Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

రథసప్తమి అంటే ఏంటి..? దీని విశిష్టత ఏంటి? Ratha Saptami Importance

రథసప్తమి :
సకల చరాచర జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తాడు సూర్యభగవానుడు.హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు.
దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. ఆ రోజునే సప్తాశ్వా రథారూఢుడై ప్రపంచానికి దర్శనమివ్వడంతో రథసప్తమిగా వేడుకలను జరుపుకొంటాం. రథంలోని భాగాలు సమయాన్ని, రుతువులను పేర్కొంటాయి. ఉత్తరదిశవైపు సూర్యుడి ప్రయాణం ప్రారంభమవుతుంది. దైవారాధనలో సూర్యుని ఆరాధనకు విశిష్టమైన స్థానముంది. ప్రత్యక్షంగా సూర్యుడు దర్శనమిస్తాడు.


కాల నిర్ణయం :
సూర్యరథానికి ఒక్కటే చక్రం. దానికి ఆకులు ఆరు. గుఱ్ఱాలు ఏడు. అసూరుడు సారథి. కాంతులు విరజిమ్ముతూ, నిరంతరం ప్రయాణించడం, అతని గుణం. ఇది సూర్యుని భౌతిక స్వరూపం. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే.సూర్యుని వెలుగులు లేని ప్రపంచం చీకటితో భీతావహంగా ఉంటుంది. వ్యవసాయానికి, మానవులకు, జంతువులకు, ఇతర 
జీవజాలానికి సూర్యుని కిరణాలే ఆధారం. సూర్యురశ్మి లేని ప్రపంచాన్ని తలచుకుంటే భయంతో వణికిపోతాం. సూర్యనమస్కారాలు చేయడం ఆరోగ్యరీత్యా కూడా మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

విధి విధానాలు :
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. వైవస్వత మన్వంతరంలో మొదటి తిథి రథసప్తమి. ఈ పర్వదినాన జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులను తలపై ఉంచి అభ్యంగనస్నానం చేయిస్తారు. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఆదిత్యుని ఆరాధన మానవులను ఎంతో పునీతం చేస్తుంది.

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.

రథసప్తమి రోజు ఏం చేయాలంటే :
రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం  సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలిట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు,ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై,భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే || 
("సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.)
ఈ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యటం శ్రేయస్కరమట. మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరుబయట(సూర్యకిరణాలు పడే చోట) తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి,దానిపై వరిపిండితో పద్మం వేసి,పొయ్యి పెట్టి ఆవుపేడతో చేసిన పిడకలు అంటించి, ఆవుపాలు పొంగించి,ఆ పాలల్లో కొత్తబియ్యం,బెల్లం,నెయ్యి,ఏలకు
లు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా ఏడూ చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుఆకులపై పరమాన్నం ఉంచి దేముడికి నైవేద్యంగా పెట్టేవారు

రథసప్తమి ప్రాధాన్యత :
కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే సర్వప్రాణులను సంహరిస్తుంది. లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది, సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది. అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.
విత్తు మొలకెత్తటానికి, మొక్క చిగురించటానికి, చిగురించిన మొక్క మొగ్గ తొడగటానికి, మొగ్గ పుష్పంలా వికసించటానికి, పువ్వు కాయగా మారటానికి, కాయ పండుగా మారటానికి, కాలమే కారణం.

మా + అఘ = పాపం లేనిది.

పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ మాసాన్ని (మాఖ)మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైనా, ఈ రథసప్తమి నుండి ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం అనే గ్రహణం నుండి సూర్యుడు విముక్తుడై ఈ రథసప్తమి నుండి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కనుక ఈ రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృతర్పణాలు, దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలనే నియమాన్ని పెద్దలు నిర్ణయించారు. ఉత్తరాయణం, మాఘమాసం, రథసప్తమి మానవుణ్ణి ఉన్నతజ్ఞాన మార్గంలో ప్రయాణింపజేసి భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి ప్రాత్రుణ్ణి చేస్తాయి.
వ్రతకథ :
ఈ వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజుండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునికి ఎప్పుడును రోగములు వచ్చెడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. "నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీ కడుపున పుట్టెను. లోభియగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని తెలిపిరి. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రత మాచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను.

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్


Related Postings :
> Arasavilli Sri Suryanarayana Temple Information
> Famous Temples in Andhrapradesh
> Famous Temples In East Godavari District
> Free Download in Ebooks


Rathasaptami History in Telugu, Rathasaptami Information, Temples Timings, Best Temples Information in Hindu temples guide, Temples Accommodation Details, Meaning in Radhasaptami, hindu temples guide.com

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు