Drop Down Menus

Famous Temples In Jammu and Kashmir State | Hindu Temple Guide

జమ్మూ కాశ్మీరు రాష్ట్రం భారతదేశంలో ఉత్తరపుకొనన, హిమాలయ పర్వతసానువుల్లో ఒదిగిఉన్న రాష్ట్రం. దీనికి ఉత్తరాన, తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమున్నది. జమ్ము ప్రాంతం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా 'జమ్ము'యే. జమ్ము నగరం మందిరాల నగరంగా ప్రసిద్ధం. కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి శ్రీనగర్ ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. లడఖ్: ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు.లే" ఇక్కడి ప్రధాన పట్టణం. కాని జమ్ము-కాశ్మీరు మూడు ప్రాంతాలలోనూ హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ మతస్తులు విస్తరించి ఉన్నారు. కాశ్మీరును "భూతల స్వర్గం" అని అంటారు. 17వ శతాబ్దంలో ముఘల్ చక్రవర్తి షాజహాన్ దాల్ సరస్సు పైన పడవటింట్లోంచి చూస్తూ అక్కడి సౌందర్యానికి ముగ్ధుడై భూమిమీద స్వర్గం ఎక్కడైనా ఉంటే అది ఇక్కడే, ఇక్కడే అన్నాడు. కాశ్మీరులో ముఘల్ ఉద్యానవనాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తాయి. ముఘల్‌ఉద్యానవనాలు, శ్రీనగర్, గుల్‌మార్గ్, పహల్‌గాఁవ్ - ఇవి కాశ్మీరులో ముఖ్యమైన పర్యాటక స్థలాలు. భారతదేశంలో పర్యాటకులకు కాశ్మీరు అన్నింటికంటే ప్రధానగమ్యంగా ఉండేది. 

జమ్మూ కాశ్మీర్ ప్రసిద్ధ దేవాలయాలు

అమర్ నాథ్ - అమర్ నాథ్ గుహాలయము
కాట్రా - శ్రీ వైష్ణోదేవి ఆలయం
మార్తాండ్ - సూర్య దేవాలయం
భాగేశ్వరి - భద్రకాళి ఆలయం
జమ్మూ - రఘునాథ మందిరం
జమ్మూ - శ్రీ రామవీరేశ్వర ఆలయం
జమ్మూ - మనసార్ సరస్సు
బారాముల్లా - మహారాణి శివాలయం
జమ్మూ - రక్షస్థల్ సరస్సు
అవంతిపురం - శివ అవంతీశ్వర , అవంతిస్వామి
పూల్వామా - అనేక దేవాలయాలు
స్పిటక్ గుహ - కాళికాదేవి ఆలయం
పురమండల్ - శివాలయం
తుళుముల - ఖీర్ భవాని దేవాలయం
ఆల్చి - ఆల్చి పురాతన మఠం
వేరినాగ్ - నాగేశ్వర మందిరం
శుద్దమహాదేవ్ - శుద్ధ మహాదేవ్ ఆలయం
కాట్రా - బాణగంగ
అనంతనాగ్ - ఆదిశేషుని ఆలయం
భదోర్ నాహ - బాసుకీనాథ్ ఆలయం
శ్రీనగర్ - జ్యేష్టేశ్వరాలయం
రాజ్ పురామండి - బుడా అమర్ నాథ్ 

FAMOUS TEMPLES
KEYWORD

 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments