Drop Down Menus

Sri Murdeshwar Swamy Temple Information | Karnataka Famous Temples


శ్రీ మురుడేశ్వర స్వామి దేవాలయం , కర్ణాటక  :

ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం లోని భట్కల్ అనే ప్రాంతంలో కలదు. గోకర్ణం నుంచి ఈ ఆలయానికి 80 కి. మీ దూరంలో కలదు. ఈ ఆలయం అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ ఆలయంలోని మహా శివుని విగ్రహం ప్రపంచంలోనే ఎత్తన విగ్రహం. ఈ ఆలయం కందుక అనే పర్వతం పై కలదు. ఈ ప్రాంతం చూడముచ్చటగా , ప్రశాంతమైన వాతావరణం లో కొండ పై ఉన్నది.

ఆలయ చరిత్ర :

మురుడేశ్వర ప్రాంత ఇతిహాసం త్రేతాయుగం లో కూడా కలదు. శైవ క్షేత్రలలో ఈ ఆలయం ఒకటి. రావణాసురుడు, శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు.  కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం ఆ లింగాని భూమి మీద  ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయిపోతుంది. అక్కడి నుంచి తిరిగి మార్చడం ఎవ్వరి వల్ల కాదని కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఆ ఆత్మలింగని తీసుకొని వచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. ఆ తాడు తెగి విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జెశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగం పై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వేస్తుంది. పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట ధారేశ్వరా లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామి వారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణం లో వెలుస్తుంది.
ఆత్మ లింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలని శైవ పంచ క్షేత్రాలు అని పిలుస్తారు. మురుడేశ్వర ఆలయ గోపురం ప్రపంచాలోనే ఎత్తైన గోపురం గా ప్రసిద్ది చెందినది. ఈ గోపురం ఎత్తు 18 అంతస్తులు. ఈ ఆలయ మారియొక్క విశేషం ఈ ఆలయానికి మూడు వైపులా నీరు ఉంటుంది.

శివుని విగ్రహం : 

ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. 123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.

ఆలయ దర్శన సమయం :

ఉదయ దర్శన సమయం : 6.00AM TO 1.00PM
సాయంత్ర దర్శన సమయం : 3.00PM TO 8.30PM

పూజ వివరాలు  :

ఉదయ అభిషేక పూజ  : 6.30AM TO 7.30AM
మధ్యన పూజ  : 12.15PM TO 1.00PM
సాయంత్ర పూజ  : 7.15PM TO 8.15PM

ఆలయ చిరునామా :

శ్రీ మురుడేశ్వర  స్వామి ఆలయం ,
భట్కల్ పట్టణం , NH-17,
మురుడేశ్వర గ్రామం , ఉత్తర కర్ణాటక ,
కర్ణాటక రాష్ట్రం 581350 ,
భారతదేశం.

ఆలయానికి చేరుకునే విధానం :

ఈ ఆలయాన్నికి చేరుకోవడానికి రోడ్డు , రైలు , విమాన మార్గాలు ఉన్నాయి.

రోడ్డు మార్గం :

హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి-17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.ఈ ఆలయానికి బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో ఉన్నది. మంగళూరు నుండి కేవలం 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం :

మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన మార్గం :

ఈ మురుడేశ్వర ఆలయానికి దగ్గరలో గల విమానాశ్రయం మంగళూరువిమానాశ్రయం . ఈ విమానాశ్రయం  నుంచి ఆలయానికి 165 కి.మీ. దూరంలో కలదు.

KeyWords : Sri Murdeshwar Swamy Temple ,  Karnataka Surrounding Temples, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.