Drop Down Menus

Badrinath Temple Information in Telugu | Uttarakhand


బద్రీనాథ్:
బద్రీనాథ్...హిందువులు ఎంతో పవిత్రంగా జరుపే చార్ ధామ్ యాత్రలో మొదటిగా దర్శించే క్షేత్రం ఇదే. బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం, ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది. ఈ ఆలయం చార్ ధామ్, చోటా చార్ ధామ్ తీర్థయాత్రలలో ఒకటి . విష్ణువుకు అంకితం చేసిన 108 దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి, విష్ణు మూర్తి అక్కడ బద్రినాథుడిగా ఉన్నారు. ఈ క్షేత్రంలో విష్ణువు రేగుచెట్టు రూపంలో ఉన్నట్లు చెబుతారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటు వంటి ఒక జలపాతం నుంచి అందరి పై నీళ్లు పడవని కేవలం పుణ్యాత్ముల పై మాత్రమే నీరు పడుతుందని చెబుతారు.

ప్రయాణ సదుపాయాలు
అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్‌లో ఉన్న డెహరాడూన్ (317కిలో మీటర్లు), సమీపంలోని రైల్వే స్టేషను హరిద్వార్ రైల్వే స్టేషను (310కిలోమీటర్లు) రిషికేశ్ రైల్వే స్టేషను (297), కోట్‌ద్వార్ రైల్వే స్టేషను (327 కిలో మీటర్లు). ప్రతి రోజు ఢిల్లీ, హరిద్వార్, ఋషికేశ్ లనుండి బస్సు సర్వీసులు (వసతులు) ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు .

badrinath temple history in hindi, badrinath telugu, kedarnath, badrinath god images, kedarnath yatra in telugu, kedarnath wikipedia in telugu, importance of badrinath, badrinath badrinath
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments