సౌత్ ఇండియన్స్ ఫేమస్ శివ టెంపుల్స్ ఇన్ ఇండియా ..
VIRUPAKSHA TEMPLE HAMPI KARNATAKA
విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో ఉంది. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది. విరూపాక్ష అనగా శివుని రూపం. హంపి వీధికి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉంది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయంలో ప్రధాన దైవం విరూపాక్షుడు (శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్దం నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉంది.
MEENAKSHI TEMPLE MADURAI TAMIL NADU
మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది.
VENKATESWARA TEMPLE TIRUPATI CHITTOOR AP
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.
RAMANATHASWAMY TEMPLE RAMESWARAM TAMIL NADU
రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయ ముఖ్య విగ్రహాలు జఫాన రాజ్యానికి చెందిన జయవీర చింకైరియన్ మరియు ఆయన తర్వాత వారైన గుణవీర చింకైయన్ లచే పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్తంభం అని అర్థం.
AIRAVATESVARA TEMPLE KUMBAKONAM TAMIL NADU
ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మరియు చోళపురం లోని గంగైకొండ చోళీశ్వర దేవాలయాలతోపాటు గుర్తించబడింది. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు.
BRIHADEESWARAR TEMPLE TANJAVUR TAMIL NADU
బృహదీశ్వర ఆలయం పెరువుదైయార్ కోయిల్ బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
VITTALA TEMPLE HAMPI BALLARI KARNATAKA INDIA
ఈ నగరం 13-15 శతాబ్దముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య పు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా లోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. ఈ పురాతన నగరములో ప్రసిద్ధమైన విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామము. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు. హంపి బెంగళూరు నుండి 343కి.మీ. దూరంలో, బీజాపుర నుండి 254కి.మీ.బళ్ళారి నుండి 74కి.మీ. దూరంలో బళ్ళారి జిల్లాలో ఉంది. హంపి దగ్గరలో ఉన్న తాలుకా హొసపేటె 13 కి.మి దూరంలో ఉంది.
SRI RANGANATHAR SWAMY TEMPLE SRIRANGAM TAMIL NADU
శ్రీరంగనాథస్వామి ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు. ఈ గ్రంధంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో పురాతనమైన, ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.
AIHOLE and PATTADAKAL TEMPLE KARNATAKA INDIA
These capital cities of Chalukyas are exclusively famous for their beautiful temples in Karnataka. These South Indian temples date back to 5th century CE, very elaborate in their architecture and grandeur. Aihole is also called the “cradle of Hindu Rock Architecture”. Aihoe is a village having a historic temple complex in the Bagalkot district of Karnataka, India ..... Jain cave temple is at the entrance of the Aihole (from Pattadakal/Badami) on the banks of Mallaprabha river; it is similar to Ravana Phadi cave.
THANUMALAYAN TEMPLE KANNAIKUMARI SUCHINDRAM TAMIL NADU
Suchindram is a panchayat town in Kanniyakumari district in the Indian state of Tamil Nadu with Indian postal code as 629704. It is an important pilgrim centre and the site of the famous Thanumalayan Temple.Suchindram is located at . It has an average elevation of 19 metres (62 feet). Suchindram Suchindram is a temple town situated in the southernmost district of Kanyakumari in Tamil Nadu State, India.
Related Postings:
> Tirumala Complete Information in Telugu
> Arunachalam Complete Information in Telugu
> 18Sakthi Peethams Information
> Telugu Devotional Ebooks Free Download
> Karnataka Famous Temples List
> Tamil Nadu Famous Temples List
> Srikalulam District Famous Temples List
famous shiva temples in india, top famous shiva temples india, famous temples south indai shiva temples, top ten shiva temples india, oldest shiva temple in india, famous shiva temples in tamilnadu, lord shiva temple in sea, murudeshwara temple, murudeshwara, shiva temples, list of india hindu temples, lord shiva temple in taj mahal, lord shiva temples in telangana. hindu temples guide.com
Comments
Post a Comment