Drop Down Menus

Palani Arulmigu Dandayudhapani Swami Temple | పళని సుబ్రహ్మణ్య క్షేత్రం


పళని క్షేత్రం తమిళనాడు లో గల ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి. పళని సుబ్రహ్మణ్య క్షేత్రం మదురై నుంచి 120 కిమీ దూరం. సుబ్రహ్మణ్యుడి ఆరుపడైవీడు క్షేత్రాలలో పళని క్షేత్రం నాల్గవది. పళని క్షేత్రం కొండపైన ఉంటుంది. కొండఎక్కడానికి రోప్ వే మార్గం , చిన్న ట్రైన్ మార్గం తో పాటు మెట్లమార్గం కూడా ఉంటుంది. పళని  పంచామృత ప్రసాదం బాగా ప్రసిద్ధి చెందింది. చాలారోజులు పాటు నిల్వకుండా ఉంటుంది. తమిళనాడు లో సుబ్రహ్మణ్యుడి కావడి ఉత్సవం బాగా ప్రసిద్ధి. ఆ కావడి ఉత్సవం పళని క్షేత్రం నుంచి ప్రారంభమైంది. కావడి ఉత్సవం అనగా సుబ్రహ్మణ్య భక్తులు కావడిలో విభూది కానీ తేనే కానీ పూలు కానీ పాలు కానీ పెట్టుకుని స్వామి వారి కొండకు మోసుకుని వస్తారు. ఇడుంబుడు అనే రాక్షసుడు ఎవరైతే కావడి మోస్తూ మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అని ఇడుంబుడు సుబ్రహ్మణ్య స్వామి వారిని కోరుకోగా స్వామి వారు సరే అని వరమిస్తారు. ఇడుంబుడు అలా ఎందుకు కోరుకున్నాడో మరో సారి చెప్పుకుందాం. 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఆలయం చేరుకోవడానికి మొత్తం 693 మెట్లు కలవు. పళని కొండ ఎత్తు 150 మీటర్లు.  
పళని మధురై కి దగ్గర్లో ఉండటం వల్ల భక్తులు మదురై నుంచి పళని వచ్చి మరల మదురై వెళ్తుంటారు. పళని నుంచి కొడైకెనాల్ 66 కిమీ దూరం. మదురై నుంచి పళని కి డైరెక్ట్ బస్సు లు ఉంటాయి. మధురై రైల్వే స్టేషన్ నుంచి ఆరుపడైవీడు బస్సు స్టాండ్ కి వెళ్లి బస్సు ఎక్కాలి . మీరు మధురై లో 2 రెండు రోజులు ఉంటే చుట్టుప్రక్కల ఉన్న క్షేత్రాలు చూడవచ్చు. 

ఆరుపడై వీడు క్షేత్రాలలో రెండు క్షేత్రాలు మధురై లోనే ఉన్నట్టు మనకి కనిపిస్తాయి.  తిరుపరంకున్రం , పజ్హముదిర్చోలై  క్షేత్రాలు మదురై నుంచి 10 కిమీ , 20 కిమీ దూరం లో ఉంటాయి. మదురై లోకల్ బస్సు లో మీరు ఈ క్షేత్రాలను కూడా చూడవచ్చు. కాకపోతే ఈ రెండు క్షేత్రాలు వరుసగా ఒకే రూట్ లో ఉండవు. ముందుగా ఏదొక క్షేత్రం దర్శించి మరల బస్సు స్టాండ్ కి వచ్చి ఇంకొక బస్సు ఎక్కాలి . 
ఆరుపడైవీడు క్షేత్రాలపై క్లిక్ చేసి ఆ క్షేత్రాల గురించి తెలుసుకోండి : 


దేవాలయం సమయాలు : 
ఉదయం : 5 . 30
రాత్రి : 9. 30 వరకు 

పళని వెబ్సైటు : http://palanimurugantemple.org/
Toll Free Number - 18004259925

Keywords : 
Palani Temple , Palani Murugan Temple, Palani Temple Route Map, Palani Temple Timings , Palani Temple website , Palani to Madurai , Palani to Kodaikenal. Tamil Nadu Famous Temples. Lord Murugan Temples.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.