Drop Down Menus

Sri Chilkur Balaji Temple | Hyderabad | Telangana State

శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం :

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయక్తి కాదు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. 

ఆలయ చరిత్ర :

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణలు చెపుతున్నాయి. 
తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు , ద్వారకా తిరుమల లో ఒకటి మారియొక్కటి తెలంగాణా లోని చిలుకురుగా ప్రతీతి. తెలంగాణా తిరుమలగా ప్రసిద్ది చెందిన చిలుకూరు బాలాజీ ఆలయన్నికి 500 సం || సుదీరగా చరిత్ర కలదు. 

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్ద సంఖ్య లో ఈ స్వామిని దర్శించుకుంటారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఈ ఆలయం అనేక సందర్భాలలో కిక్కిరిసిన జనంతో తిరుమలని తలపిస్తుంది. తెలంగాణా తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ది చెందినది. ఇక్కడి స్వామి వారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. 

చిలుకూరు బాలాజీ దేవాలయం హైదరాబాద్ నుంచి 25 కి. మీ దూరంలో వికారాబాద్ వెళ్ళే మార్గంలో కలదు. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ కు చేరువలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు అనే గ్రామంలో కలదు. హైదరాబాద్ కు చేరువలో ఉండటం , రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి రోజు వేలాలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర , శని, ఆదివారరాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
శ్రీ వేంకటేశ్వర స్వామికి అలాగే వారి భార్యాలయిన శ్రీ దేవి , భూదేవి లకి అంకితమీవబడినది. 
ఈ ఆలయంలో ప్రత్యేకత డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందినది. నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అందుకనే ఈ గుడిలో ప్రముఖులకి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు , ప్రత్యేక క్యూ లైన్ లు ఉండవు. 

చిలుకూరు బాలాజీ ఆలయంలో వెళ్ళిన భక్తులు మొదట 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయడా ఆనవాయితీ. అలా చేస్తే చిలుకూరు బాలాజీ భక్తుల కష్టాలు తిరతాయని , చిలుకూరు బాలాజీ గా ప్రసిద్ది చెందాడు. 
కొన్నేళ్ళ క్రితం పై చదువులకు విదేశాలకు వెళ్ళి చదువుకొనే విద్యార్దులకి వీసా దొరకాక ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిస్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలి అని కోరుకోవటం. 

ఆ కోరిక నెరవేరటం వెంటనే జరివిపోయాయి. దానితో ఇక్కడి స్వామికి వీసా దేవుడుగా పేరు వచ్చింది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం :  5.00AMto 3.00PM
సాయంత్రం : 3.30PM to 7.30PM 

Address :

Sri Chilukur Balaji Swamy Temple,
Chilukur Balaji Temple Rd,
Chilukur Balaji (v),
Moinabad (D),
Hyderabad, Telangana : 500075
Phone : 08772064254

Keywords : Chilukur Balaji Temple, Chilukur , Chilukur History, Chilukur Temple Details, App, T.S. District  , Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON