జూన్ లో నేను వెళ్ళిన కర్ణాటక యాత్ర విశేషాలు..
విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం (విజయనగరం) హంపి ఎన్నోరోజులుగా చూడాలనుకున్న కల నెరవేరింది. శిథిల నగరంగా కనిపించే హంపి యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది.
విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం (విజయనగరం) హంపి ఎన్నోరోజులుగా చూడాలనుకున్న కల నెరవేరింది. శిథిల నగరంగా కనిపించే హంపి యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది.
కనిపించే ప్రతి రాయిలోను దేవుడి ని చూసే హిందువులకు మహమ్మదీయుల దాడిలో ఇక్కడి కూల్చివేసిన ఆలయాలు, విరగ్గొట్టిన విగ్రహాలు బాధ కలిగిస్తాయి. అద్భుత ఆలయాలు, శిల్పాలు ఉన్నప్పటికీ విరూపాక్ష ఆలయం లో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మిగతా విరిగిన
విగ్రహాలను పూజించడం హిందూ సాంప్రదాయం కాదు కాబట్టి.
మొన్నామధ్య కోర్టు మొట్టికాయలు వేసేదాకకూడా కర్ణాటక ప్రభుత్వం పెద్దగా సంరక్షణ, అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. హంపి లో బస చేసేందుకు సౌకర్యాలు తక్కువ, దగ్గర లో ఉన్న కమలాపురం, హోస్పేటలోనే చూసుకోవాలి.
హంపి గురించి పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా గైడ్ ను మాట్లడుకోవలసిందే. (500 రూ) పూర్తి గా హంపి చూడాలంటే ఆటో (500రూ) మాట్లాడుకోవడం మంచిది.
మా గైడ్ ఉదయం 8గం లకు హంపి సందర్శన ప్రారంభించి ముఖ్యమైన విఠల ఆలయం, (మేము వెళ్ళినపుడు విఠల ఆలయంలో పునరుద్దరణ పనులు చేస్తున్నందున సందర్శనకు పూర్తిగా అనుమతించలేదు ,) కోట, లోటస్ మహల్, ఉగ్ర నరసింహలాంటి 10 ముఖ్యమైన ప్రదేశాలను చూపించి మద్యాహ్నంకల్లా
ముగించాడు..
కానీ పూర్తి గా చూడాలంటే కనీసం 3 రోజులైనా సరిపోదని చెప్పాడు.
కర్ణాటక టూర్ లో1వ రోజు ఇలా పూర్తి అయింది.
Credits: Bhadrinath Patha
hampi tour , hampi temple information in telugu, karnataka famous temples, famous places in karnataka, hindu temples information in telugu, hampi tour planning, temple guide,