17 Special Lord Shiva Temples in India | You Must Visit These Siva Temples

మన దేవాలయాల్లో శివలింగాలు అన్ని ఒకేలా ఉండవు. కొన్ని శివలింగాలు స్థలపురాణాలు దృష్ట్యా ప్రత్యేకంగా ఉంటాయి .. వాటిలో మీకు ఇప్పుడు కొన్ని ప్రత్యేకత గలిగిన శైవక్షేత్రాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

1. అతిచిన్న శివలింగం 

సాధారణంగా మనం ఎత్తైన కట్టడాలు.. ఎత్తైన విగ్రహాలకోసం మాట్లాడుకుంటుంటాం కానీ మీకు తక్కువ ఎత్తుకలిగిన శివలింగం ఎక్కడుందో తెలుసా ? ద్రాక్షారామ క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరం లో గల కోటిఫల్లిలో కలదు. ఇక్కడ స్వామి వారు సోమేశ్వరుడుగాను , కోటేశ్వరుడిగాను పూజలందుకుంటున్నారు. సోమేశ్వర లింగమే అతి చిన్నది, కోటేశ్వర లింగం ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. 

Koteswara Lingam kotiphalli
ఈ ఆలయ సమాచారం కోసం క్రింద లింక్ పై క్లిక్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు.
https://goo.gl/BABDvX

2. శివునిపై గంగమ్మ
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి సుమారు 15 కిమీ దూరం లో గల దుర్గాడ గ్రామం లో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం లో శివునిపై గంగమ్మ ఉంటుంది. గంగమ్మ గా భావించే చిన్న రాయి శివలింగం పై ఉంచి పూజలు చేస్తారు. ఆలా రాయి ఉండటానికి ప్రత్యేక కారణం కలదు. అక్కడ స్థలపురాణం ఆలయ విశేషాలు కొరకు క్రింది లింకుపై క్లిక్ చేయండి.
https://goo.gl/xuOlUn

3 . రంగులు మారుతున్నా శివుడు
అమావాస్యనాడు గోధుమ రంగులోను, పౌర్ణమినాడు తెల్లటి వర్ణం లోను శివుడు దర్శనం ఇస్తాడు, ఎక్కడ ఈ ఆలయం అనుకుంటున్నారా ? పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమారామ క్షేత్రం. మీరు రంగుల్లో తేడాను గుర్తించాలంటే రెండు సార్లు వెళ్ళాలి.  మరీంత సమాచారం కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి :
4. గునపం పట్టిన శివుడు 
పరమశివుడు తన్నునమ్ముకున్న భక్తులకోసం తానే స్వయంగా మనుష్య రూపం లో  గునపం పట్టి, మట్టిని తలపై మోసి చెరువును త్రవ్విన స్థలపురాణం తో కూడుకున్న ఆలయం శిరిచెల్మ లో కలదు. 


పై ఫోటో లో శివలింగం పై కాస్త లోతుగా ఉండటం గమనించవచ్చు. ఇక్కడ శివలింగం ఎదురుగా రెండు చిన్న శివలింగాలు ఉంటాయి. ఆలయ విశేషాలు కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 

5 . జలలింగం 
పంచభూతలింగ క్షేత్రాలలో జలలింగం క్షేత్రమైన జంబుకేశ్వర లింగం శ్రీరంగం క్షేత్రానికి 1 కిమీ దూరం లో కలదు, ఈ ఆలయం లో చాల విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శివలింగం క్రింద నుంచి ఎప్పుడు నీరు వస్తుంటుంది. మరోకటి ఎత్తైన గోపురాలు, విశాలమైన మండపాలు ఉన్నప్పటికీ అంతరాలయం మాత్రం కేవలం 5 అడుగుల ఎత్తుతో చాల చిన్నగా నిర్మించారు. ఆ విశేషాలు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం నుంచి విని తెలుసుకోవాలనుకుంటే క్రింది లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి.

https://goo.gl/gxMXtJ
6 . దక్షిణామూర్తిగా కొండపైన వెలసిన శివలింగం
గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ పైన ఉన్న శివుడు దక్షిణామూర్తిగా దర్శనం ఇస్తాడు.. కొండపైన దక్షిణ మూర్తిగా దర్శనం ఇచ్చే శివలింగాలు అరుదు. ఈ ఆలయం లో ధ్వజస్తంభం ఉండదు. ఎటువైపు చూసిన మూడు శిఖరాలతో కోటప్పకొండ కనిపిస్తుంది. ఈ శిఖరాలను బ్రహ్మ, విష్ణు , రుద్ర శిఖరాలుగా పిలుస్తారు.
ఆలయ స్థలపురాణ విశేషాలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం లో వినండి. క్రింది లింక్ ఇవ్వబడింది.

https://goo.gl/MxDLZc
7. కోడిరూపం లో శివుడు
కుక్కుటరూపం లో దర్శనం ఇచ్చే అరుదైన శివలింగం పిఠాపురం పాదగయ క్షేత్రం లో కలదు. ప్రస్తుతం ఈ శివలింగాన్ని మనం చూడలేము. ఇక్కడ స్వామి వారిపేరు కుక్కుటేశ్వరుడు. పాదగయ క్షేత్రం లోనే పదవ శక్తిపీఠం పురుహూతికా అమ్మవారు, స్వయంభు దత్తాత్రేయ స్వామి మనకు దర్శనం ఇస్తారు.  ఆలయవిశేషాలు కొరకు క్రింద లింకుపై క్లిక్ చేయండి.

https://goo.gl/YidzI0
8. మానవ రూపం లో శివలింగం
మనం చూసే శివలింగాలకు పూర్తీ భిన్నంగా గుడిమల్లం లో గల పరశురామేశ్వర లింగం కనిపిస్తుంది. మనుష్య ఆకారం లో ఒకవేటగాడు పోలిన వ్యక్తి చేతిలో కత్తి  కట్టిపట్టుకుని మరోక రాక్షస ఆకారం పై  నిలబడి ఉన్నట్టు కనిపిస్తూ పైన లింగాకారం లా కనిపిస్తుంది. ఈ ఆలయ విశేషాలు క్రింది లింక్ పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
https://goo.gl/ipaGAv
9. తలక్రిందులుగా శివుడు :
సాకారరూపం లో శివుడు కనిపించే క్షేత్రాలు చాల చాల అరుదు, అలాంటిది శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ పైగా అమ్మవారితో కలిసి ఒకేపీఠం పై దర్శనం ఇచ్చే క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదుర్రు గ్రామం లో కలదు.  శ్రీ చాగంటి వారి ద్వారా అక్కడ స్థలపురాణ విశేషాలు తెలుసుకోవడం కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://goo.gl/AWSm53
10. ఒకేపీఠం పై గంగమ్మశివయ్య 
పైన చెప్పుకున్నాం కదా అమ్మవారు అయ్యవారు ఒకేపీఠం ఉన్నారని .. భీమవరం నుంచి 7 కిమీ దూరం లో గల దిరుసుమర్రు గ్రామం లో గంగమ్మతల్లి , శివయ్య ఒకేపీఠం కొలువైయున్నారు.
11. పంచారామ క్షేత్రాలు
పంచారామ క్షేత్రాలలో శివలింగాలు చాలాపొడవుగా ఉంటాయి.. అమరారామం , సామర్లకోట , ద్రాక్షారారామం క్షేత్రాలలో మొదటి అంతస్తు పై నుంచి పూజలు చేస్తారు. పంచారామ క్షేత్రాలు అన్ని ఒకరోజు లోనే చూసివస్తుంటారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి పంచారామ క్షేత్ర విశేషాలు తెలుసుకోవచ్చు.
https://goo.gl/KTSO2P
12. వాయులింగం
పంభూతలింగ క్షేత్రాలలో ఒకటైన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి లో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే పైన ఫోటో లో ఎడమవైపు దీపం కనిపిస్తుంది చూసారా ? ఆ దీపం ఎప్పుడూ శివలింగం నుంచే వచ్చే గాలి వలన కదులుతూ ఉంటుంది, దీపానికి కూడా నమస్కరిస్తారు. ఆలయం లో రెండు వైపులా దీపాలు ఉన్నప్పటికీ కుడివైపున ఉన్న దీపం కంటే ఎడమవైపున ఉన్న దీపం గాలికి ఎక్కువ కదలడం మనం గమనించవచ్చు.
Click Here More Information : https://goo.gl/dNuvoX
13 .  ప్రతిధ్వని లేని ఆలయం
తంజావూరు బ్రహదీశ్వర ఆలయం చాల చాల పెద్ద ఆలయం, ఈ ఆలయ నిర్మాణం లో ప్రతిదీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. ఆలయ నిర్మాణం జరిగి 1000 సంవత్సరాలైన చెక్కుచెదరని నిర్మాణం ఈ ఆలయం సొంతం. ఈ ఆలయం లోపల ప్రతిధ్వని లేకపోవడం ఆశ్చర్యం, ప్రతిధ్వని రాకుండా సౌండ్స్ అన్ని శివలింగం లోకి వెళ్ళేటట్లు శివలింగం నిర్మాణం చేసారని చెబుతారు. చాల పెద్ద శివలింగం, అతి పెద్ద నంది ఎత్తైన విమానం ఈ ఆలయం లో చూడవచ్చు. 
Click Here More Informationhttps://goo.gl/JHrTYp
14. పుట్టాకారం లో శివలింగం
ఎప్పుడైనా మహానంది క్షేత్రం అనగానే పెద్ద నంది మనకి స్ఫురణకు వస్తుంది, ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం పుట్ట ఏ విధంగా ఐతే ఉంటుందో అలానే ఉంటుంది. స్థలపురాణం మీకు మహానంది క్షేత్రం  కోసం వివరించినప్పుడు చెప్తాను.. 

ఉదయం 5 కి  మీరు వెళ్తే లోపల ఉన్న కోనేరులో స్నానం చేస్తే ఎప్పడికి ఆ అనుభూతిని మర్చిపోలేరు. స్వామివారికి ఇచ్చే హారతులు చూడవచ్చు మరియు స్వామివారిని తాకుతూ నమస్కరించవచ్చు. 100/- పెట్టి టికెట్ తీస్కోవాలండోయ్. 
15 . కొండే శివుడు 
తిరుణ్ణామలై తెలుగు లో అరుణాచలం క్షేత్రం లో కొండనే శివునిగా భావిస్తారు. ఈ క్షేత్రం పంచభూతలింగ క్షేత్రాలలో అగ్నిలింగ క్షేత్రం.  కొండచుట్టు 8 లింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ గిరిప్రదిక్షణ ప్రసిద్ధి .. 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పౌర్ణమిరోజు / చైత్రపూర్ణమి రోజు లక్షల్లో జనం గిరిప్రదిక్షణ చేస్తారు. అరుణాచలం కోసం సమగ్రసమాచారం మీకు క్రింది లింక్ పై  ద్వారా తెలుసుకోవచ్చు . 
https://goo.gl/pTixBs
16 . శయన భంగిమలో శివయ్య 
ఇప్పడివరకు చూసిన క్షేత్రాలకంటే భిన్నంగా అమ్మవారి ఒడిలో తలపెట్టుకుని శయన భంగిమలో శివుడు కనిపించే ఆలయం సురుటపల్లి లో కలదు, ఈ ఆలయం ఆంధ్రకు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే బస్సు లో ప్రయాణిస్తే ఈ గ్రామం కనిపిస్తుంది. చెన్నై నుంచి 55 కిమీ దూరం లో కలదు. 
17 . ఆకాశమే లింగం
చిదంబరం రహస్యం అని అందరం విన్నవాళ్ళమే .. ఇంతకీ అక్కడ రహస్యం ఏమిటంటే అక్కడ శివలింగం లేకపోవడమే, చిదంబరం ఆలయ చరిత్ర ఎలాగో క్రింద లింక్ పై క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ రెండు విషయాలు మీకు చెబుతాను పైన గూగుల్ మ్యాప్ కనిపిస్తుంది కదా జాగ్రత్తగా చూడండి పంచభూత లింగ క్షేత్రాల్లో మూడు లింగాలు శ్రీకాళహస్తి, కాంచీపురం, చిదంబరం క్షేత్రాలు ఒకేవరసలో నిర్మించారు .. చిదంబరం శైవ క్షేత్రమే కాదు వైష్ణవ క్షేత్రం కూడా 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి, ఆలయం లోపల విష్ణుమూర్తి ఆలయం కూడా మనం చూడవచ్చు, చిత్రగుప్తిని ఆలయం కూడా ఉంది. 
https://goo.gl/Cr4Vai

మంచుతో సహజంగా ఏర్పడే అమర్నాధ్ కోసం మీకు తెలుసా కదా ! , కాంచీపురం లో పంచభూతలింగాలలో ఒకటైన భూ లింగం ఉంది. ఇసుకతో ఈ లింగం ఉంటుంది. అందువల్ల ఇక్కడ జలం తో అభిషేకం చేయరు. ఇక్కడ లింగం పై కి సంవత్సరానికి ఒకసారి సూర్యకాంతి పడుతుంది. 

మీకు తెలిసిన ఆలయాల విశేషాలు కామెంట్ చేయండి.  శైవక్షేత్రాలు క్రింద ఇవ్వబడినవి 
> Famous Shiva Temples in India

> Famous Temples in Tamil Nadu State


> Pancharama Kshetras Information in Telugu


> Panchabuta Stalam Details in Telugu


> Jyotirlinga Kshetramas information in Telugu


> Famous Lord Shiva Temples


famous temples, draksharamam, gudimallam , bhimavaram , kotiphalli , durgada , pithapuram , yanamadurru , srirangam, sri rangam, jambukeswaram , Andhra Pradesh , Telangana , Tamil Nadu , Lord Shiva Temples, Accommodation Details

4 Comments

  1. Hi.. thanks for the information.
    You can add about kaleshwaram, karimnagar district

    ReplyDelete
  2. hai sir please send Arunachala giripradakshanam kosam vellali ala please gide me

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS