Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Famous Temples In Manipur State | Hindu Temple Guide

మణిపూర్ భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. మణిపూర్‌లో మెయితీ తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష మెయితీ భాష. దీనినే మెయితిలాన్ అనీ, మణిపురీ అనీ అంటారు. 1992లో దీనిని జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించారు, మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) "నియంత్రిత ప్రాంత అనుమతి" కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు.

మణిపూర్ ప్రసిద్ధ దేవాలయాలు

బిష్ణుపూర్ - విష్ణుమూర్తి ఆలయం
ఇంఫాల్ - గోవిందజీ ఆలయం
ఇంఫాల్ - కృష్ణ దేవాలయం
ఇంఫాల్ - హనుమాన్ , మహాబలి దేవాలయం
రాధాకిషోర్ పూర్ - రాధాకృష్ణస్వామి ఆలయం
ఇంఫాల్ - వనదేవతా ఆలయం 

Comments