Drop Down Menus

AP Grama Volunteers Online Application Demo Official Website Details

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కొరకు నోటిఫికేషన్ విదులచేసిన విషయం తెలిసినదే. సుమారు 4 లక్షల పైగా ఈ ఉద్యోగాలు ఉండబోతున్నాయి. సగం ఉద్యోగాలు మహిళకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. గ్రామా , పట్టణ , గిరిజన ప్రాంతాల లో వాలంటీర్ లకు ఉద్యోగ అర్హతల లో మార్పులు ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు. అర్హత ఉన్న అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేస్కోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. 

అప్లై చేసుకోవడానికి ఇప్పటికే చాల ఫేక్ వెబ్సైటు లు సృష్టించారు. మీరు ఏ వెబ్సైటు లో పడితే ఆ వెబ్సైటు లు మీ వివరాలు ఇస్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామా వాలంటీర్ లకు సంబందించి ప్రత్యేక వెబ్సైటు ను ప్రారంభించింది. 

వెబ్సైటు Grama Volunteer Official Website: http://gramavolunteer.ap.gov.in/ 
24వ తేదీ నుంచి ఆన్లైన్ లో అప్లై చేస్కోవచ్చు . ఆన్లైన్ విధానం మొత్తం 5 స్టెప్ లలో జరుగుతుంది . 

అర్హతలు : 
1) విద్యార్హతలు : 
గిరిజన ప్రాంతం లో  10వ తరగతి పూర్తీ చేసి ఉండాలి 
గ్రామీణ ప్రాంతం లో ఇంటర్ పూర్తీ చేసి ఉండాలి 
పట్టణ ప్రాంతం లో డిగ్రీ పూర్తీ చేసి ఉండాలి 
2) 30.6.2019 నాటికి 18-35 సంవత్సరాలు వయస్సు ఉండాలి
3) దరఖాస్తు దారుడు అదే పంచాయితీకి నివాసి అయ్యి ఉండాలి 
4) ఓసీ కానీ వారు కులధ్రువీకరణ దృవీకరణ అందించాలి 

ఆన్లైన్ లో అప్లికేషన్ పూర్తిచేసేటప్పుడు ముందుగా పైన తెలిపిన అర్హతలు ఉన్నట్టు అంగీకరిస్తూ బటన్ పై క్లిక్ చేయాలి 


స్టెప్ 1 : అర్హత ప్రమాణం 
ప్రాంతం , విద్యార్హత , పుట్టిన తేదీ సెలెక్ట్ చేస్కుని check పై క్లిక్ చేయండి . మీరు ఎలిజిబుల్ అయిన యెడల స్టెప్ 2 ప్రదర్శిత మౌతుంది . 

స్టెప్ 2 : వినియోగదారుని ప్రామాణీకరణ 
ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి"SEND OTP" పై క్లిక్ చేయండి . ఓటీపీ ఆధార్ కు లింక్ అయినా మొబైల్ నెంబర్ కు వస్తుంది.  మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ను ఎంటర్ చేసి "VERIFY OTP" బటన్ పై క్లిక్ చేయండి .  మీకు ఆధార్ నెంబర్ లేకపోయినా లేదా ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోకపోతే "ADHAR NOT AVAILABLE" పై క్లిక్ చేయాలి 
ఆ తరువాత మీ వివరాలు అనగా మీ పేరు , తండ్రి పేరు ,లింగం , పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి 

నోట్ : వాలంటీర్ కు ఆధార్ కార్డు తప్పనిసరి , ఆధార్ కార్డు లేని వాళ్ళు మొబైయిల్ నెంబర్ తో రిజిస్టర్ అవచ్చు కానీ 10 రోజుల్లో ఆధార్ కార్డు జతచేయాలి . 


స్టెప్ 3 :  ఫోటో ను అప్లోడ్ చేయడం
ఫోటో ను అప్లోడ్ చేయడం , ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు 150KB సైజు కు ఎక్కువ కాకుండా చూసుకోవాలి .  వ్యక్తిగత చిరునామాకు సంబందించిన ప్రూఫ్ ను జతచేయాలి , ఓటర్ కార్డు / రేషన్ కార్డు/ నివాస ధృవీకరణ పత్రం )  ఇక్కడ రేషన్ కార్డు అప్లోడ్ చేసేటప్పుడు ఫైల్ సైజు 1 ఎంబీ వరకు ఇచ్చారు .  మీరు కావాలంటే మీ సమాచారం ఎడిట్ చేస్కునే అవకాశం కూడా ఉంది 

స్టెప్ 4 : విద్యార్హత 
10th Class , Inter , Degree , P.G Certificates ను అప్లోడ్ చేయాలి . రిజిస్ట్రేషన్ నెంబర్ , ఉత్తీర్ణిత శాతం , వచ్చిన మార్కులు ఫిల్ చేయాలి . 

స్టెప్ 5 : సామాజిక వివరాలు 
ఓసీ క్యాస్ట్ ఐతే ఎటువంటి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయనక్కర్లేదు . ఇతర సామాజిక వర్గాలు వారు కుల ధ్రువీకరణ పాత్రలను అప్లోడ్ చేయాలి . 

ఇక్కడితో అప్లికేషన్ పూర్తీ అవి మీకు రిజిస్టర్ అయినట్టు మెసేజ్ వస్తుంది.

11 నుంచి ఇంటర్వ్యూలు.. 
ఆగస్టు 1న ఎంపికైన వారి జాబితా వెల్లడి
ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.
ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు.  
ఆగస్టు 5-10 తేదీల మధ్య శిక్షణ..
ఆగస్టు 15 నుంచి విధుల్లోకి
keywords : ap grama volunteer qualification, ap grama volunteer interview questions, ap grama volunteer exam , ap grama volunteer online application status , ap govt jobs, 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. A Premier Website for Latest Government and Private Sector Jobs, Recruitment, Vacancies and Sakori in Assam and North East India States. Northeast Jobs is a leading online career and recruitment source with a contemporary technology that provides relevant career to job seekers across industry.

    Arunachal Pradesh Job Portal
    Assam Career
    Manipur Job Portal
    Meghalaya Job Portal
    Mizoram Job Portal
    Nagaland Job Portal
    Sikkim Job Portal
    Tripura Job Portal
    North East Job

    ReplyDelete

Post a Comment