Drop Down Menus

List of Famous Temples Nellore District | Andhra Pradesh

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు :
శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది . రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్థులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.

రైలు విజయవాడ - గూడూరు రైలు మార్గములో నెల్లూరు రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు పశ్చిమ & తూర్పు ప్రవేశ ద్వారములున్నాయి. పశ్చిమ ప్రవేశ ద్వారం (PF No.1) నకు సుమారు ఒక కీ.మీ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆటోలు దొరుకుతాయి. బస్సు రాష్ట్రం లోని అన్ని ప్రాంతములు నుంచి నెల్లూరు కు బస్సులు కలవు. నెల్లూరు నందు రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి. RTC మెయిన్ బస్ స్టాండు & ఆత్మకూరు బస్ స్టాండ్. ఆలయం నకు ఆత్మకూరు బస్ స్టాండ్ కొంత దగ్గరవుతుంది.

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి :
మన ఇండియాలో శైవ క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తిప్రదాయిని. ముగ్గరమ్మల మూలపుటమ్మ, ముమ్మూర్తలమ్మ సృష్టికి మూలం దేవీ సర్వ శక్తి ప్రదాయని, జీవకోటిని రక్షించే ఆది శక్తిగా కొలువైన శ్రీశక్తిని అనాది కాలం నుండి పూజిస్తూ..ఆరాదిస్తున్నారు. గ్రామగ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలిపించుకుంటూ, సహస్ర నామదారిని ప్రజలను కన్న బిడ్డల వలే కాపాడుతుంది. జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తి లోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే! కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి.అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసముంటున్నది అనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకొంటున్నది శ్రీచెంగాలమ్మ. మరి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

మహిమ గల తల్లిగా, కోరిన వారాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుతీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ ఆలయం , నెల్లూరు పట్టణానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సూళ్ళూరు పేట లో ఉన్నది.

రాజరాజేశ్వరీ దేవాలయం నెల్లూరు :
ఇది పురాతన ఆలయం కాదు. ఈమధ్య కాలంలోనే కట్టిన ఆధునిక దేవాలయం.
ప్రాచీన వైభవం లేకపోతేనేం ఎంతో అందంగా నిర్మించారు రాజరాజేశ్వరీ దేవాలయాన్ని. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఊరట పొందడానికి గుడికి వెళ్తాం. నెల్లూరు రాజరాజేశ్వరీ దేవాలయానికి వెళ్ళడం ద్వారా ఆ ప్రయోజనం తప్పకుండా నెరవేరుతుంది. భక్తులు ప్రశాంత చిత్తంతో వెనుదిరిగి వస్తారు. మాతృస్వామ్య సమాజంలో జగన్మాత గ్రామదేవతగా వెలిసింది. పితృస్వామ్య వ్యవస్థలో మహాశివుని అర్ధాంగిగా సేవలు అందుకుంటోంది. నెల్లూరు రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నిత్యం జరిపేపూజా కార్యక్రమాలతో బాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు.

నెల్లూరుకు సమీప విమానాశ్రయం తిరుపతిలో ఉంది, నెల్లూరు నుండి క్యాబ్ అద్దెకు తీసుకొని చేరుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు రైళ్లు ఇక్కడి రైల్వే స్టేషన్ నుండి అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాలు నెల్లూరుకు బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి.

పెంచల కోన :
చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోన గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.

పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమిటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

రైల్వే జంక్షన్‌ అయిన గూడూరు నుండి 70 కిలోమిటర్ల దూరం ఇక్కడి నుండి రోడ్దు మార్గాన రాపూరుకు చెరుకోని కోనకు వెళ్లవచ్చు. కడపజిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చెరుకోని ఇక్కడకి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమిటర్ల దూరం ఉంది.

జొన్నవాడ :
స్థలపురాణం ప్రకారం కశ్యప ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించాలని భావించాడు. తగిన ప్రదేశం కోసం వెతుకుతూ పినాకినీ నదీ తీరం (దీనిని పెన్నానది అని కూడా అంటారు) వద్దకు చేరుకొన్నాడు. యాగానికి ఈ ప్రాంతం అనుకూలమైనది భావించి తూర్పు, నైరుతి, వాయవ్యాల్లో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు. ఇక వాయువ్యాన ఉన్న యాగకుండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు. ఈ యగవాటికను రజతగిరి అని పిలిచే వారు అదే కాలక్రమేణ జన్నవాడ, జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. ఇక కైలాసంలో శివుడు కనబడక పోవడంతో పార్వతి కంగారు పడింది. తన మనో నేత్రంతో జరిగినది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడకు వచ్చి కొలువై ఉంది.

నెల్లూరుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేరుగా బస్సు, రైలు సౌకర్యం ఉంది. ఇక నెల్లూరు నుంచి జొన్నవాడ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నగరం నుంచి జొన్నవాడకు ఆటోలు, బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి.
nellore district temples list, haunted places in nellore, beaches in nellore, penchalakona temple, venkatagiri famous places, tourist places near sullurpet, trekking places near nellore, places to visit near sriharikota

               
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments