Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Malyadri Lakshmi Narasimha Swamy Temple History in Telugu - Malakonda, Timings.

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహ స్వామివారి ఆలయం
రాష్ట్రంలోని సుప్రసిద్ద నారసింహ క్షేత్రాలల్లో మాల్యాద్రి ఒకటి. దీనినే మాలకొండ అనికూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా, దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామం ప్రక్కనే సుమారు 413 ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఉంది మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. పెద్ద పెద్ద బండలు, కొండలు, గుహలు రకరకాల పండ్ల చెట్లు, పరిమళ పుష్ప వృక్షాలు, రకరకాల అడవి జంతువులు, కోనేరులు... ఇలాంటి అపురూప ప్రకృతి సంపదకు నిలయం ఈ ప్రాంతం.

స్థలపురాణం : 
పూర్వం శ్రీమహావిష్ణువు భూలోక విహారం చేయానుకున్నాడట తాను విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి, ఒక పూమాల ఇచ్చి పంపించాడట. గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక, మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ కొండపై పూలమాల ఉంచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది.
ఆ తరువాత కాలంలో శ్రీహరి అనుగ్రహం కోసం అగస్త్య మహాముని కఠోర తపస్సు చేశాడు. అప్పుడు స్వామి జ్యాలారూపంలో ప్రత్యక్షమయ్యాడు. భూలోకవాసుల పాప ప్రక్షాళన కోసం స్వామిని మాలకొండలో శాశ్వతంగా ఉండి పోవాలని కోరాడు. అయితే దేవతలు, రుషులు దర్శనార్థం వారంలో ఆరురోజులు, మానవుల పూజలకోసం శనివారం కేటాయింలచాని కోరాడు. అందుకు స్వామి సమ్మతించి ఇక్కడ విగ్రహరూపం దాల్చాడట.

1657లో ఈ ఆలయానికి ముఖమండపం, ఇందులో శివాలయం నిర్మించారు. 1769లో మాలకొండ పర్వతానికి ప్రాకారం కట్టారు.
ఆ ఆరురోజులు … ఒక్క శనివారం తప్పమిగిలిన రోజులలో ఎవ్వరూ స్వామివారి ఆలయం దరిదాపులకు కూడా వెళ్లడానికి సాహసించరు. మిగతా ఆరు రోజుల్లో దేవతలు, రుషులు స్వామి దర్శనంకోసం వచ్చి, తమ నృత్య గీతాలతో ఆయన్ను సేవిస్తుంటారని భక్తుల నమ్మకం. ఆలయ అర్చకులు, సిబ్బంది శుక్రవారం రాత్రి మాలకొండకు చేరుకుంటారు. శనివారం ఉదయం ఆలయం తలుపు తీసి పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఆలయం తలుపులు మూసేసి వెళ్లి పోతారు. ఆదివారం ఉదయం నాటికి ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది.
శనివారం మాలకొండ క్షేత్రం వేలాదిమంది భక్తులతో నిండిపోతుంది. యాదగిరిని తలపిస్తుంది స్వామివారి ఆలయాన్ని వారం రోజులు తెరవాలని కొంతమంది చేసిన ప్రయత్నంలో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత ఎవ్వరూ ఆ పని చేయలేదు. ఈ క్షేత్రంలో సంతాన వృక్షాలకు ఉయ్యాలను కడితే సత్సాంతానం కలుగుతుందని మహిళల విశ్యాసం.
ఇంద్రుని భార్య శచీదేవి ఒకప్పుడు జ్యేష్టమాసంలో ఆవునెయ్యితో ఈ క్షేత్రంలో దీపారాధన చేసి, నియమ నిష్టలతోల క్ష్మీనరసింహుణ్ధి ఆరాధించిందట. ఫలితంగా ఆమెకు సంతానం కలిగిందని ఒక కథనం. అలాగే సొంత ఇళ్లు కట్టానుకునే భక్తులు ఈ క్షేత్రంలో రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తారు. అలా పేర్చిన రాళ్ళు నిలబడితే తమ సొంతింటి కల నెరవేరుతుందని వారి విశ్యాసం. ఈ క్షేత్రంలో శివుడు, పార్వతీ దేవి, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఒకపక్క ప్రకృతి సుందర దృశ్యాలు మరోపక్క కోర్కెలు తీర్చి అభయమిచ్చే నారసింహుడు, భక్తులను మాల్యాద్రికి పదే పదే రప్పిస్తుంటాయి.

ప్రతి సంవత్సరం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహస్వామి జయంత్సోవం సందర్భంగా వేడుకలను అత్యంత వైభవంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తారు. పురాతన మరియు పవిత్ర పుణ్య క్షేత్రమైన మాలకొండలో వెలిసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ఆరు నృసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణానికి నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్య క్షేత్రం వెలసి యున్నది. లక్ష్మీదేవి సమేతుడైన నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా, భక్తుల కోర్కెలు తీర్చే వరాల నరసింహస్వామిగా పేరు గాంచాడు.

ఈ ఆలయం ప్రతి శనివారం మాత్రమే తెరువబడును. ఉదయం గం|| 6.00 ల నుండి సాయంత్రం గం|| 5.00 వరకు

రవాణా సౌకర్యం: 
విజయవాడ - చెన్నై ప్రధాన రైలు మార్గంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడినుండి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కందుకూరుకు వెళ్లాలి. కందుకూరు నుంచి ప్రతి శనివారం మాలకొండకు బస్సులుంటాయి. (కందుకూరుకు ఒంగోలు మరియు విజయవాడ నుండి బస్సు సౌకర్యం కలదు) ఒంగోలు నుండి 76 కి.మీ కందుకూరు నుండి 35 కి.మీ. దూరంలో ఉంది మాలకొండ. కొండపైకి ఘాట్‌రోడ్‌తో పాటు మొట్ల మార్గం కూడా ఉంది.

malakonda lakshmi narasimhaswamy temple information telugu, prakasham district malakonda temple, sri malakonda , lakshmi narasimhaswamy temple history, malyadri lakshmi narasimhaswamy temple history telugu, malyadri, malyadri lakshni narasimhaswamy temple timings, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు