Drop Down Menus

Jamalapuram Venkateswara Swamy Temple in Khammam | History Timings


భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అనేక చోట్ల వెలిశాడని అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి సాక్షాత్తూ వైకుంఠం నుంచి దిగివచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ సతీ సమేతంగా కొలువయ్యాడంటారు. ఆయనే ఖమ్మం జిల్లా జమలాపురంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు.
Famous Temple and Famous Pilgrimage in Telangana Kammam District One of the very famous Venkateswara Swamy temple located in Jamalapuram-Kammam District-Telangana.

Temple History:
శ్రీరాముడి గురువైన జాబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం వచ్చారట. ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఈ చోటు నచ్చడంతో ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని, గురుకులాన్నీ స్థాపించారట. ఇక్కడి సూచిగిరి కొండపై ఆయన తపస్సు చేసేవారు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు సూచిగిరిపై శ్రీవేంకటేశ్వర అవతారంలో స్వయంభూగా వెలశాడట. తరువాత చాన్నాళ్లకు నెల్లూరు ప్రాంతానికి చెందిన యజ్ఞనారాయణశర్మ అనే బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ ఆయనకు ఒక తెలియని అనుభూతి కలిగిందట. తన కలల్లో కనిపిస్తూ ఉండే చెట్లూ, కొండలూ ఇవేనని ఆయన గుర్తుపట్టాడు. ఈ చోటుతో తనకేదో అనుబంధం ఉందని భావించిన ఆయన కొన్నాళ్లు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారట. అక్కడి కొండమీద స్వామివారు బాలుడి రూపంలో వచ్చి పశువుల కాపరులైన బాలలతో ఆడుతుండేవారట. నీదేవూరు అంటే, నీవూరే నావూరు అనీ... ఏం పేరు అంటే నీ పేరే నాపేరు అనీ చెబుతుండేవారట. ఈ బాలుడి గురించి విన్న యజ్ఞనారాయణ శర్మ కొండపైకి వెళ్లారు. అక్కడే జాబాలి మహర్షి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం, శిలా శాసనం కనిపించాయట. దీంతో ఇక్కడే స్థిరపడి రోజూ కొండపైకి వెళ్లి పూజలు చేసేవారు. స్వామివారి మహిమల గురించి తెలుసుకున్న భక్తులు కొండకు వెళ్లడం మొదలు పెట్టారు.


తానే కదలివచ్చె...
ఒక రోజు కొండమీదకి స్వామిని అర్చించటానికి వెళ్తున్న అక్కుభట్టు కాలికి మొన తేలిన గులక రాయి గుచ్చుకున్నది.  ఆయన బాధ తట్టుకోలేక,  “శ్రీనివాసా” అని భగవంతుణ్ణి తలచుకుంటూ కింద పడిపోయాడు.  అదృష్టవశాత్తూ భగవంతుని కోసం తీసుకెళ్తున్న నివేదన నేలపాలు కాలేదు.  సన్నిధి చేరటానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి.  అక్కుభట్టుకి అంత దూరం వెళ్ళే శక్తి లేదనిపించింది.  ఏమి చెయ్యాలో తోచని ఆయన భగవంతుడు సర్వాంతర్యామి.  అలాంటి ఆయనకు తాను నైవేద్యం ఇక్కడనుంచి సమర్పించినా స్వీకరిస్తాడు.  ఆయనకి తన పరిస్ధితి తప్పక తెలుస్తుంది.  తన అపరాధాన్ని మన్నిస్తాడు అనే నమ్మకంతో పడిన చోటనే స్వామికి మానసిక పూజోపచారాలు చేసి, నైవేద్యం సమర్పించాడు.  తన తప్పుని మన్నించమని ప్రార్ధించాడు.  తర్వాత ఎలాగోలా ఇల్లు చేరాలని నెమ్మదిగా అడుగులు వేసిన అక్కుభట్టుకి “నేను నీతోనే వస్తున్నా. వెనుతిరిగి చూడకుండా వెళ్ళు” అన్న కంఠంస్వరం వినిపించింది.  సదా స్వామినే ధ్యానించే అక్కుభట్టు అది వెంకటేశ్వరస్వామివారి ఆజ్ఞగా భావించి వస్తూ, ప్రస్తుతం ఆలయం వున్న కొండమీదకి రాగానే బ్రహ్మాండమైన శబ్దము వినిపించింది.  దానికి అక్కుభట్టు వెనుతిరిగి చూశాడు.  ఆయనకి ఆ గుట్టపై ఒక కాలు మోపి, పక్కనే సాలగ్రామరూపంతో నిరాకారంగా, నామాలతో వెంకటేశ్వరస్వామివారు కనిపించారు.  ఆ దర్శనానికి తన జన్మ ధన్యమయినదని భావించి అక్కుభట్టు తాదాత్మ్యంతో అన్నీ మరచి స్వామివారి శిలారూపాన్ని కౌగిలించుకుని తన్మయావస్ధలో అలాగే వుండిపోయాడు.

ఇక్కడి స్వామి ఆరోగ్య ప్రదాత, విద్యా ప్రదాత అని నమ్మకం. అందుకే పాడి పంటల్లో ఆయనకు మొదట భాగం ఇస్తారు. ఇక్కడి ప్రజలకు స్వామిమీద ఎంత విశ్వాసంమంటే, తమ పొలాలలో పంటలో, తన తోటల్లో కాసిన కాపులో, ఇలా ప్రతిదానిలో స్వామికి ముందు కొంత సమర్పిస్తారు.  వాటిని స్వీకరించటానికి విడిగా కౌంటర్ వున్నదంటే, స్వామిపై వారి భక్తి విశ్వాసాలు ఎంత వున్నాయో ఆలోచించండి.

How To Reach:
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వున్న జమలాపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి.  జమలాపురం విజయవాడ నుంచి 60 కి.మీ., ఖమ్మం నుంచి 80 కి.మీ. దూరం ఉంటుంది. భద్రాచలం-విజయవాడ రాష్ట్ర రహదారిలోని మైలవరం నుంచైతే 20 కి.మీ. వెళ్లాలి. మధిర, విజయవాడ, ఇబ్రహీంపట్నం, తిరువూరు డిపోల నుంచి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ-సికింద్రాబాద్‌ రైలు మార్గంలో ఎర్రుపాలెం స్టేషన్‌లో దిగి ఇక్కడికి చేరుకోవచ్చు.

Temple Address:
Telangana
Khammam District
Errupalem (Mandal)
Jamalapuram.

Temple Timings:
6.am to 9.p.m

Related Postings:

> Bhadrachalam Temple Information in Telugu

> Sri Raja Rajeswari Temple Information in Telugu

> Chilkur Balaji Temple History in Telugu

> Yadagiri Lakshmi Narasimha  Temple History

> Kondagattu Anjanna Temple Information

> Basara Saraswathi Temple History in Telugu

> Vijayawada Temple Information in Telugu

Jamalapuram temple information in telugu, khammam jamalapuram temple history in telugu, khammam, jamalapuram, jamalapuram venkateswara swamy temple, jamalapuram temple timings, jamalapuram temples, sri venkateswara swamy temple jamalapuram, sri venkateswara swamy temple jamalapuram, jamalapuram tourist place, hindu temple guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments