Famous Temples in Punjab State | Hindu Temple Guide
పంజాబ్ భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. 'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది. భారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రథమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉంది. పంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు. భారతదేశంలో హిందువులు మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది.
పంజాబ్ ప్రసిద్ధ దేవాలయాలు
అమృత్ సర్ - స్వర్ణ దేవాలయం
అమృత్ సర్ - దుర్గియానా ఆలయం
హోశియార్ పూర్ - దసూహ
భటిండా - తల్వండిసాంబో
బరూలా - అచలేశ్వర ఆలయము
పంజాబ్ - రామతీర్థం
జలంధర్ - శివమందిరం
జ్వాలాముఖి - విద్యేశ్వరీదేవి
ఆనంద్ పూర్ సాహెబ్
తారన్ తరన్
చాపార్ - గోగా ఆలయం
పఠాన్ కోట్ - ధమ్ తార్ ఆలయం
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Comments
Post a Comment