Drop Down Menus

Govinda Namalu In Telugu | శ్రీ గోవింద నామాలు | శ్రీ శ్రీనివాసా గోవిందా | శ్రీ వేంకటేశా గోవిందా |

శ్రీ శ్రీనివాసా గోవిందా |  శ్రీ వేంకటేశా గోవిందా |
భక్తవత్సల గోవిందా | భాగవతప్రియ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

నిత్యనిర్మలా గోవిందా | నీలమేఘశ్యామ గోవిందా |
పురాణపురుషా గోవిందా | పుండరీకాక్ష గోవిందా |

నందనందనా గోవిందా | నవనీతచోర గోవిందా |
పశుపాలక శ్రీ గోవిందా | పాపవిమోచన గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శిష్టపరిపాలక గోవిందా | కష్టనివారణ గోవిందా |
దుష్టసంహార గోవిందా | దురితనివారణ గోవిందా |

వజ్రమకుటధర గోవిందా | వరాహమూర్తివి గోవిందా |
గోపీజనప్రియ గోవిందా | గోవర్ధనోద్ధార గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

దశరథనందన గోవిందా | దశముఖమర్దన గోవిందా |
పక్షివాహన గోవిందా | పాండవప్రియ గోవిందా |

మత్స్యకూర్మా గోవిందా | మధుసూదనహరి గోవిందా |
వరాహనరసింహ గోవిందా | వామన భృగురామ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

బలరామానుజ గోవిందా | బౌద్ధకల్కిధర గోవిందా |
వేణుగానప్రియ గోవిందా | వేంకటరమణ గోవిందా |

సీతానాయక గోవిందా | శ్రితపరిపాలక గోవిందా |
దరిద్రజనపోషక గోవిందా | ధర్మసంస్థాపక గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

అనాథరక్షక గోవిందా | ఆపద్బాంధవ గోవిందా |
శరణాగతవత్సల గోవిందా | కరుణాసాగర గోవిందా |

కమలదళాక్ష గోవిందా | కామితఫలదాతా గోవిందా |
పాపవినాశక గోవిందా | పాహిమురారే గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శ్రీముద్రాంకిత గోవిందా | శ్రీవత్సాంకిత గోవిందా |
ధరణీనాయక గోవిందా | దినకరతేజా గోవిందా |

పద్మావతిప్రియ గోవిందా | ప్రసన్నమూర్తి గోవిందా |
అభయహస్తప్రదర్శక గోవిందా | మత్స్యావతార గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శంఖచక్రధర గోవిందా | శార్ఙ్గగదాధర గోవిందా |
విరజాతీర్థస్థ గోవిందా | విరోధిమర్దన గోవిందా |

సాలగ్రామధర గోవిందా | సహస్రనామా గోవిందా |
లక్ష్మీవల్లభ గోవిందా | లక్ష్మణాగ్రజ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

కస్తూరితిలక గోవిందా | కాంచనాంబరధర గోవిందా |
గరుడవాహన గోవిందా | గజరాజరక్షక గోవిందా |

వానరసేవిత గోవిందా | వారధిబంధన గోవిందా |
ఏడుకొండలవాడ గోవిందా | ఏకస్వరూపా గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

శ్రీ రామకృష్ణ గోవిందా | రఘుకులనందన గోవిందా |
ప్రత్యక్షదేవా గోవిందా | పరమదయాకర గోవిందా |

వజ్రకవచధర గోవిందా | వైజయంతిమాల గోవిందా |
వడ్డికాసులవాడ గోవిందా | వసుదేవతనయా గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

బిల్వపత్రార్చిత గోవిందా | భిక్షుకసంస్తుత గోవిందా |
స్త్రీపుంసరూపా గోవిందా | శివకేశవమూర్తి గోవిందా |

బ్రహ్మాండరూపా గోవిందా | భక్తరక్షక గోవిందా |
నిత్యకళ్యాణ గోవిందా | నీరజనాభ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

హాతీరామప్రియ గోవిందా | హరిసర్వోత్తమ గోవిందా |
జనార్దనమూర్తి గోవిందా | జగత్సాక్షిరూప గోవిందా |

అభిషేకప్రియ గోవిందా | ఆపన్నివారణ గోవిందా |
రత్నకిరీటా గోవిందా | రామానుజనుత గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

స్వయంప్రకాశక గోవిందా | ఆశ్రితపక్ష గోవిందా |
నిత్యశుభప్రద గోవిందా | నిఖిలలోకేశ గోవిందా |

ఆనందరూపా గోవిందా | ఆద్యంతరహితా గోవిందా |
ఇహపరదాయక గోవిందా | ఇభరాజరక్షక గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

పరమదయాళో గోవిందా | పద్మనాభహరి గోవిందా |
తిరుమలవాసా గోవిందా | తులసీవనమాల గోవిందా |

శేషాద్రినిలయా గోవిందా | శేషసాయినీ గోవిందా |
శ్రీనివాస శ్రీ గోవిందా | శ్రీవేంకటేశ గోవిందా |

గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |
గోవిందా హరి గోవిందా | గోకులనందన గోవిందా |

> శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments