శ్రీ కృష్ణా ఆలయం , గురువాయూర్ :
కేరళలోని పవిత్రమైన కృష్ణా క్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్ పట్టణం లో కలదు. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో పిలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి , తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్".కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.
గజేంద్ర సేవ !
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట.తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు
తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే గురువాయూర్ గోపాలుడి రూపం మరే ఆలయంలోనూ మనం కాంచలేము. ఇక్కడ ప్రతీ రోజూ గంభీరమైన గజరాజాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఘీంకరిస్తాయి. ఆ తరువాతే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.
అలాగే, ప్రతీ సాయంత్రం గుడి నిండా దీపాలు వెలిగిస్తారు ! అప్పుడు శ్రీకృష్ణుడి శోభను చూడటానికి రెండు కళ్లు సరిపోవు! అంతే కాక గురువాయూర్ లో నారాయణీయమ్ గ్రంథ పారాయణ చేస్తే సకల రోగాలు సమసిపోతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 4.00AM TO 12.00PMసాయంత్రం :4.30PM TO 9.00PM
How to Reach Guruvayur Temple :
BY BUS :
Guruvayoor is well connected to other major cities of the country via regular buses.Nearest Bus Station: Guruvayoor
BY TRAIN :
There are regular trains from other major cities of the country to Guruvayoor.Nearest Railway Station : Guruvayur (GUV)
Thrissur Railway Station to Guruvayur -30Km.
Ernakulam Railway Station (Junction/Town) to Guruvayur – 85Km.
BY FLIGHT :
Instead of Guruvayoor you can a get flight to Calicut International Airport on regular basis.Guruvayoor - 77 km away.
Calicut International Airport (CCJ), Kozhikode, Kerala
Guruvayoor - 72 km away.
Cochin Airport to Guruvayur – 80Km.
Trivandrum to Guruvayur -290Km.
Contact Address :
GURUVAYUR TEMPLE ,GURUVAYUR (V), THRISSUR,
KERALA (KL),
India (IN), Pin Code:- 680101
KeyWords : Sri Krishna Temple , Guruvayur , Kerala Surrounding Temples, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment