Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Mavullamma Temple History in Telugu Bhimavaram | Timings, Images, West Godavari

మావుళ్ళమ్మ దేవస్థానం, భీమవరం
భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు. ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యడు పాలించాడు. భీమ చాళుక్యడు పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఇతడు క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు. భీమవరం పట్టణంలో గునుపూడి ఒక ప్రాంతము. ఇచ్చట శ్రీ సోమేశ్వర దేవాలయం ను దర్శించగలం. ఇది పంచారామాల లో ఒకటిగా ప్రతీతి. గునుపూడి శ్రీ సోమేశ్వర దేవాలయంకి పశ్చిమ దిశగా సుమారు ఒక కీ.మీ దూరన శ్రీ మావుళ్ళమ్మ గుడి ఉంది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామ దేవత. భీమవరం నగర నడిబొడ్డున కొలువు తీరిన శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం యొక్క సంవత్సర ఆదాయం సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా ఉంటుంది అని చెప్పుచుంటారు. దేవస్థానం వారు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుతారు. ప్రతి నిత్యం భక్తులుకు అన్నదానం జరుపుతారు.

ఆలయం చాల ప్రాచీనమైనది. 1910 లో వచ్చిన వరదలలో విగ్రహం పాక్షికంగా దెబ్బతినటంతో నూతనగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కరుణారసమూర్తి. అమ్మవారి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది.

చారిత్రక నేపథ్యం
చారిత్రక నేపథ్యాన్ని అనుసరించి మావుళ్ళమ్మ వారి చరిత్రవిశేషాలు ఈ విధంగా ఉన్నాయి.1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. అటునుండి వారు అక్కడ ఒక పాక వేసి అమ్మవారిని అక్కడ నిలిపిఉంచారు. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో 'మామిళ్ళమ్మ'గా తదనంతరం 'మావుళ్ళమ్మ'గా పిలవటం అలవాటయ్యింది. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. అప్పన్న, మంచిరాజులు ఉన్న మోటుపల్లివారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడి మధ్యకు తీసుకొచ్చారు. అమ్మవారికి జాతర, ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు. మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవాడు. అందువలన రజక సంఘం ఆద్వర్యంలో ఒకసారి పండ్ల, పూల, వర్తక సంఘము వారి ఆద్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.

పూజలు, ఉత్సవాలు
ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు .జ్యేష్ట మాసంలో నెల రోజులు పాటు గ్రామ జాతర గరగ ఉత్సవాలు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్బముగా అమ్మవారిని రోజుకొక్క అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు అర్చనలు, లక్ష కుంకుమార్చనలు, చండీ హోమం మరియు ఇతర పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి ఉత్సవాలు 40 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలు సందర్భంగా బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, భజనలు, సంగీత కఛేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరికథలు, ఏకపాత్రాభ్నయాలు మొదలగు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి ఎనిమిది రోజులలో అమ్మవారిని అష్ట లక్ష్మీలుగా అలంకరించి సేవించుతారు. చివరిరోజున వేలాది మందికి మహా అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

రాజమండ్రి – విజయవాడ మెయిన్ రైలు మార్గములో నిడదవోలు జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. నిడదవోలు నుంచి నర్సాపురం కు గల బ్రాంచి రైలు మార్గములో “భీమవరం జంక్షన్” అను రైల్వే స్టేషన్ వస్తుంది. భీమవరం జంక్షన్ కు కొంత ముందుగా భీమవరం రైల్వే క్యాబిన్ (నిడదవోలు వైపు) ఉంటుంది. భీమవరం రైల్వే క్యాబిన్ నుంచి భీమవరం టౌన్ మీదగా గుడివాడ రైల్వే జంక్షన్ కు మరో బ్రాంచి రైలు మార్గము కూడ ఉంటుంది.

నిడదవోలు – నర్సాపురం బ్రాంచి రైలు మార్గము మరియు నిడదవోలు – గుడివాడ బ్రాంచి రైలు మార్గములు భీమవరం రైల్వే క్యాబిన్ నుంచి విడిపోతాయి.

పశ్చిమ గోదావరి జిల్లా లోని అన్ని ముఖ్య ప్రాంతములు నుంచి భీమవరం కు బస్సులు ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి నుంచి కూడ ఎక్కువ బస్సులు కలవు. రాష్ట్రం లోని అన్ని ముఖ్య ప్రాంతములు నుంచి భీమవరం కు బస్సులు దొరుకుతాయి. భీమవరంలో మంచి వసతులున్నాయి

              

Bhimavaram mavullamma temple history telugu, mavulamma temple accommodation details, bhivaram temples list, west godavari temples, mavullamma temple bhimavaram wiki, bhimavaram mavullamma temple timings, bhimavaram mavullamma jatara 2019, bhimavaram mavullamma temple phone number, bhimavaram mavullamma charitra, sri mavullamma vari temple, bhimavaram mavullamma mp3 songs, bhimavaram mavullamma thalli mp3 songs, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు