Drop Down Menus

List of Famous Temples Prakasam District | Andhra Pradesh

శ్రీ మాల్యాద్రి లక్ష్మి నృసింహ స్వామి :
రాష్ట్రంలోని సుప్రసిద్ద నారసింహ క్షేత్రాలల్లో మాల్యాద్రి ఒకటి. దీనినే మాలకొండ అనికూడా అంటారు. కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా, దుష్టశక్తుల పాలిట అరివీర భయంకరుడిగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. పూర్వం శ్రీమహావిష్ణువు భూలోక విహారం చేయానుకున్నాడట తాను విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన స్థలాన్ని అన్వేషించాలంటూ గరుత్మంతుణ్ణి ఆదేశించి, ఒక పూమాల ఇచ్చి పంపించాడట. గరుత్మంతుడు భూలోకంలో పలు ప్రాంతాలు గాలించాక, మాలకొండను అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ కొండపై పూలమాల ఉంచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై మాల్యాద్రిపై విశ్రమించాడట. మాల ఉంచిన కొండ కాబట్టి దీనికి మాల్యాద్రి అని పేరు వచ్చింది.

విజయవాడ - చెన్నై ప్రధాన రైలు మార్గంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడినుండి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కందుకూరుకు వెళ్లాలి. కందుకూరు నుంచి ప్రతి శనివారం మాలకొండకు బస్సులుంటాయి. (కందుకూరుకు ఒంగోలు మరియు విజయవాడ నుండి బస్సు సౌకర్యం కలదు) ఒంగోలు నుండి 76 కి.మీ కందుకూరు నుండి 35 కి.మీ. దూరంలో ఉంది మాలకొండ. కొండపైకి ఘాట్‌రోడ్‌తో పాటు మొట్ల మార్గం కూడా ఉంది.

భైరవకోన :
కృతయుగం నృసింహాలయంలో ప్రహ్లాదుడు నియమించిన అర్చకుడు భైరవుడు ప్రహ్లాదుడు పరమపదించిన తరువాత పట్టించుకొనే వారులేక క్షుద్బాధభరించ లేక దారిదోపిడీలకు పాల్బడేవాడు అందుకు ఆగ్రహించిన నృసింహాస్వామి రాక్షసుడవుకమ్మని శపించాడు తెలిసి చేసినతప్పు కాదని ఆకలి భరించలేక చేసానని పరిహారం శూచించమని భైరవుడు ప్రాదేయ పడటంతొ కలియుగాంతం వరకు తనకంటికి కనిపించకుండా తనభక్తులు తెచ్చినది ఏదైనా తనప్రసాదంగా భావించి శ్వీకరిస్తూ ఉండమనీ కలియుగనంతరం మళ్లీ తన సేవకు వినియెగించుకుంటానని వరమిచ్చాడు నాటినుంచి భైరవుడు భైరవకోనలో పూజలందుకుంటున్నాడు.

ఎపిఎస్‌ఆర్‌టిసి ఉదయగిరి డిపో భైరవకోన నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారామపురానికి బస్సులను అందిస్తుంది. సీతారామపురం నుండి షేర్ ఆటోలను భైరవకోనకు తీసుకోవచ్చు. ఈ ప్రదేశం పురాతన శివాలయానికి నిలయం. 200 మీటర్ల ఎత్తు నుండి వచ్చే జలపాతం ఉంది మరియు అక్కడ కొండలో ఎనిమిది దేవాలయాలు చెక్కబడ్డాయి.

సింగరకొండ :
ప్రకాశం జిల్లా అడ్డంకి దగ్గర్లో ఉన్న శింగరకొండలో లక్ష్మీ నృశింహ స్వామి, ప్రసన్నాంజనేయ స్వాములదేవాలయాలు ప్రసిద్ధ ఆలయాలు. శింగరకొండపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెప్తారు.

ఎంత దూరం : హైదరాబాద్ నుండి 290 కిలోమీటర్లు, విజయవాడ నుండి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుండి 36 కిలోమీటర్లు, అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ కలదు. విమాన మార్గం ద్వారా : సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీ లలో సింగరకొండ చేరుకోవచ్చు. రైలు మార్గం : ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపాన ఉన్నది. హైదరాబాద్, విజయవాడ నుండి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి. రోడ్డు/ బస్సు మార్గం : సమీప బస్ స్టాప్ - అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుండి అద్దంకి కి బస్సులు కలవు. ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెల్లు బస్సు ఎక్కవలెను. అద్దంకి నుంచి సింగర కొండకు ప్రతి 30 నిముషములకి బస్సులు ఉన్నాయి. కారు ద్వారా వెళ్ళు యాత్రీకులు అద్దంకి నుంచి సింగర కొండ మార్గంలో వెళ్లవలెను.

త్రిపురాంతకం క్షేత్రచరిత్ర :
శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది. పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్ర పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. పాపనాశనం, అంగారేశ్వర, మూల స్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లిఖార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు.

శ్రీ త్రిపురంతకేశ్వర స్వామి ఆలయం, త్రిపురంతకం గ్రామం & మండలం, ప్రకాశం జిల్లా -523326, ఆంధ్రప్రదేశ్.

పంచముఖేశ్వర :
పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే శివ లింగాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ క్షేత్రంలో ఒక వేయి నూట పదహారు శివలింగాలు ఒక వరుస క్రమంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి శివలింగానికీ పంచలోహ నాగాభరణం అలంకరించారు. ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది. ఇక ఈ శివలింగం గర్భాలయంలో కాకుండా మంటపంలో ఉండటం మరో విశేషం.

ఒక్కసారి ఓం నమశ్శివాయ అనే పంచాక్ష్రీ మంత్రాన్ని జపించినయెడల, 1,116 సార్లు జపించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

వరాల తల్లి... వల్లూరమ్మ :
కోరిన కోర్కెలు తీర్చు తల్లిగా, విఘ్నములు బాపు కల్పవల్లి, సంతతికి కలిగే ఆపదల నుండి గాచు అమృతవల్లిగా, దుష్టశక్తులను అంతం చేయు సర్వశక్తిమయిగా వివిధ రూపాలలో రక్షిస్తుంది. సహజంగా తండ్రి ఆలన లేకున్నా మానవుడు జీవించగలడేమో గాని, తల్లి పాలన, లాలన లేకుండా బ్రతుకు దుర్భరం. సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ప్రాధాన్యతను నంతరించుకొని, నేటికిని దినదిన ప్రవర్థమానమవుతున్న దేవాలయం శ్రీ వల్లూరమ్మ దేవస్ధానం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి సుమారు 5 కి.మీ. దూరంలో దక్షిణ దిశగా, విజయవాడ- మద్రాసు జాతీయ రహదారిపై నిరంతర వాహనాల రద్దీతో, భక్తుల సందోహాలతో ప్రసిద్దిగాంచిన క్షేత్రం వల్లూరమ్మ క్షేత్రం. క్షేత్రపాలకురాలు శ్రీవల్లూరమ్మే.

వల్లూరమ్మ ఆలయం విజయవాడ–చెన్నై ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉంది. పల్లెవెలుగు బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వల్లూరు గ్రామం ఒంగోలుకు 12 కి.మీ.లదూరంలో ఉంది. బస సౌకర్యాలు ఒంగోలు, టంగుటూరుల ఉన్నాయి. వల్లూరమ్మ దేవస్థానంలో కూడా భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు.
prakasam district famous for, prakasam district tourist places, giddalur famous for, jammulapalem shiva temple, sangameshwara temple prakasam district, ramatheertham in prakasam district, famous temples near chirala, jallapalem temple, prakasam district famous temple list.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.