Drop Down Menus

What's the reason for leaving any of his favorite things when traveling to Kashi? | Varanasi Travel Guide

కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన  ఏదైనా పదార్థం వదిలివేయడానికి కారణమేమిటి?
మన ఈ శరీరాలు, ఇంద్రియాలు, అవయవాలు, బుద్ధి, మనసు, ఇలా అన్నీ అ పరమాత్మ ఇచ్చినవే. భగవంతుడు ఇచ్చిన వానితో ఆయన సేవనే చేయాలి. మన నాలుకతో స్వామి నామకీర్తన చేయాలి. 
మనసుతో ధ్యానం, చేతులతో భగవంతునికి పూజ చేయాలి. చెవులతో ఆయన కథలనే వినాలి. కన్నులు ఆ స్వామిని, స్వామి భక్తులనే చూడాలి. కాళ్లు దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు ,యాత్రలకు ,భక్తుల ఇళ్లకు వెళ్లాలి. 
నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి. మన మాట్లాడే  ప్రతి నాలుగు మాటలలో ఒక మాట భగవాడ్ని గురించి  కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే! కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే సకల భోగాలకు ఇష్టంగ మారిపోయాయి . మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. 
ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే రోగాలు ,అంటువ్యాధులు,అనేక శారీరక ఇబ్బందులు  కలుగుతాయి. భగవంతుని వదిలి ఇష్టాలను పట్టుకుని కష్టాల పాలుకాకుండా భగవంతుని కోసం మన శరీరానికిష్టమయ్యే వాటిని వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి. 
ఇలా ఒక్కసారే అన్నీ వదలటం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూపోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుని విడిస్తే సంసారం.. భ‌గ‌వంతుడి కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం, లభిస్తాయి! 
అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూపోతే చివరికి ఆశ లేకుండా పోతుంది. 
ఇదీ ఇందులోని అంతరార్థం. కోరికలకు దాసుడివి కాకు! కోరికలను దాసులను చేసుకో! ఇవీ బోధ!

Related Postings
1.Dharmasandehalu
2.Varanasi

keywords:
కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదేని కాయగూరగానీ,ఫలముగానీ, ఏదైనా పదార్థంగానీ వదిలివేయడానికి కారణమేమిటి?,కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన ఏదైనా పదార్థం వదిలివేయడానికి కారణమేమిటి?,What is the reason for leaving his favorite food, fruit, fruit, or anything that goes to Kashi ?,Kashi,Kasi,Varanasi,History in Varansi,Lord Shiva Story,Lord Shiva ,కాశీకి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన  ఏదైనా పదార్థం వదిలివేయడానికి కారణమేమిటి?,varanasi travel experience,things not to do in varanasi,bad things about varanasi,do and don'ts in varanasi,varanasi travel blog,varanasi tourism,varanasi india points of interest,varanasi Temple,Kashi temple,varanasi temple timing,varanasi temple accoummandation
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.