శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం , తిరువనంత పురం :
శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ మహావిష్ణు ఆలయం. మహా శివునీకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నట్లే శ్రీ మహావిష్ణు స్వామి కి కూడా 108 దివ్యలయాలు ఉన్నాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం కేరళ రాష్ట్రం , తిరువనంతపురంలో కలదు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం తిరుమల తిరుపతి వడ్డీ కాసుల స్వామి. ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో బయటపడిన అనంత సంపద తో వజ్రాలు , వైడూర్యలు , టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద తో మొదటి స్థానంలో నిలబడగా తిరుమల ఆలయం రెండవ స్థానంలో నిలవాల్సి వచ్చింది. కానీ ఇంకా ఈ ఆలయ సంపద అంతా లెక్కకట్టాల్సి ఉంది. ఈ ఆలయం లో ప్రవేశించాలి అంటే మగవారు అందరూ పంచ తో మాత్రమే అనుమతి. పైన ఏ వస్త్రం ధరించరాదు. మహిళలు సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులుతో అనుమతి లేదు.ఆలయ చరిత్ర :
ఆలయ చరిత్ర ప్రకారం కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళ్లవంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం'లో ప్రతిష్ఠించినట్లు కథాంశం.ఆలయ నిర్మాణం :
ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో 'చేరమాన్ పెరుమాళ్' అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం క్రీ.శ.1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తున్నది. తరువాత క్రీ.శ.1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన 'వీరమార్తాండ వర్మ' అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈయన హయాంలో క్రీ.శ.1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంది. క్రీ.శ.1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. క్రీ.శ.1461లో ఒక రాతిపై 'ఓట్టకల్ మండపం' నిర్మాణం జరిగింది. అనంతరం క్రీ.శ.1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు 'రాజా మార్తాండ వర్మ' కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.ఆలయ దర్శన సమయం :
ఉదయం : 3.300AM TO 12.00PMసాయంత్రం : 5.00PM TO 7.30PM
ఆలయ చిరునామా :
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ,తిరువనంత పురం ,
కసారగడ జిల్లా - 671 321
కేరళ రాష్ట్రం
భారతదేశం.
ph : +91 4998 214360
Email: info@ananthapuratemple.com
Website : www.ananthapuratemple.com
ఆలయానికి చేరుకునే విధానం :
ఈ ఆలయాన్నికి చేరుకోవడానికి రోడ్డు , రైలు , విమాన మార్గాలు ఉన్నాయి.బస్ మార్గం :
ఈ ఆలయం దేశం లోని అన్నీ మార్గాల నుంచి మొదట కసరగడ్ ప్రాంతాన్నికి చేరుకొన్ని అక్కడి నుంచి ఈ ఆలయం నడిచి వెళ్ళవచ్చు.రైలు మార్గం :
రైలు మార్గం ద్వారా ఈ ఆలయాన్నికి చేరుకోవడానికి ప్రధాన రైల్వే స్టేషన్ త్రివేండ్రం. అక్కడి నుంచి ఈ ఆలయం కేవలం 1 కి.మీ దూరంలో కలదు. నడిచి వెల్లవచ్చు. లేదా ఆటో వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చిన వల్లే తీసుకొని వెల్లుతారు.విమాన మార్గం :
విమాన మార్గం ద్వారా ఈ ఆలయం చేరుకోవాలి అంటే మొదట మంగళ్ళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయాన్నికి చేరుకోవచ్చు.KeyWords : Sri Ananta Padmanabha Swamy Temple , Guruvayur , Kerala Surrounding Temples, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Trivendrum airport very close to Temple 10 km only
ReplyDeleteAnd bust stop is East port.