Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Amavasya Pitru Tarpanam Information in Telugu

మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అటువంటి తల్లిదండ్రులకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, వాళ్లకు మనం చేసేది ఒక్కటే పితృకర్మలు, వాళ్ళు చనిపోయిన 11రోజులకు శ్రాద్ధం పెట్టి వదిలేస్తారు. అలాకాకుండా అమావాస్యనాడు కూడా మనం తల్లిదండ్రులకు పితృకర్మలు నిర్వహించాలి, అప్పుడే వాళ్ళ ఆత్మకు మనశాంతి కలుగుతుంది.
మన శ్రేయస్సును కోరుకునేవారు పితృదేవతలు. సూర్యోదయ, సూర్యాస్తమయం పితృదేవతలకు వేరుగా వుంటాయి. కృష్ణపక్ష అష్టమి తిథి మధ్యలో వారికి సూర్యుడు ఉదయిస్తాడు. శుక్లపక్ష అష్టమి నాడు అస్తమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే అమావాస్యకు సమయం వారికి మధ్యాహ్న సమయవుతుంది. పితృదేవతల గురించిన పూర్తి వివరాలను విష్ణుపురాణం ప్రధమఖండం వెల్లడిస్తోంది. ప్రతి  అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. పిండాలు పెట్టలేని స్ధితిలో వున్నవారు కనీసం నీరు వదలాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో గడపవైపు తిరిగి నమస్కరించాలి. పితృదేవతలు ఏడుగణాలుగా వుంటారు. మొదటి మూడు గణాల దేవతలు అమూర్తులుగా అంటే వారికి ఎలాంటి ఆకారాలు వుండవు. మిగిలిన నాలుగు గణాలైన వారికి మాత్రం ఆకారాలుంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాన్ని భుజిస్తాయి. భోజనంతో సంతృప్తి చెంది శ్రాద్ధ దాతకు సుఖ, సంతోషాలను ఇస్తుంటాయి. దీంతో పాటూ శ్రాద్ధ దాతకు సంబంధించిన తాత, ముత్తాత, తండ్రి ఏలోకంలో వున్నా పితృదేవతలు వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. మనకు తెలిసి పితృదేవతలంటే తాత, తండ్రి అనుకుంటారు. అయితే దేవతాగణంలో ఏడు విభాగాలుగా వీరు వుంటారని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. పితృదేవతలు తృప్తిగా వున్నంత కాలం యావత్‌ విశ్వం సుభిక్షంగా వుంటుంది. అందుకనే విధిగా పితృదేవతలకు ఈ కార్యక్రమం చేయాలి.

Related Postings:

> Aditya Hrudayam Ebook Free Download

> 17 Special Siva Temples in India

> Astadasa Sakthipeetham Information in Telugu

> Kedharnath Temple History in Telugu

> Ammalaganna Amma Paramardham

> Kashi Rameswara Yatra Visistata

Pitrukarmalu information in telugu, pitru karmalu, pitrukarmalu history in telugu, amavasya pitrukarmalu, amavasya, pitru tarpanam iformation, pitru tarpanam in telugu, hindu temples guide.

Comments