Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Pavitra Vrukshalu PDF Telugu Ebook Free Download

అడవులలో చెట్లచేమల మధ్య మానవుడు సుమారు పదివేల సంవత్సరాలు జీవించినాడు. మానవజాతి సంస్కృతి అక్కడనే పుట్టి పిరిగింది. పవిత్రమైన వేదములలోను, ఉపనిషత్తులలోను, పురాణాలలోను వృక్షముల ప్రాముఖ్యతను గూర్చి చెప్పబడినది. చెట్లు , జంతుజాలము మానవుడు లేకున్నను జీవించగలవు కానీ చెట్లులేకున్న జంతుజాలము, మానవుడు  క్షణమైన బ్రతుకలేరు. అందుకే మానవుడు చెట్లను దేవతలుగా పూజిస్తున్నాడు. రావి, తులసి, మారేడు, జమ్మి మున్నగు వృక్షాలను పవిత్ర వృక్షాలుగా పూజిస్తున్నాడు.
శ్రీ ఎల్లప్పరెడ్డి I.F.S., కన్సర్వేటరుగారు ఎన్నియో గ్రంథాలను పరిశోధించి తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఎంతో భక్తి, శ్రద్దలతో ఆంగ్లములో "Sacred Plants" అను గ్రంథాన్ని తయారు చేసినారు. ఏవి ప్రవిత్ర వృక్షాలు ? ఏ ఏ వ్రతాలలో ఏఏ పత్రాలు, పుష్పాలు వాడుతారు? మన పురాణాలలో ప్రస్తుతించిన శివపంచాయతనవనము, అశోకవనము, నవగ్రహవనము, రాశివనము, నక్షత్రవనము మున్నగు వనాలలో ఏఏ జాతి చెట్లను ఏ విధంగా నాటాలి? వాటివల్ల మానవుడు ఏఏ ఉపయోగాలున్నవి ? మున్నగు విషయాలను విపులంగా చర్చించి ఎన్నియో తెలియని విషయములను అందరికి చక్కగా అర్థమైయే విధంగా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకమును మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్నారు. 

మరిన్ని మంచి పుస్తకముల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి:
Related Postings:


Pavitra vrukshalu ebook free download, pavitra vrushalu telugu pdf free download, good trees telugu ebook download, Telugu pdf books, telugu devotional pdf books, hindu temples guide.

Comments

Popular Posts