శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం
శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది. శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.
క్షేత్ర పురాణము
ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
భీమేశ్వరాలయం భీమేశ్వరాలయం శిథిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.
ముఖలింగం ఎలా చేరుకోవాలి ?
శ్రీకాకుళం ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి ప్రతి గంట గంట కు ముఖలింగం కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ప్రయాణ సమయం 2 గంటలు. గుడి కి సమీపాన వైజాగ్ ఎయిర్ పోర్ట్ కలదు మరియు ఆముదాలవలస (45 కి. మీ.) సమీపాన ఉన్న రైల్వే స్టేషన్.
srimukhalingam temple matter in telugu, srikurmam temple history in telugu pdf, srimukhalingam to srikurmam, srimukhalingam distance, arasavalli matter in telugu, srimukhalingam temple history in english pdf, sri mukhalingeswara temple in srikakulam, salihundam history in telugu

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment