Drop Down Menus

Why should you visit Varaha Swamy Before Venkateswara Swamy ? | Dharma Sandehalu

తిరుమలలో భక్తులు ముందుగా వరాహస్వామిని  ఎందుకు దర్శించుకోవాలి ?
‘‘మహావరాహో గోవిందః సుషేణాః కనకాంగది’’ ఆదివరాహమూర్తే గోవిందుడు. చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి. ఆయన భూమిపై అవతరించి దాదాపు  5000 సంవత్సరాలయింది. 
శ్రీవారు తిరుమలకి రావడానికి ముందే తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శ్రీనివాసుడు వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి కోరితే అందుకు వరాహస్వామి అంగీకరించి, అప్పటిలో వరాహస్వామి శ్రీనివాసుడికి శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఆ భూమిని  శ్రీనివాసుడు స్వీకరించి, దానికి బదులుగా వరాహస్వామికి ఒక హామీ ఇచ్చారు. తిరుమలపై తాను ఉండడానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతగా తన వద్దకు వచ్చే భక్తులకు తనకన్నా ముందే వరాహస్వామిని దర్శించుకుంటారని మాట ఇచ్చారు. 
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. 
ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. 
ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు.
కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి.ఆ తరువాతే తిరుమల క్షేత్రం వెంకటేశ్వరస్వామి నిలయం అయ్యింది. 
అందువల్లే, తిరుమలకి వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని, ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వరుణ్ని దర్శించుకోవాలి. అప్పుడే తిరుమల క్షేత్రం యొక్క యాత్రాఫలం వారికి దక్కుతుంది.

Related Postings:
1.Tirumala Alipiri Steps Information
2.Tirumala Near by Famous Temples List
3.Tirumala Complete Information
4.Suprabhata Seva Information
5.Tirumala Accommodation

Keywords:
తిరుమలలో భక్తులు ముందుగా వరాహస్వామిని  ఎందుకు దర్శించుకోవాలి ?వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని  ఎందుకు దర్శించుకోవాలి ? Why should you visit Varahaswamy before Venkateswara Swamy?,Why should devotees first visit the Thirumahaswamy in Thirumala?,Why should you visit Varahaswamy before the visit to Thirumala?
Tirumala Alipiri Steps Information,Tirumala Near by Famous Temples List,Tirumala Complete Information,Suprabhata Seva Information,Tirumala Accommodation,Tirumala,tirupati,tirupathi,Lord Balaji,Lord Venkateswara swamy,Dharamaandehalu,Dharma Sandehalu,Darmasandehalu
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.