదకి వచ్చి .. నడిస్తే కొద్ది దూరం లోనే దక్షిణ మూర్తి ఆలయం కనిపిస్తుంది. 
Amman Temple
దక్షిణ మూర్తి ఆలయానికి దగ్గర్లోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. 

SRI SESHADRI SWAMY ASHRAMAM, ARUNACHALAM
శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం , రమణాశ్రమం రెండు ఒకేచోట ఉంటాయి. 

రమణులు తపస్సు చేస్తుండగా గుర్తించింది శేషాద్రి స్వామి వారే .. 
SRI RAMANASRAMAM ARUNACHALAM
రమణుల ఆశ్రమానికి చేరుకున్నాం .. మనం మొదలు పెట్టింది కూడా రమణుల ఆశ్రమం నుంచే కదా ! 

Arunachalam Related Posts :








మీ సలహాయలను సూచనలను కామెంట్ రూపం లో తప్పకుండా.. తెలియచేయండి ..
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. చాల మంచి సమాచారము ఇచ్చారు. అభినందనలు.

    ReplyDelete
  2. హైదరాబాద్ నుంచి చిత్తూరు మీదుగా కాట్పాడి వరకూ రైలు ఛార్జ్ ; మళ్ళీ కాట్పాడి నుంచి తిరువణ్ణామలై బస్సు ఛార్జ్ కలిపి మనిషికి 500/- కేసినేని వాళ్ళ వోల్వోలో అయితే హైదరాబాద్ నుంచి తిరువణ్ణామలై డైరెక్ట్ బస్సు ఛార్జ్ 1400/-

    ReplyDelete
  3. very useful information sir, thanks.
    please mention how to reach arunachalam by train from tirupathi. i came to know that only one direct weekly train available. please mention another train route.
    Thankyou sir,

    ReplyDelete
  4. thank u sir for valuable information

    ReplyDelete
  5. very detailed information , Thank you much

    ReplyDelete
  6. i plan to visit n do girivalayam along wit family coming 27 th nght it is before day of amavasya.so is it gud or comfort to do girivalayam ???? pls tel me as well as posible.tq

    ReplyDelete
  7. thank you so much for the detailed explanation...this is very useful for the first time visitors...God bless you sir...continue good work
    nedunuri ananth rao

    ReplyDelete
  8. thank you so much for the detailed explanation...this is very useful for the first time visitors...God bless you sir...continue good work
    nedunuri ananth rao

    ReplyDelete
  9. 56887⇒56885/Tirupati - Villupuram Passenger (UnReserved)
    From Tirupathi starts from 13:50(1:50 pm)

    ReplyDelete
  10. అద్భుతమైన మార్గదర్శనం

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.