Drop Down Menus

Basic Information of Mahabharatam | Mahabharatam Story In Telugu




మహాభారతం రచన పర్వాలు పాండవులు , కౌరవుల జాబితా :


మహాభారతం :


ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో మహాభారతం ఒకటి . మహాభారతం లో భాగాలను పర్వాలు అంటారు .ఇందులో 18 పర్వాలు , లక్ష శ్లోకాలు కలవు. మహాభారతాన్ని ఇతిహాసము , పంచమ వేదము అని పిలుస్తారు. జయము అని కూడా కలదు. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రచించాడు . మహాభారత రచన చేయడానికి పట్టిన కాలము 3 సంవత్సరములు చెప్పబడుతుంది.

సంస్కృతం లో రచించిన మహాభారతాన్ని కవిత్రయం ( నన్నయ , తిక్కన్న , ఎర్రన్న ) తెలుగు లోకి అనువదించారు. 18 పర్వాలలో ఆదికవి గా పిలవబడే నన్నయ ఆది, సభ పర్వాలను అరణ్య పర్వంలో కొంతభాగాన్ని రచించారు. నన్నయ 11 వ శతాబ్దం వాడు మహాభారత రచన తెలుగు లోకి 11 వ శతాబ్దం లో మొదలైంది. ఆ తరువాత తిక్కన కవి అరణ్య పర్వాన్ని వదిలి మిగిలిన 15 పర్వాలను పూర్తిచేసాడు. తిక్కన 13వ శతాబ్దం వాడు మహాభారతం లో మిగిలిన భాగాన్ని పూర్తిచేయడానికి 14వ శతాబ్దం లో ఎఱ్ఱన రావాల్సి వచ్చింది.

మహాభారతం తెలుగు లోకి అనువాదం కావడానికి సుమారు 300 సంవత్సరాల సమయం పట్టింది. కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి.ఎఱ్ఱన కు ప్రబంధ పరమేశ్వరుడు" అని బిరుదు ఉంది .

కారణం ఏమనగా నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది .భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము మహాభారతం లోని భాగాలే. మహాభారతాన్నిచెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు.

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది :


ఆది పర్వము :
1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.

సభా పర్వము :
20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.

వన పర్వము  (లేక) అరణ్య పర్వము :
29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.

విరాట పర్వము :
45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.

ఉద్యోగ పర్వము :
49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.

భీష్మ పర్వము :
60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.

ద్రోణ పర్వము :
65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.

కర్ణ పర్వము :
73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.

శల్య పర్వము :
74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.

సౌప్తిక పర్వము :
78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.

స్త్రీ పర్వము :
81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.

శాంతి పర్వము : 
86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.

అనుశాసనిక పర్వము :
89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)

అశ్వమేధ పర్వము : 
91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.

ఆశ్రమవాస పర్వము :
93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.

మౌసల పర్వము : 
96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.

మహాప్రస్ధానిక పర్వము :
97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.

స్వర్గారోహణ పర్వము : 
98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.

కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.

పాండవులు :


పాండురాజుకు పుట్టినవారు పాండవులు. పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతీ , మాద్రి. కుంతికి పుట్టినవారు ధర్మరాజు ( యుధిష్ఠిరుడు ), భీముడు ( వృకోదరుడు ) , అర్జునుడు ( విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు ) మాద్రికి జన్మించిన వారు నకులుడు సహదేవుడు. పాండవులకు ద్రౌపతికి జన్మించినవారు ఉపపాండవులు . ప్రతివింధ్యుడు (ధర్మరాజు పుత్రుడు),శ్రుతసోముడు - (భీముని పుత్రుడు),శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు),శతానీకుడు - (నకులుని పుత్రుడు),శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు) . ద్రోణకుమారుడు ఐన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధ సమయం లో నిద్రించుచున్న ఉపపాండవులను చంపివేస్తాడు. అర్జునునకు ద్రౌపతితోపాటు ఉలూచి, చిత్రాంగద, సుభద్ర భార్యలుగా కలరు. సుభద్ర కు జన్మించినవాడే అభిమన్యుడు. అభిమన్యుని భార్య ఉత్తర , ఉత్తర కుమారుడు పరీక్షిత్తు మహారాజు.

కౌరవులు :


దృతరాష్టునికి జన్మించిన వారిని కౌరవులు అని పిలుస్తారు. దృతరాష్టునునికి ఇద్దరు భార్యలు కలరు. గాంధారి మరియు సుఖద. గాంధారికి 100 పుత్రులు ఒక కుమార్తె జన్మించారు కుమార్తె పేరు దుస్సల . సుఖద కు ఒక పుత్రుడు జన్మించాడు అతని పేరు యుయుత్సడు , యుయుత్సడు ఒక్కడే కురుక్షేత్ర యుద్ధం లో కౌరవులలో జీవించి ఉన్నాడు. ఇతను యుద్ధ సమయం లో పాండవుల తరుపున పోరాడాడు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు.

కౌరవుల జాబితా :

దుర్యోధన, దుశ్శాసన, దుస్సహన, దుశ్శలన, జలసంధన, సమన, సహన, విందన, అనువిందన, దుర్ధర్షన, సుబాహు, దుష్ప్రధర్షణ, దుర్మర్షణ, దుర్ముఖన, దుష్కర్ణన, కర్ణన, వికర్ణన, శలన, సత్వన, సులోచన, చిత్రన, ఉపచిత్రన, చిత్రాక్షన, చారుచిత్రన, శరాసన, దుర్మదన, దుర్విగాహన, వివిత్సు, వికటానన ,ఊర్ణనాభన, సునాభన, నందన, ఉపనందక, చిత్రభానన, చిత్రవర్మన , సువర్మన, దుర్విమోచన, అయోబాహు, మహాబాహు, చిత్రాంగన, చిత్రకుండలన, భీమవేగన, భీమబలన, బలాకి, బలవర్ధనన, ఉగ్రాయుధన, సుసేనన, కుండధారన, మహోదరన, చిత్రాయుధన, నిశాంగి, పాశి, బృందారకన, దృఢవర్మన, దృడక్షత్రన, సోమకీర్తి, అంతుదారన, దృఢసంధన, జరాసంధన, సత్యసంధన, సదాసువాక్, ఉగ్రశ్రవస, ఉగ్రసేనన, సేనాని, దుష్పరాజన, అపరాజితన, కుండశాయి, విశాలాక్షన, దురాధరన, దృఢహస్తన, సుహస్తన, వాతవేగన, సువర్చసన, ఆదిత్యకేతు, బహ్వాశి, నాగదత్తన, అగ్రయాయి, కవచి, క్రధనన, క్రుంధి, భీమవిక్రమన, ధనుర్ధరన, వీరబాహు, ఆలోలుపన, అభయన, దృఢకర్మణ, దృఢరథాశ్రయన ,అనాధృష్య, కుండాభేది, విరావి, చిత్రకుండలన, ప్రథమన, అప్రమధి, దీర్ఘరోమన, సువీర్యవంతన, దీర్ఘబాహు, సుజాతన, కాంచనధ్వజన, కుండాశి, విరజ , యుయుత్సుడు, దుస్సల




Keywords : Mahabharatam, Mahabharatam Books, Mahabharatam Story in Telugu, Mahabharatam PDF
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.