Famous Temples List In Jangaon District | Telangana State

జనగామ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ జనగామ జిల్లా నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు వరంగల్ అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా జిల్లా గా ఏర్పడినది.

1. శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, పాలకుర్తి :

జనగాం జిల్లాలోని పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం. శివారాధకులకు,వీరశైవులకు దర్శనీయ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీనర్సింహాలయాలు ఉన్నాయి. శివ కేశవులిద్దరూ పక్కపక్కనే ఉన్న రెండు పర్వత గుహల్లో సహజసిద్ధంగా వెలిశారు. ఈ రెండు గుహలను కలుపుతూ ప్రకృతిసిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణా మార్గం ఉన్నది. .ప్రతియేటా మహాశివరాత్రి నుండి అయిదు రోజులపాటు ఇక్కడ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 2.00PM TO 8.00PM.

2. శ్రీ నరసింహ స్వామి ఆలయం , హేమాచలం  :

మల్లూరు గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఈ అలయాన్నికి 400 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం విశేషం ఏమిటనగా స్వామి వారికి కూడా మన చర్మం వల్లే మెత్తగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

3. శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు భద్రకాళి గా పూజలు అందుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. వరంగల్ జిల్లాలో ఈ ఆలయం ప్రసిద్ది చెందిన ఆలయం. హైదరాబద్ నుంచి మాత్రమే వివిద ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు వస్తారు. దసరా రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

4. శ్రీ సమ్మక్క - సారలమ్మ ఆలయం, మేడారం :

సమ్మక్క - సారలమ్మ జాతర భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని జరిగే గిరిజన ఉత్సవం. కుంభమేళా తరువాత మేడారం జాతరకి దేశంలోనే అత్యధిక సంఖ్య లో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ అమ్మవారికి బంగారం (బెల్లం) నివేదిస్తారు. ప్రతి 2 సం || ఒకసారి 5 రోజుల పాటు ఈ ఉత్సవాని నిర్వహిస్తారు. దేశం నలువైపులా నుంచి భక్తులు వస్తారు. వరంగల్ నుంచి 95 కి. మీ దూరంలో కలదు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM-10.30PM.

5. 1000 స్తంభాల ఆలయం, వరంగల్ టౌన్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ప్రాచీన కాకతీయ విశ్వకర్మ స్తపతి ద్వారా నిర్మాణ నైపుణ్యాల పరంగా ఇది ఒక కళా ఖండన్ని సాధించింది. 1163 లో రుధ్రరాజు దేవా చే వేయి స్తంభాల ఆలయం నిర్మించారు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈ ఆలయం మొత్తం రాయితో నిర్మించారు. ఒక్కొక్క స్తంభంలో ఎన్నో రకాల శిల్పాలు గమనించవచ్చు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

6. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , కూరవై :

ఈ ఆలయం వేంగి చాళుక్య రాజవంశం యొక్క ప్రసిద్ది పాలకుడు "భీమరాజు" నిర్మించారు. జిల్లా కేంద్రనీకి 110 కి.మీ దూరంలో ఈ ఆలయంలో కలదు. మహా బూబా బాద్ నుంచి కేవలం 11 కి. మీ దూరంలో కలదు. శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 1.00PM - 4.00PM TO 8.00PM.

7. శ్రీ పద్మాక్షి ఆలయం , హన్మకొండ :

స్తానీక ప్రజాలచే  "అమ్మ దేవత" గా పేరు తో పిలవబడుతుంది. ఈ అమ్మవారి ఆలయం కొండ పై కొలువై ఉన్నది. ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయంలో దసరా మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.30PM - 2.00PM TO 8.00PM.

8. శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం , హన్మకొండ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య కాలం నాటి ఆలయం అని అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుందీ. హన్మకొండ నుంచి కేవలం 5 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. శివరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

జనగామ  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise



KeyWords : Jangaon Famous Temples List, Jangaon District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS