What Is Veda | Basic Information About Vedas In Telugu



వేదాలు వేదాంగములు మహావాక్యాలు వివరణ :


వేదాలు:

వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు.

వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది.


ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు.

కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు.

వేదాలకు 9 పేర్లు కలవు అవి :

(1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం

వేదాలు ఎన్ని :

ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదము,అధర్వణవేదము

వేదంలోను ఉపవిభాగాలు :

మంత్ర సంహిత,బ్రాహ్మణము,ఆరణ్యకము,ఉపనిషత్తులు

నాలుగు మహా వాక్యాలు :

ఉపనిషత్తుల సారమే మహా వాక్యాలు. ప్రజ్ఞానం బ్రహ్మ,ఆహం బ్రహ్మాస్మి,తత్ త్వమసి,అయమాత్మా బ్రహ్మ.

ఇవి కూడా చదవండి :

రామాయణం    భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు    సకలదేవత స్తోత్రాలు   సనాతన ధర్మ మూలాలు    ఆసక్తికరమైన క్విజ్ లు    1965-2020 వరకు గల పంచాంగాలు



Keywords : Vedas, how many vedas , who wrote vedas, Vedas information in telugu, Vedangalu , Mahavakyalu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS