తిరుమల వెళ్లేవారికి నా వంతుగా నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వదలిచాను. మీకు ఇవి ఉపయోగపడగలవు. తిరుమల అనగా కొండపైన , తిరుపతి అనగా కొండ క్రింద. మనం తిరుపతి బస్సు లో కానీ ట్రైన్ లో కానీ దిగినతరువాత కొండపైకి ఏ విధంగా చేరుకోవాలి ? దర్శనం ఏ విధంగా చేసుకోవాలి ? కొత్తగా తిరుమలలో వచ్చిన రూల్స్ ఏమిటి ? కొండపైనా దర్శనం అయినతరువాత ఏమేమి చూడాలి ? అదనపు లడ్డులు ఎక్కడ ఇస్తారు ? రూమ్స్ ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి ? బుక్ చేసుకోకుండా వెళ్తే అక్కడ రూమ్స్ ఎక్కడ ఇస్తారు ? తదితర వివరాలు వివరించబోతున్నాను .
విష్ణు నివాసం
తిరుమల చేరే భక్తుల కొరకు టీటీడీ వారు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం నిర్మించారు. బయట నుంచి చూసే భక్తుల కు పెద్ద హోటల్ లా కనిపిస్తుంది. మీరు అక్కడకు వెళ్లి ఫ్రెషప్ అవ్వవచ్చు . ఇక్కడ మీకు ఉచిత లాకర్ లు కూడా ఉంటాయి ఉదయం 6 గంటల నుంచి ఇస్తారు. మీరు ఎక్కువ లగేజి తో వస్తే కొండపైకి అన్ని అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు లాకర్ తీస్కుని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ రూమ్స్ కూడా ఇస్తారు. అప్పటికప్పుడు ఖాళీ అయినా రూమ్స్ ని ముందుగా ఎవరు వస్తే వారికి ఇస్తారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.
దర్శనం టోకెన్ లు
తిరుమలలో కొత్త రూల్స్ ప్రకారం భక్తులకు దర్శనం సులువుగా ఉండేలా టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టారు. మనం ఇంతక ముందు నేరుగా సర్వదర్శనమ్ లైన్ లో నిలబడే వాళ్ళం ఇప్పుడు ఆలా కాకుండా లైన్ లో ఎక్కువ సేపు నిలబడే సమయాన్ని తగ్గించడం కొరకు టోకెన్ పద్ధతి ప్రవేశ పెట్టారు. మీరు లైన్ లోకి ఏ సమయం లో వెళ్లాలో ఆ టోకెన్ పై ఉంటుంది. ఈ సర్వదర్శనం టోకెన్ లో విష్ణు నివాసం లో తిరుపతి బస్సు స్టాండ్ లో ఇస్తున్నారు. టోకెన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు లేని వారు నేరుగా సర్వదర్శనం లైన్ లో నిలబడవచు.
మెట్లమార్గం
కొండపైకి చేరడానికి చాల మెట్ల మార్గాలు ఉన్నాయని చెబుతున్న ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి . ఒకటి అలిపిరి మార్గం రెండు శ్రీవారి మెట్ల మార్గం . అలిపిరి మెట్లమార్గం ద్వారా వెళ్లాలంటే సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది . 15 కిమీ దూరం ఈ మార్గం లో మెట్లు .. మధ్యలో బస్సు మార్గం మరల మెట్లు ఆలా ఉంటుంది ఈ మార్గం . ఈ దారి లో వెళ్లేవారికి దారి పొడవునా చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయి. మోకాళ్ళ పర్వతం ఈ మార్గం లో వెళ్లే వారికి అందరికి బాగా గుర్తుంటుంది.
శ్రీవారి మెట్టు కొండపైకి చాల దగ్గర దారి 6 కిమీ లోపే ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల లోపు కొండపైకి చేరుకోవచ్చు. అలిపిరి శ్రీవారి మెట్టు చేరుకోవడానికి చాల బస్సు లు ఉంటాయి. ఉచిత బస్సు లు కూడా కలవు. రెండు చోట్ల లగేజి కౌంటర్ లు ఉంటాయి మీరు అక్కడ మీ బ్యాగ్ లను ఇస్తే కొండపైకి వెళ్లిన తరువాత మీరు అక్కడ మీ బ్యాగ్ లను తీసుకోవచ్చు .. మెట్లు ఎక్కడం పూర్తికాగానే అక్కడ కౌంటర్ లు ఉంటాయి. మెట్ల మార్గం మధ్య లోనే మీకు దర్శనమ్ టోకెన్ లు ఇస్తారు.
కొండపైకి వెళ్లిన తరువాత సమాచారం కొరకు
మీరు మొదటి సారి వెళ్తున్నవారైతే మీకు కావాల్సిన సమాచారం కొరకు ఎవరిని పడితే వారిని అడగకండి . దేవస్థానం వారు హెల్ప్ సెంటర్ లు ఏర్పాటు చేశారు అక్కడకు వెళ్లి అడగండి లేదా పోలీస్ వారిని లేదా అక్కడ పని చేస్తున్న వారిని అడగండి.
మొక్కు తీర్చుకొనుట
తిరుమల వచ్చే భక్తులు స్వామి వారికి భక్తి తో తలనీలాలు సమర్పిస్తారు. కొండపైన కల్యాణకట్టలు చాల చోట్ల ఏర్పాటు చేసారు . మీకు ఇచ్చే రూమ్స్ దగ్గర కూడా తలనీలాలు సమర్పించవచ్చు . అక్కడ వారిని అడిగితె మీకు దగ్గర్లో ఎక్కడ ఉందొ చెప్తారు.
స్వామి వారి దర్శనం ఎలా చేసుకోవాలి ?
స్థలపురాణం ప్రకారం తిరుమల లో స్వామి వారి కంటే ముందు వరాహ స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కు కుడి వైపు స్వామి వారిని పుష్కరిణి ఉంటుంది . ఆ కోనేరుకు ఆనుకునే వరాహస్వామి ఆలయం ఉంటుంది . ఆ ఆలయం కు దగ్గర్లోనే వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది.
ఎవరైనా తప్పిపోతే ?
స్వామి దర్శన సమయం లో అందరం కలిసి మనతో పాటు వచ్చినవారు ముందు వెనుక అవ్వడం సర్వసాధారణం . దర్శనం అయినతరువాత అందరు కోనేరు వైపుకే వస్తారు. మీరు ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడే ఉండి వారికోసం వెతకండి .. ముందుగానే వారికి ఆలయాన్ని చూపించి బయట ఎక్కడ ఉండాలో చెప్పండి. స్వామి వారి ఆలయం కు ఎదురుగ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది అక్కడ మరియు దర్శనం అయ్యాక లడ్డు వెళ్లే మార్గం తప్పిపోయిన వారికోసం మైక్ లో చెప్పాడని కేంద్రాలు ఏర్పాటు చేసారు.
అదనపు లడ్డులు
తిరుమల నుంచి రాగానే అందరు మనల్ని అడిగేది లడ్డు ప్రసాదం ఏది అని , భక్తుల కోరికపై ఇప్పుడు అదనపు లడ్డు కౌంటర్ లు ఎక్కువ ఏర్పాటు చేసారు . స్వామి వారి ఆలయం వెనుకాల లడ్డు కౌంటర్ ఉంటుంది. దర్శనం అయి బయటకు వచ్చిన తరువాత తెలియక పొతే అక్కడివారిని అడగండి. అదనపు లడ్డు 50 రూపాయలు . ఒక్కొక్కరికి 10 లడ్డులు వరకు ఇస్తారు. ముందుగా టోకెన్ తీస్కుని ఆ టోకెన్ ని లడ్డు కౌంటర్ లో చూపిస్తే అదనపు లడ్డులు ఇస్తారు,
కొండపైన ఏమేమి చూడాలి ?
కొండ పైన ప్రదానం గా చూడాల్సినవి శ్రీవారి పాదాలు , శీలా తోరణం , చక్రతీర్ధం , పాపవినాశనం , ఆకాశగంగా , వేణుగోపాల స్వామి ఆలయం , జాపాలి తీర్ధం అనగా ఆంజనేయస్వామి వారి ఆలయం . టీటీడీ మ్యూజియం . వీటిని చూడ్డానికి కొండపైన పాపవినాశనం కి వెళ్లే టీటీడీ వారి బస్సు లు ఉంటాయి . ముందు మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవాలి ప్రస్తుతం 45 రూపాయలు తీసుకుంటున్నారు . ముందుగా వాళ్ళు పాపవినాశనం దగ్గరకు తీసుకుని వెళ్తారు .. మీరు అక్కడ స్నానం చేసి వచ్చే క్రిందకి వెళ్లే ఏదైనా బస్సు ను మీరు ఎక్కి ఆకాశగంగా మరల వేణుగోపాల స్వామి , జపాలి తీర్ధం దగ్గర దిగుతూ ఒక్కోటి దర్శించి రావచ్చు . కాకపోతే ఈ బస్సు లు శ్రీవారి పాదాలు శీలా తోరణం చక్ర తీర్ధం దగ్గరకు వెళ్లవు. అవి చూడాలంటే మనం టాక్సీ , వ్యాన్ , జీప్ లా ద్వారా వెళ్ళాలి ప్రస్తుతం 120 నుంచి 150 వరకు ఒక్కొక్కరికి తీసుకుంటున్నారు.
మొదటి గడప దగ్గర నుంచి స్వామి వారిని దర్శించే సేవలు
సర్వదర్శనం కాలినడక వెళ్లే భక్తులు స్వామి వారిని దూరం నుంచి దర్శించుకుంటారు . సుప్రభాతం , తోమాల, నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన లాంటి సేవ లకు వెళ్లే వారు స్వామి వారిని మొదటి గడప దగ్గర వరకు వెళ్లి దర్శించుకోవచ్చు .టీటీడీ వారు ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు ఉదయం 10గంటలకు సేవ టికెట్స్ విడుదల చేస్తారు . ఇప్పుడు లక్కీ డిప్ ద్వారా ఆ సేవ టికెట్స్ ఇస్తున్నారు .
రూమ్స్ ?
మీరు తిరుమల 4 నుంచి 3 నెలల ముందు ప్లాన్ చేసుకుంటే రూమ్స్ సులువుగా టీటీడీ వారి వెబ్సైటు ద్వారా రూమ్స్ బుక్ చేస్కోవచ్చు . మీరు రూమ్స్ బుక్ చేసుకోకుండా వెళ్తే మీరు CRO ఆఫీస్ దగ్గరకు వెళ్తే అక్కడ కరెంటు బుకింగ్ ఉంటుంది. అప్పటికప్పుడు ఖాళీ అయినా రూమ్స్ ని ఇస్తారు . అక్కడ మీరు లైన్ లో నిలబడితే రూమ్స్ దొరుకుతాయి . CRO కి కుడివైపు పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ ఉంటుంది ఆ వెనుక మీకు లాకర్లు కూడా ఉంటాయి అక్కడే మీరు గుండు కూడా చేయించుకోవచ్చు . అంగప్రదక్షిణ టికెట్స్ కూడా CRO దగ్గర ఇస్తారు .
తిరుమల సమగ్రసమాచారం మీకు ఇక్కడ ఇవ్వబడింది . మీకు కావాల్సిన సమాచారం పైన క్లిక్ చేస్తే క్షణాలలో సమాచారం ఓపెన్ అవుతుంది . మీకు ఎంతగానో ఈ సమాచారం ఉపయోగపడగలదు . ఎంతశ్రమకోర్చి ఈ సమాచారం సేకరించమో మీకు చదివితే అర్ధమౌతుంది . మీరు షేర్ చేస్తే అందరికి ఈ సమాచారం ఉపయోగపడగలదు .
తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి : https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు : https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి : https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి : https://goo.gl/EddXiw
తిరుమల సేవలు వాటి ధరలు బుక్ చేస్కునే విధానం : https://goo.gl/1Mdeef
అంగప్రదిక్షణ వివరాలు : https://goo.gl/6dKzrm
తులాభారం ఎలా వెయ్యాలి : https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి : https://goo.gl/o2t5Eh
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు : https://goo.gl/JDqNq5
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి : https://goo.gl/UCvVjV
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? : https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా : https://goo.gl/4a3tVd
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి : https://goo.gl/TmNqgQ
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా : https://goo.gl/Gc5HNr
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి : https://goo.gl/FiYDnf
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది : https://goo.gl/4QGMXD
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం : https://goo.gl/q1ARrX
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? : https://goo.gl/dL4oB7
కొత్త జంటకు శుభవార్త : https://goo.gl/BT2KXA
తిరుమల సమగ్ర సమాచారం : https://goo.gl/s3FkjC
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి : https://goo.gl/kxtS8y
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి : https://goo.gl/pEVK2R
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు : https://goo.gl/32t1kA
తిరుమల వెళ్లేవారికి నా సలహా : https://goo.gl/PkSPou
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు : https://goo.gl/ZKa956
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం : https://goo.gl/RcYHMN
ఏడూ కొండల పరమార్ధం ఏమిటి : https://goo.gl/igEbZq
తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు : https://goo.gl/fKvyjo
గోవింద రాజుల ఆలయ చరిత్ర : https://goo.gl/eWWVeM
మీకు కావాల్సిన సమాచారం కొరకు కామెంట్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
What is the account number through which money can be transfered on line amd the amount thus transferef will be towards sree vari Hundi collection.
ReplyDeleteThank you.