Drop Down Menus

How to Apply For Tirumala Srivari Seva | Tirumala Information

శ్రీ వేంకటేశ్వర  స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్నికల్పిస్తోంది టీటీడీ.
శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?
తెలుసుకోండి మరి...!

ప్రస్తుతం ఆన్ లైన్ లో మాత్రమే సేవ కు అప్లై చెయ్యాలి ..!
ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను శ్రీవారి సేవ వెబ్సైటు లో నమోదు చెయ్యాలి 
ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.
హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.
శ్రీవారి సేవకు బుక్ అయినా తరువాత  గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల ఆధార్ కార్డు లను  తిరుమల సేవా సదన్‌లో చూపించాలి .
వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.
వైకుంఠ ఏకాదశి రథసప్తి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా టీం లను తీసుకుంటారు ఆ సమయం లో 18-50 సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు.
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు , మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.
శ్రీవారి సేవాసదన్‌లో డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.
సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.
గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.
శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.
కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."
నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.
డ్రెస్ కోడ్..!
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
వివరాలు పంపాల్సిన చిరునామా..!
పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
వివరాలకు 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.
Age limit for applying General seva is 18-60 years, for Laddu prasada seva is 18-65 years and for Parakamani seva is 35-65 years. Devotees should register with Srivari Seva portal for applying Srivari General Seva, Parakamani Seva & Laddu Prasada Seva. Srivari Sevaks can cancel their confirmed seva services of Parakamani / Laddu Prasada Seva in seva history or in apply Parakamani / Laddu Prasada Seva. Age limit for applying General seva is 18-60 years, for Laddu prasada seva is 18-65 years and for Parakamani seva is 35-65 years.

How to Apply Srivari Seva Online:
శ్రీవారి సేవ ఆన్లైన్ లో బుక్ చేస్కోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
శ్రీవారి సేవకు బుక్ చేస్కునే ముందు ఆ రోజుల్లో  Availability ఉందో లేదో చెక్ చేస్కోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి :
Official Website : http://srivariseva.tirumala.org/
TTD SEVA ( voluntry service ) website:
http://www.tirumala.org/
పై వెబ్సైట్ లో మీరు శ్రీవారి సేవ కు , లడ్డు సేవకు , పరకామణి సేవకు విడివిడిగా బుక్ చేసుకోవచ్చును. 
తిరుమల పూర్తి సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 


how to book sri vari seva, srivari seva registration, tirumala seva service, srivari seva age limit, tirumala seva booking website, tirumala seva availability checking, parakamani seva booking, laddu seva booking, tirumala information. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.