Sri Kali Devi Temple Information | Dimapur | Nagaland | Hindu Temples Guide

శ్రీ కాళీదేవి ఆలయం, దిమాపూర్, నాగాలాండ్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడి స్థానికులు అమ్మవారికి కాళిక దేవిగా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం నాగాలాండ్ లోని దిమాపూర్ అనే గ్రామం లో కలదు. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంతంలో, ప్రకృతి రమణీయత మధ్య చాలా ప్రశాంతగా ఉంటుంది. దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. దిమాపూర్ లో ఈ ఆలయని కాళీబారి అని పేరుతో పిలుస్తారు.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయం 1956 లో పునః నిర్మించారు అని అక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. కానీ ఈ కాళిదేవి  ఆలయం 17 వ శతాబ్దపు ఆలయం, ఇది అగర్తాలా నుండి 27 కిలోమీటర్ల దూరంలో, కమలాసాగర్ సరస్సు ఎదురుగా ఉన్న కొండపై ఉంది. దీనిని కమలాసాగర్ కాళి ఆలయం అని కూడా పిలుస్తారు. కమలాసాగర్ సరస్సు బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒక పెద్ద సరస్సు. పురాణాల ప్రకారం, ఈ సరస్సును 15 వ శతాబ్దంలో మహారాజా ధన్య మాణిక్య తవ్వారు. ఇసుక రాయితో చేసిన ఆలయంలోని దేవత దుర్గా మాదిరిగానే ఉంటుంది, కాని దీనిని ప్రధానంగా కాశీ రూపంలో పూజిస్తారు.


ఈ ఆలయం జె. సి దాస్ మరియు యం యం మంజూదర్ వీరి కాలంలో ఈ ఆలయం బాగా అబివృద్ది జరిగినది. పూర్వం కొంత మంది రాజుల కాలంలో ఈ ఆలయం పై దాడి జరిగిన తిరిగి భక్తుల సహకారంతో ఆలయ పునః నిర్మాణం జరిగినది. ప్రతి శుక్రవారం మరియు దేవి నవరాత్రి సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 6.00-12.00
సాయంత్రం  : 4.30-7.30

వసతి సౌకర్యాలు :

ఆలయానికి కొద్ది దూరంలోనే ప్రైవేట్ సత్రాలు కలవు. వాటి ధర కూడా అధికంగానే ఉంటుంది.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

దిమాపూర్ నుంచి ఎస్. ఎస్. బస్ స్టాండ్ కి చేరుకుంటే అక్కడి నుంచి ఈ ఆలయానికి కేవలం 1కి.మీ దూరంలోనే ఉంటుంది.

రైలు మార్గం : 

దిమాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి 2.5కి.మీ దూరంలో కలదు.

విమాన మార్గం 

దిమాపూర్ లోని విమానాశ్రయం నుంచి ఈ ఆలయానికి 9కి.మీ దూరంలో ఉన్నది. కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

శ్రీ కాళీ దేవి ఆలయం ,
కాళీ బారి,
దిమాపూర్,
నాగాలాండ్.
పిన్ కోడ్ - 797117

Key words : Sri Kali devi Temple , Dimapur , Famous Temples in Nagaland , Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS